కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నిమిషమైన శ్రీరామ యనరాద - నిత్యముగాదీ మానవ జన్మము॥
సామ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నిమిషమైన శ్రీరామ యనరాద - నిత్యముగాదీ మానవ జన్మము॥
అనుపల్లవి:
అమిత మహిమ గలవాడని రాముని
ఆ మహాదేవుడే - సన్నుతించుచుండగ॥
చరణము(లు):
హరిహర మంత్రమునకు - జీవవర్ణాత్మకుడు
సురరిపురావణుని నిగ్రహించినవాడు॥
పరమభక్తులనెల్ల పాలించువాడు
పరమపురుషుడతడె - వాసుదేవుడని దెలసి॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nimiShamaina shrIrAma yanarAda - nityamugAdI mAnava janmamu\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )