ద్విపద -

ఛందస్సు నేర్చుకొనేవారి పాఠము - 3

లక్షణములు - రెండు పాదములు
పాదమునకు మూడు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము
మూడవ గణములో మొదటి అక్షరమునకు అక్షరసామ్య యతి
ప్రాస ఉన్నది
పాదాంతములో విరామము ఉన్నది, అనగా పాదాంతములో పదము కూడ అంతము కావాలి

బహుశా తెలుగు ఛందస్సులో చాల అందమైనది ద్విపద.

ఉదాహరణము -

రెండు పాదమ్ములన్ - బ్రీతితోఁ గొల్తు
మెండుగా నిన్నె యీ - మేదినిన్ దల్తు

గణ విభజన -

రెండు పా|దమ్ములన్ | - బ్రీతితోఁ | గొల్తు
మెండుగా | నిన్నె యీ | - మేదినిన్ | దల్తు

రెండు పాదములలో ఇంద్ర గణములు "రాధికా" గణములు, అనగా ర-గణములు (UIU). చివరి సూర్య గణము "హర్ష" గణము, అనగా హ-గణము (గలము UI).

యతి - రెం-బ్రీ, మెం-మే
ప్రాస - ండు
పాదాంతములో విరామము ఉండడము వలన గానయోగ్యము.
"గొల్తు"-"దల్తు" అంత్యప్రాస పద్యమునకు ఒక అదనపు ఆభరణము.

ఎన్నో జానపద గేయాలు ద్విపదలో ఉన్నాయి, ఉదా. కలవారి కోడలు - కలికి కామాక్షి, ఇత్యాదులు.

ద్విపదపైన నా వ్యాసము ఛందస్సు Files Sectionలో ఉన్నది. చదవండి. ఈ వ్యాసము "ఆటా" వారి జ్ఞాపికలో ప్రచురించబడినది.

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
dvipada -

ChaMdassu nErchukonEvAri pAThamu - 3

laxaNamulu - reMDu pAdamulu
pAdamunaku mUDu iMdra gaNamulu, oka sUrya gaNamu
mUDava gaNamulO modaTi axaramunaku axarasAmya yati
prAsa unnadi
pAdAMtamulO virAmamu unnadi, anagA pAdAMtamulO padamu kUDa aMtamu kAvAli

bahuSA telugu ChaMdassulO cAla aMdamainadi dvipada.

udAharaNamu -

reMDu pAdammulan - brItitO@M goltu
meMDugA ninne yI - mEdinin daltu

gaNa vibhajana -

reMDu pA|dammulan | - brItitO@M | goltu
meMDugA | ninne yI | - mEdinin | daltu

reMDu pAdamulalO iMdra gaNamulu "rAdhikA" gaNamulu, anagA ra-gaNamulu (#UIU#). chivari sUrya gaNamu "harsha" gaNamu, anagA ha-gaNamu (galamu #UI#).

yati - reM-brI, meM-mE
prAsa - MDu
pAdAMtamulO virAmamu uMDaDamu valana gAnayOgyamu.
"goltu"-"daltu" aMtyaprAsa padyamunaku oka adanapu aabharaNamu.

ennO jAnapada gEyAlu dvipadalO unnAyi, udA. kalavAri kODalu - kaliki kAmAxi, ityAdulu.

dvipadapaina nA vyAsamu ChaMdassu #Files Section#lO unnadi. chadavaMDi. ee vyAsamu "aaTA" vAri j~nApikalO prachuriMchabaDinadi.

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము