ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
దండకారణ్యప్రవేశము
3సరళతాలతమాలసాలహింతాల
కురవకాగురువటకుటజగణ్యంబు
చండాంశునిభమునిజనశరణ్యంబు
గండకహర్యక్షగవయ వేదండ
గండభేరుండాదిఖగమృగోద్దండ
దండకారణ్యంబు దరియంగఁజొచ్చి
వేదనాదములచే విస్తార హోమ
వేదులచేతఁ బవిత్రంబులైన
పర్ణశాలలయందుఁబవనాంబు జీర్ణ
పర్ణాదులగుచుఁ దపంబుగావించు
మునులచే మిగుల సమున్నతి నొప్పు
జననుత తాపసాశ్రమములు వెక్కు
గనుఁగొంచు వారలు గావించుపూజ
లనురక్తిఁగైకొంచు ననుజుండుఁదాను

  1. ↑వాల్మీకి భాస్కరరామాయణములయందు దండకారణ్య ప్రవేశ గాథతో నరణ్యకాండము మొదలిడుచున్నది
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )