| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అరణ్యకాండము |
|
గనుఁగవవిందుగాఁగాంచి యందొక్క మునిచేతఁదమరాక 63మున్నెఱింగించి 64చని చొచ్చి మునిపతిచరణపద్మముల కనురాగమున మ్రొక్క నక్కునఁజేర్చి దీవించి వేవేల తెఱఁగుల భక్తి భావించి సంతుష్టిపరులఁ గావించి: “యోరామ! శుభనామ! యుత్పలశ్యామ! క్రూరదానవభీమ! గుణధామ! నీవు మునులభాగ్యమ్మున మునివృత్తిఁ65దాల్చి వనములఁ66దపసివై వర్తింప వచ్చి ‘దనుజులఁజంపెదఁ దలఁకకుఁడింక.’ నని ప్రీతి మునులకు నభయంబు లిచ్చి కరుణించి తన విని కాకుత్స్థతిలక! పరమసంతోషసంపన్నుఁడ నైతి.” నని యర్థిఁబూజించి యతులదివ్యాస్త్ర ఘనశస్త్రకోదండ కవచాదు లిచ్చె. నిచ్చినఁ గైకొని యినకులాధీశుఁ డచ్చట సుఖగోష్ఠి నా రాత్రి నిలిచె. మఱునాఁడు సంధ్యాసమాధులు దీర్చి పరమాత్ముఁ డమ్మునిపతికి మ్రొక్కంగ దీవించి పూజించి తెఱఁ గొప్ప రామ దేవుని వీక్షించి ధీమంతుఁడైన ఘటసంభవుఁడు భావికార్య మూహించి పటువాక్యముల రామభద్రుతో ననియె. “శ్రీరామ! గోదావరీసరిత్పుణ్య వారి శీతలగంధవాహకుమార ఘటితనర్తనవనాంగణలతానటికి జటికృతపూజధూర్జటికి నాపంచ వటికిఁబొ.”మ్మన రఘువర్యుఁడచ్చటికి ఘటసూతి వీడ్కొని కదలిపోవుచును[వా.రా. సర్గ 14] |