ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
మారీచ పునర్బోధము
ననవుడు మారీచుఁ డా నీచుఁజూచి
ఘనభీతి నేచి శోకసముద్రవీచి
మునిఁగిమూర్ఛిల్లి లేచి మోమోటద్రోచి:
“దనుజేశ! మఱియు నీతలఁపెట్టువుట్టెఁ?[వా.రా. సర్గ 37-41]
గూడునే యిటువంటికొఱగానిత్రోవ?
యోడక నీ కెవ్వఁ డుపదేశ మిచ్చె?
సుకసుకంబున నుండి సుత సోదరాప్త
సకలబాంధవులతోఁ జావఁగోరెదవు?
కటకటా! యెవ్వనిఁగాఁజూచినావొ?
కుటిలరాక్షసకోటికుల భీము రాము.
నేను బాల్యమునందునెఱుఁగుదుఁ గొంత:
యా నిత్యకల్యాణుఁడసమసాహసుఁడు;
అడరివిశ్వామిత్రుయాగంబుఁగావఁ
గడఁగి యాతఁడు వచ్చి కాపున్నచోట
బలిమిమై నేను సుబాహుండుఁబోర
నలుక సుబాహు నొక్కమ్మునఁద్రుంచె;
నొకకోలఁబుచ్చి పయోధిమధ్యమునఁ
బ్రకటితగతి నన్నుఁబడవైచె నుఱక;
యకృతాస్త్రుఁడై బాలుఁడై పిన్ననాఁడె
యకలంకుఁడిట్టి శౌర్యముఁజూపినాఁడు;
నేఁడస్త్రబలశౌర్యనిధియైన యతని
వాఁడిమిఁజెనకి యెవ్వరు నిల్చువార?
లిప్పటిశౌర్యంబు నెఱుఁగుదుఁగొంత;
దప్పక విను ముగ్రదానవాగ్రణుల
నిరువురఁదోఁకొని యేఁబూర్వరోష
భరమున వ్యాఘ్రరూపముదాల్చి యతని
దపమునఁగృశుఁగాఁగఁదలచుచుఁబోవ
నపు డేమిచెప్ప మూఁడంబకంబులను
ముగ్గురి నేసిన మ్రొగ్గి యిద్దఱును
మ్రగ్గి; రాయుశ్శేషమహిమ యెట్టిదియొ?
యే నొక్కవిధమున నిక్కడఁ గూలి
ప్రాణంబు లుండుటఁబట్టిచూచుకొని
యంతనుండియు రామునతులవిక్రమముఁ
జింతించి నా లోనిచేవ వో విడిచి
రవమన్న రథమన్న రమణీయమన్న
రవియన్న రతియన్న రత్నంబులన్న
మఱియు రేఫాదినామముల లెవ్వివిన్నఁ
దఱచైనభీతి నాతనిఁగ నెన్నుచును
నీ విధిఁదపసినై యిందున్నవాఁడ.
రావణ! యెఱుఁగవు రాముపౌరుషముఁ!
దలఁపదు తనరోఁత; తనుఁజూడదింత
నలిరేఁగి మనశూర్పణఖ తానుబోయి
యనుపమగుణధాము నభిరాము రాముఁ
గనుఁగొని యీ రీతిఁగామింపఁదగునె?
తనకు నా వేషంబు తానె కావించు
కొనియె; నిందుకు మదిఁగ్రోధించి పోయి
పరుషత రఘురాముబాణాగ్ని శిఖల
ఖరదూషణాదిరాక్షసులు నీఱైరి.
వీరికై నీ వేల విపరీతబుద్ధి
శ్రీరాముఁబగగొని చెడఁదలంచెదవు?
ఇది విచారంబుగా; దిది బుద్ధి గాదు;
ఇది నీతిగా; దింక నీతలం పుడుగు.
నీవు లంకకుఁబోయి నెమ్మది నుండు;
మే విధంబుననైన నిది యకార్యంబు;
కావున నిపుడేను గడఁగిపోయినను
బోవ రామునిచేతఁబోవుఁబ్రాణమ్ము;
లేను నీ కపకారమెన్నఁడు సేయ;
నేను నీ కొక కీడు నిచ్చఁజింతింపఁ;
బూని నీవిపుడు నా బుద్ధిఁబాటింపు;
మే నేమిచెప్పిన హితవుగాఁగొనుము;
“ఒచ్చె మెంచక కార్యమొనరించితేని
నిచ్చెద 209సగరాజ్య 210మే.”నంటి విపుడు
చెచ్చెర రఘురాముఁజెనకి యే బ్రదికి
వచ్చుట కిందునెవ్వఁడు పూఁట చెపుమ?
యని యిట్లు మారీచుఁడాడు వాక్యములు
విని రావణుఁడు క్రోధవివశుఁడై పలికె.
“లోకైకభర్తఁ; ద్రిలోకభీకరుఁడ;
నా కెక్కుఁడని యొక్కనరునిఁజెప్పెదవు;
కడుఁబ్రాణభయమునఁగాఱు లాడెదవు;
విడువక నాకొక్క వెఱపు సెప్పెదవు;
నన్ను రాజనుచు మనంబునఁగొనవు;
చిన్నపుచ్చెద వేను జెప్పినపనులు;
నీ వేమిటికి నాకు? నినుఁదోడు 211పిలువ
నీ విధి వచ్చెనే యిప్పుడు నాకు!”
నని212చంపఁగడఁగిన నతనికోపంబుఁ
గనుఁగొని మదిలోనఁ గడు విచారించి
మారీచుఁ“డీ నీచ మరణంబుకన్న
నా రాముచేఁజచ్చుటది యొప్పు.”ననుచు
దనుజాధిపతిఁజూచి: “తగునీతి నీకుఁ
గొనకొని 213చెప్పినఁగోప మేమిటికి?
మఱి బుద్ధిసెప్పిన మంత్రులఁబట్టి
నఱుకఁదలంచుభూనాయకుల్‌ గలరె?
నీ వేమిచెప్పిన నీ చెప్పినట్ల
గావింపఁగలవాఁడఁ గడముట్ట.”ననిన
ననురాగమునఁబొంది యతని మన్నించి
తనరథ మెక్కించి తద్దయుఁబ్రీతి
నసమానవేగుఁడై యతఁడును దాను
నసురాధిపతి వచ్చెనట పంచవటికి.
నట్టిద కాదె కామాతురబుద్ధి
యెట్టును జెడుత్రోవ నేటికి 214రోయు?

  1. ↑మీవంటి
  2. ↑వేఁడ
  3. ↑చంద్రహాస మొయ్యననొఱఁబెఱుక
  4. ↑చెప్పితిఁ
  5. ↑మాను
  6. ↑భవించుటయు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )