| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
“గరుణ దేవాసుర కదనంబునందు వరములు రెండు భూవరుఁడు నా కొసగె: నవనీశు నవిరెండు నడిగి మా భరతు నవనికిఁ బతిసేయుమంటి నొక్కటికి; నెడపక పదునాలుగేండ్లును నిన్ను నడవులఁగా 92పున్పుమంటి నొక్కటికి; ననవుడు“నౌఁగాక.”యని93యిచ్చ నీకు వినుపింప 94మీ తండ్రి వెఱచియున్నాఁడు. కావున జడలు వల్కలములు గట్టి నీ వింకఁదపసివై నృపవేష ముడిగి 95జనులచే దశరథజనపతి బొంకఁ డనిపింపవలతేని నడవుల 96కరుగు; పొ.”మ్మన్న97విని మొగంబునఁజిఱునవ్వు గ్రమ్మ మాటలనొండుగసటులేకుండఁ, గరుణయుఁ98దెగువయు గరిమంబుఁదోపఁ బరమపుణ్యుఁడు రామభద్రుఁడు వలికె: “నిటుసేయుమన్నవాఁ డినకులాధీశుఁ డట;నా సహోదరుండట రాజ్యకర్త;[వా.రా. సర్గ 19] యటమీఁద నీ కోర్కియట; వేఁడనేల? కటకటా! కైకేయి, కడుముగ్ధవైతి? వింతమాత్రమునకై యిన99వంశవిభుఁడు సింతింపనేటికిఁజిత్తంబులోనఁ? దన జనకునిమాట దాటినవాఁడు దనయుఁడే తలపోయ ధర దాయగాక! యే నేమి, నా తమ్ముఁడేమి, యీ భూమి, బూనుటకును? బుణ్యపురుషుఁడైయున్న భరతునిదెస నాకుఁబ్రాణంబులైన సరకుగావనిన, రాజ్యము నాకు సరకె? యనవుడు ముదమంది యా కైక పలికె: “మనుజేంద్రతనయ!100నీ మాట కేనిపుడు భరతునిఁ దోడ్తేరఁబనిచెద;101నీవు నరుగు; మీ వడవుల కరుగునందాఁకఁ గుడువఁడు,వలుకఁడు,గూర్చుండఁ,డిట్ల పడియుండునృపుఁ.”డంచుఁబల్కెఁ బల్కుటయు “గటకటా!తగునె యీ కఠినోక్తు.”లనుచుఁ బటుమూర్భతో నేలఁబడియె నా రాజు. అయ్యెడ శ్రీరాముఁ డవనీశచంద్రు నొయ్యనఁబట్టి శైత్యోపచారములఁ దెలిపి యెంతయును బోధింపుచు మఱియుఁ బలికెఁగైకను జూచి పరమహర్షమున: “నింత యేటికిఁ102జింత?యిదియెంత నాకు? నంతరంగంబున ననుమానపడకు. పరికించి ధర్మంబు పాటింతుఁగాని కరమర్థి103నర్థంబుఁగామింప నేను. వేయేల? విభునాజ్ఞ వినఁబడకున్న నీ యాజ్ఞఁగడవను; నిక్కువంబరయఁ. జారుల శీఘ్రసంచారుల ఘోట కారూఢులుగఁజేసి యనిచి వేవేగ కరమర్థి104నీ లగ్నఘటికలయందె భరతునిఁబిలిపించి పట్టంబు105గట్టు; మిదె యరణ్యములకు నేఁగెద.”ననుచు వదనాబ్జ మలరంగ వలగొని వచ్చి “తనతల్లికిని సుమిత్రావధూమణికి జనకనందనకు నీ చందమంతయును వినుపించి వారల వెస నూఱడించి చనుదెంతు నోయమ్మ!సందియపడకు.” మని రాజునకు మ్రొక్కి,యా కైకకెఱఁగి తనుఁగొల్చి సౌమిత్రి దగిలిరాఁగదలి, చెలువారఁబట్టాభిషేకంబుకొఱకు లలి నమర్చినమంగళద్రవ్యములకు నుచితప్రదక్షిణ మొనరించి, చిత్త మచలమై యవికారమై వికసింప నీ వార్త దమతల్లి కెఱిఁగింపఁదలఁచి పోవంగ నట యంతిపురములోపలను. ‘రాజ్యపట్టము మాని రాముండు లోక పూజ్యుండు కాననభూమి కేఁగెడిని.’ అనుమహాకలకలం బంతఃపురమున వినఁబడ దశరథువెలఁదులు గలఁగి: “యే భక్తి కౌసల్యయెడను గావించు నా భక్తి మనయందు నట్ల కావించు[వా.రా. సర్గ 20] నా గుణాలంకారు నా మహోదారు నా గిరివరధైర్యు నా శౌర్యధుర్యు నా పుత్త్రరత్నంబు నకట! కానలకు, భూపాలుఁడేమని పొమ్మన నేర్చె? వీఱిఁడియై రాము విపినవాసమున కాఱడిఁబుచ్చంగ నౌనమ్మ!” యనుచు మీఱిన వగలతో మేదినీనాథు దూఱుచు శోకింపఁదొడఁగి రందఱును |