ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
రాముఁడు లక్ష్మణుని యుద్రేక ముడిగించుట
“బలువిడిఁ దమతండ్రిపనుపునఁదొల్లి
చలమునఁదమ తల్లిఁజంపె భార్గవుఁడు.
138తఱుగనికినుకమైఁదమతండ్రి వనుపఁ
దఱిగొని యొక గోవుఁదఱిగెఁగుండినుఁడు.
తన మనోహరమైన తారుణ్య మొసగి
తన తండ్రిముదిమిని దాల్చెఁబూరుండు.
తమతండ్రి139పనుపునఁద్రవ్వరే? తొల్లి
తమకించి సగరనందను లంబునిధిని?
140గడఁగి తండ్రిపనుపుఁగైకొని నాకు
నడవుల నుండుట యది యెంతవెద్ద?
నీ వల్లభునిమాట నీకును నాకు
భావించి చేయుట పరమధర్మంబు.
ఈ లక్ష్మణుఁడు బాలుఁడేమియు నెఱుఁగఁ
జాలఁడు వీర విచారంబెకాని.”
యని నవ్వుచును రాముఁడను జన్ముఁజూచి
తనలోని శాంత141మంతయుఁదోపఁబలికె:
“నీ విక్రమంబును నీ భుజాబలము
నీ విలువిద్యయు నీ సుబుద్ధియును
నీ మగతనమును నే నెఱుంగుదును
సౌమిత్రి! నా యెడ సద్భక్తి గలిగి
యెంతసాహసము నీ విపుడు గోరితివి;
యెంతటిబుద్ధి నా కీవు సెప్పితివి?
గొనకొని యిటు వేఁడుకొన్నది దల్లి;
యనుకంప నిచ్చి పొమ్మన్నాఁడు దండ్రి;
యిలయెల్లఁజేకొని యీ రాజ్యపదము
నలి నేలువాఁడింక నా సహోదరుఁడు;
బలువిడి నెవ్వరిపై నల్గె దీవు?
బలగర్వములు సూపఁబాడియే నీకు?
నర్మిలిఁదండ్రివాక్యము సేయుకంటె
ధర్మంబు గలదె? యా తండ్రివాక్యంబు
142సేయమికంటె దుష్కృతమును గలదె?
వేయువిధంబుల వెదకిచూచినను
జనకుని పనుపవశ్యము నీకు నాకు;
జననులకును జేయ సహజధర్మంబు;
గాన యాతనిపంపు గైకొని యేను
కానల143కేఁగుట గాదనవలదు.
పరమపావనులైన భానువంశజుల
చరితంబు నీకు విచారింప 144దగదె?
కావలసినపనుల్‌ గా కేల మాను?
దైవయత్నము145లవి దాటంగ146వశమె?”
యని పెక్కుభంగుల ననునయంబెసగ
ననుజన్ము బోధించి:“యనఘాత్మ! నీవు
నాకు భక్తుఁడ వయ్యు నాపంపు నెమ్మిఁ
గైకొని కావింపు గారవం బెసగ.
నీ నిష్ఠురక్రమమెల్లఁ బోవిడువు;
మే నరణ్యములకు నేఁగెద; వెనుక
నెల్లభంగుల భక్తి నెడపక కొలిచి
తల్లిదండ్రులమనస్తాపంబు మాన్పు.”
మనిన లక్ష్మణుఁడప్పుడా147కోప ముడిగి
తన మది148రఘురాము తలఁపెల్ల నెఱిఁగి
జడిసి యూరకయుండె. సాధ్వికౌసల్య
గొడుకు తెంపునకు మిక్కుటమైన వగలఁ[వా.రా. సర్గ 24]

  1. ↑తవిలిన… చవిగొని (సరగున)… జంపె
  2. ↑మాటకు దాటక సగరు- లమితపరాక్రములందఱుఁ దెగిరి
  3. ↑తడయకపోయి మా తండ్రి పంపునను
  4. ↑మెంత
  5. ↑త్రోయుటకంటెను దురితంబు
  6. ↑నుండుట
  7. ↑వలదె
  8. ↑లిల
  9. ↑ఁదరమె
  10. ↑టో
  11. ↑రాముని
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )