| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
ననఁగ వసిష్ఠుండు నలుకతోఁగైకఁ గనుఁగొని: “కులనాశకారిణి వీవు భూపాలుఁగడు మోసపుచ్చితికాన. యీ పాపమరయంగ నెందును గలదె? రాజపత్నులయొద్ద రఘురామునాజ్ఞ నీ జనకజ నుండ ని; మ్మట్లు గాక వలదన నేల? యీ వైదేహి సనఁగఁ గలయఁబౌరులతోడఁగాంతారములకు నేమునుఁజనువార; మింతియె కాదు; రామచంద్రునిఁగొల్చి రమణీయలీల భరతశత్రుఘ్నులు బలసి వచ్చెదరు; పరికింప నీవ యీ పాడూరనుండు.’ పోలంగ రాముండు పుణ్యశీలుండు లీల‘నున్నదియూరు లేనిది పాడు.’ కరమర్థి నడవి రాఘవుఁడు వర్తింప భరతుఁడీ సామ్రాజ్యభార మెట్లేలు? 226నెఱుఁగవు భరతునిహృదయమేమియును మఱి యీ తెఱఁగువిన్న మండు నీమీఁదఁ; గావున నిది మేలుగా నెన్నవలదు నీ; వదియునుఁగాక, నిష్ఠురవృత్తి శ్రీరామునకును నీ సీతకు నార చీర లిచ్చుటకు నీ చేతు లెట్లాడె? నారచీరలు మాని నవరత్నఖచిత చారుభూషణములు 227సకలంబులైన చీనాంబరంబులు సెలువారఁబూని జానకి దన పరిచారికల్ గొలువఁ జనుఁగాక.”యనుచు నా సంయమీశ్వరుఁడు వినుతభూషాంబరవితతు లిచ్చుటయు సీత యప్పుడు నారచీరలు 228దాల్ప కాతతమతి నుండె. నా సమయమునఁ |