| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
గింకతో జము నుగ్రకింకరుల్ దిగిచి కొంకక చేసిన ఘోరపాపములు ముదలించి బాధింప మొగిఁ బొరల్వారు .......... పరుల మర్మములాడు పరుషంపు నోరుఁ బురుషార్థ మెడలంగ బొంకెడు నోరు గ్రొవ్వి పల్కెడునోరుఁ గొండెంపు నోరుఁ బ్రువ్వులు దొలఁగంగఁ బొరలెడువారు విస్రంభములు వెంచి వీచులు సొరవ నస్రప్రవాహినియైన వైతరణిఁ గడచు మంటలుఁ జాలఁ గాలిన ఇసుము నొడలఁ జల్లఁగఁ బడి వడి వేఁగువారు నసిపత్రవనములో నంగముల్ దునిసి వసము గాకుండఁగ వడిఁ ద్రెళ్లువారు క్షురధార నసిధారఁ గూలెడువారుఁ గరము రౌరవమునఁ గ్రందుకొన్వారు క్షారకల్లోలినీ కర్కశగ్రావ ఘోరస్థలంబులఁ గ్రుమ్మరువారుఁ బానతోయంబులు పలుమాఱు వేఁడి కానక నోరెండఁగా నేడ్చువారు నెన్నఁడు నోటికి నేకూడులేక యన్నంబు వెట్టరే యని వేఁడువారు దారుణగతిఁ బట్టి తప్తలోహములు వారక పోయంగ వడిఁ గ్రోలువారు మంటలుగల లోహమయకంభములను నంటఁగట్టిన నేచి యటు వేగువారు నిప్పులయేటిలో నెరిఁగాళ్లు వట్టి యప్పళింపఁగ మండి యట మ్రగ్గువారు భీతి నాలుకలచేఁ బెదవులు దడవి యాతతదురవస్థ లందెడువారుఁ జెన్నంటి మడుగుల చీఁకట్లు గవియు చున్న కూపంబుల నొగి నుండువారు వెలవెల్లనై తలల్ విడుచున్నవారు మలపంకలిప్తులై మాసినవారు నెంతయు బడుగులై యిమ్ములు దక్క నంతకంతకు దీనులై యున్నవారుఁ గనలఁ గాఁగిన పట్టుకాఱుల బట్టిఁ తనువులు గదియంగఁ దపియించువారు నాయసతుండంబులగు వాయసములు పాయక నొప్పింప భయమందువారు ఘనదండనిహతులఁ గడుఁగూలువారు మునుకొని పెనుగాలముల వ్రేలువారుఁ గరకసంబులఁ ద్రెంచి కత్తులఁ గోసి గొఱపంబులను డుస్సి కొఱవుల జూఁడిఁ వదరుచుఁ బెనములపైఁ ద్రోచివైచి వదలక బాధింప వాపోవువారు నవయంబుల కండలవి గోసి నోరి కవి గొమ్మనుచు నీయ నంటనివారుఁ దలలు క్రిందుగ శూలతతులు గీల్కొలుప మెలఁగలే కాసన్నమృతిఁ బొందువారు నిలువంద గాదులు నిండింప మేను లులుకంగ నోర్వలే కొరలెడువారు నవరంధ్రములఁ గాఁగినట్టి నారసము లవమాన్యత నొనర్ప నడలెడువారు వ్రచ్చి వడియలచేఁ బటురౌద్రమెసఁగ నచ్చలంబున మోఁద నటు వేగువారు తెరలెడు నూనిలోఁ దెచ్చి వైచినను నొరలుచు నిర్జీవమొందెడువారుఁ జండకరోదగ్రశస్త్రసంఘములఁ జెండివైవఁగ భీతిచేఁ గ్రాఁగువారు నీతులన్నియు దప్పి నెరి నొచ్చి మిగుల నాతతదురవస్థ లందెడువారు నివిగాక మఱియును నెడపక చేయు వివిధబాధలకోడి విలపించువారు వరుస నానాగీతవాద్యనృత్యాది వరసుఖక్రీడల వర్తించువారుఁ దలకొని మున్నన్నదానముల్ సేసి పొలుచు దివ్యాన్నముల్ భుజియించువారు గృహదానములు చేసి కీర్తింపఁదగిన గృహరాజముల లీలఁ గ్రీడించువారుఁ దవిలి కాంచనరత్నదానముల్ జేసి వివిధభూషణముల విలసిల్లువారు ననిశంబు ధర్మంబు లర్థితోఁ జేసి వినుతతేజంబుల వెలుఁగొందువారు నెక్కడఁ జూచిన నెడలేక చూడ్కి కక్కజమై తోఁప నందంద గాంచి కడలేని బాధలఁ గడుఁదూలువారుఁ గడిమిమై విడిపించు కాలకింకరులుఁ గడకతో నాపఙ్క్తికంఠున కెదుర నడతెంచి హలహల నాదముల్ చెలఁగ నుద్గతద్యుతులతో నోలిశూలములు ముద్గరంబులు పటుముసల ఖడ్గములు పరిఘల శక్తులు పటుగద లడరి వరుసఁ బుష్పకముపై వైచిరి మఱియు వడిగొని జముసేన వారెల్లవారు విడువక తరుశిలావిశిఖముల్ వఱపి??? దిక్కులు వెలుఁగ నేతెంచు పుష్పకము నొక్కింత దడవాఁగ నుడువీథినదియు ఘనమేఖలంబైన కనకాద్రిశిఖర మనఁ దోఁచె యమకింకరావృతంబగుచు బహుశిలాదులను బుష్పక మెంపఁబడియుఁ బ్రహతంబుగాకుండె బ్రహ్మతేజమున నంత రావణమంత్రు లలుకతోఁ గణఁగి యంతకు మంత్రుల నతిఘోరలీల దాఁకి మేనులు రక్తధారలు దొరఁగ వీఁకదాఁకుచు వారి వివిధాయుధములఁ దెరలించి మరలించి దివిజారిమీఁదఁ గురిసిరి నెత్తురుల్ గూలశూలములఁ బుష్పితాశోకంబుఁ బోలి రావణుఁడు పుష్పకంబున నొప్పి బొమలు గీలించి సొరిది కుంతంబులు శూలముల్ గదలు .......... నంతకు సేనపై నందంద గురియ నంత నాసైనికు లందంద గడఁగి తొరఁగు కుంతాదులు తునియలై చెదర శరజాల మడరించి సరిఁ జుట్టుఁ దిరిగి బిట్టుశూలంబులు భిందివాలములఁ గట్టల్క నొప్పించి కడిమి నార్చుటయుఁ గనుఁగొని తన దొడ్డకవచంబుఁ బూని ఘనరోషమునఁ బుష్పకము డిగ్గ నుఱికి పురము లేఁచిననాఁటి భూతేశు లీలఁ బరఁగ విల్ గొని పాశుపతము సంధించి నిండారఁ దెగఁగొని నిలు నిలుండనుచు మండి యాజముసేన మడియంగఁ జేసి వసుమతి కంపింప వడి సింహనాద మెసగింప మంత్రులు నేచి తోనార్వ నానాద మప్పుడా యంతకుఁ డెఱిగి మానైన తనసేన మడియించెననుచు భూరిలోచనములఁ బొరినిప్పు లురల దేరుసారథిచేతఁ దెప్పించి యెక్కి |