| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
బహుశిష్యగణములు బలిసి తన్ గొలువ మహనీయమయిన యమ్మఖవాటమునకు చనుదెంచినంత నాసంయమీంద్రునకు మునిగణసహితుఁడై ముదమంది నృపుఁడు మునిపూజ లొనరించి మునిగేహవాటి వినుతింపఁదగుచోట విడియించె నంత విశదాత్ముఁ డఖిలార్థవిదుఁడు వాల్మీకి కుశలుఁడై కూర్చుండ కుశలవుల్ వచ్చి వినతులైనను వారి వేడ్క దీవించి కనుగొని మీరెప్డు గవ వాయకిందు వనముల ఫలముల వ్రతనిష్ఠ గొనుచు .......... నగరివాకిట జననాయకు సభను నొగి జతుష్పథముల నుద్యానములను రాజితగతినొప్పు రచ్చల దేవ రాజాలయంబుల రాజమార్గముల యాగశాలల తాపసస్థానములను రాగంబుతోడ నీరామాయణంబు సరి నొప్పు నిరువది సర్గల లెక్క సరసంబుగాఁ గూడి చదువుఁడెల్లెడల మీరెవ్వరన్న వాల్మీకి సంయమికి నారయ శిష్యులమని జెప్పుడెలమి నారదు చేవీణెనాదంబుఁ గలుగు చారువీణాతంత్రి చక్కగా దిగిచి చని రక్షగావించు జననాయకుండు జనకుండు గాన యీజనలోకపతికి తప్పక వినిపింప దగవు విన్పింప డొప్పుగా నెల్లిట నుండి మీచదువు |