| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నంత సూర్యుడు గ్రుంకె; నా సేతువునకు నెంతయు బలుకాపు లిడి బలీముఖులు వచ్చి వేలముల నివాసదేశములఁ జొచ్చి యెంతేనియు సొంపుతో నుండఁ గృతకృత్యుఁడగు రాముకీర్తిపుష్పములు చతురతమై వెదచల్లినయట్లు కరమొప్పఁజుక్కలు గాన్పించె మింటఁ. వరకళాయతిసీమ వలరాజుమామ పొలుపొందుకలువలపోరానివిందు కలసినజక్కవకవఁ బాపుమందు పాలవెల్లిని ద్రచ్చి పడసినవెన్న శూలియౌఁదలపువ్వు చుక్కలనవ్వు నెఱి చకోరములకు నెలనెలపంట యుఱవేది విరహుల నుడికించుమంట గగనంబుతొడవు దొంగల గుండెదిగులు యొగి నబ్ధిఁబొంగించునూఱటపట్టి హరిహరబ్రహ్మల యానందసృష్టి సరసిజరిపుఁడైన చంద్రుండు వొడిచె. నినుపారి కలశాంబునిధి వెల్లివిరెసె ననఁగ వెన్నెల వర్వ నట నిద్రలేక “యెన్నఁడొకో! సేతువేము గట్టెదము? ఎన్నఁ359డొకో లంక 360యేము సూచెదము? ఎన్నఁ361డొకో దానవేంద్రుండు గూలు? నెన్నఁ362డొకో సీత యీ రాముఁగూడు? నెప్పుడు వేగునో యీ రేయి యింక నప్పుడే వచ్చితి మాత్మలో సొలసి? యేలవచ్చితిమి, రేయెల్ల నందుండి యోలి సేతువుఁగట్టుచుండక?”యనుచు నా రేయి గడపి సంధ్యావిధుల్ దీర్చి చారుతరంబుగా సకలవానరులు నొండొరుఁజీఱుచు నుత్సాహ మొప్ప నొండొరుఁగడవంగ నురువడితోడఁ బృథివీధర్మములు పృథివీజములును బృథులసత్త్వంబునఁబెఱికి వేతెచ్చి యంబుధిలోవైవ నపుడు సుగ్రీవుఁ డంబరవీథికి నరిగి వేగమున వెరవారఁగాఁబట్టి వింధ్యాద్రిశిఖర మరయోజనము నిడుపైనది 363తెచ్చి యా సుషేణునిచేతి కందియిచ్చుటయు నా సుషేణుండిచ్చె నా నలునకును. దారాసుతుండును దర్దురశైల మారూఢగతిఁదెచ్చి యబ్ధిలో వైచె. మలయాద్రి శృంగంబు మ్రాఁకులతోడ నలునకు నీలుఁడున్నతగతి నిచ్చె, ద్వివిదుండు మైందుండుఁదెచ్చి యా వార్ధిఁ గవగూడి వైచిరి గ్రావంబు లెత్తి. గజుఁడు గవాక్షుండు గంధమాదనుఁడు భుజబలాఢ్యులు శరభుఁడు గవయుండు నిల చలియింప మహేంద్రాద్రిశిఖర ములు దెచ్చి వైచిరి మున్నీటిలోన. నవియెల్ల మునుఁగనీ 364కంటి నలుండు తవిలి యంబుధిఁగట్టెఁ. దరుచరులిట్లు ప్రకటించి తెచ్చు పర్వతములుఁదరులు నొక కేల నంది పయోనిధియందు నునుపంగఁగనుఁగొని యుగ్రకోపమునఁ గనలుచు బలిమిమైఁగరువలిసుతుఁడు చయ్యన నేడు యోజనములకొండ నయ్యెడఁ గొనిరాఁగ నది రాముఁడెఱిఁగి యనయంబు నిరుగేల నంద ననుజ్ఞ యొనరింప నట్లనె యొనరించె నతఁడు. నప్పుడు కపిసేన యార్పులమ్రోఁత యుప్పొంగి వారాశియుబ్బెడి మ్రోఁత తరుగిరు లొండొంటిఁదాఁకెడు మ్రోఁత తరుచరు లొండొరుఁదగఁబిల్చుమ్రోఁత కుదిసిభూతంబులు ఘోషించుమ్రోఁత వదలి దిగ్గజములు వాపోవు మ్రోఁత కడు నగ్గలంబుగా గగనంబు ముట్టి యుడుగక పెల్లైన365యులివు చింతింప బృందారకాసుర బృందంబు లెత్తి మందరగిరి వైచి మథియించునాఁటి యమృతాబ్ధిమ్రోఁతయో యనఁగ నా మ్రోఁత కమలభవాండదిక్తటములు నిండె. నంతట మధ్యాహ్నమైన వానరులు 366శ్రాంతి నొందుటకు వృక్షంబులు సేరి పలుదెఱంగుల మంచిఫలములు నమలి నెలవులఁజల్లని నీరొప్పఁద్రావి నీడల నొక్కింత నిలిచి క్రమ్మఱను వేడుక రెట్టింప వేగంబు మిగుల ‘నా కొండ లెత్తి తే నరుగుఁడు గొంద; ఱీ కొండలను గొందఱెత్తి తెం.’డనుచుఁ బెక్కైనతరువులుఁబెక్కైనగిరులుఁ బెక్కు మొత్తంబులుఁబెక్కువఁ దెచ్చి యూరక నలునకు నొప్పించువారు వారిధిలో367పల వైచెడువారు నట యెదురేఁగి పెల్లందుకొన్వారు నిట తెచ్చి చేరువ నిడియెడువారు నలుఁడందికొనఁగ వానరు లందియొసగ బలుతరుల్ గిరులు నిబ్భంగి మర్నాఁడు నా సేతు విరువదియాఱు యోజనము లీసున బంధించి. రినుఁడంత గ్రుంకె. నప్పుడు సుగ్రీవుఁడాదిగాఁగపులు చెప్పి రప్పనియెల్ల శ్రీరాముతోడఁ. జెప్పి వేలములకుఁజెచ్చెర నరిగి యొప్పెడిసుఖనిద్ర నొంది యా రాత్రి గడుచుటయును రేపకడ బలీముఖులు వడి నందఱును గూడి వారిధిఁగట్ట ‘నేమేమె తెచ్చెద మెల్లకొండలును; నేమేమె తెచ్చెద మెల్ల భూజములు;’ నని పాఱి తరువులు నద్రులుఁదెచ్చి వననిధి లోపల వడి వైచువారుఁ, గొందఱంతయుఁ గనుంగొనుచుండువారుఁ గొందఱు నీడలఁగూర్చుండువారుఁ గొందఱు సేతువుఁగొలవెట్టువారుఁ గొందఱు నిద్రలఁగూర్కెడువారుఁ గొందఱు 368తెలినీరు గ్రోలెడువారు నందఱు నీ క్రియ నలసులైయుండ నప్పుడు రవిచంద్రుఁడై తను పొసగె; నప్పు డింద్రుఁడు నించె నమృతంపుసోన; నప్పుడు చల్లనై యనిలుఁడు వీచె; నప్పుడు సౌరభం బానంద మొసగెఁ; దరుచరులంత నుత్సాహులై శైల తరువు లంబుధి మహోద్ధతిఁ దెచ్చివైవ. నా రభసంబున కతిభీతిఁబొంది వారిధిలోని జీవంబు లన్నియును దెరలుచు నొరలుచుఁ దిరుగఁబాఱుచును నెరియుచు నట దలలెత్తి చూచుచును ‘ముందటిపగిది నమోఘబాణంబు మ్రందింపవచ్చెనో మమ్మెల్ల.’ననుచుఁ దలఁచి యంతటిలోనఁదగిలినభీతిఁ దెలిసి సేతువు గట్టు తెఱుఁగుగా నెఱిఁగి మఱి సంతసంబులు మదిలోనఁగలిగి వఱలు నిజేచ్ఛల వర్తించుచుండె. బంధురంబుగఁగపిపతులు నాఁడబ్ధి బంధించి రెలమి నేఁబది యోజనములు. రవిగ్రుంకె; నంత మర్కటనాథులెల్ల నవి369రళలీల సంధ్యాదులు దీర్చి ‘పంతంబు మెఱయఁగాఁ బదియోజనంబు లింతియ కట్టుట యెల్లి యీ యబ్ధి.’ నని మాటలాడుచు నరిగి వేలముల ననుపమలీల నిద్రానంద మంది యుదయావసరమున నుర్వీశుఁజేరి ముదమునఁగపియూధముఖ్యులు మ్రొక్కి పని విన్నపము సేసి బరవసంబొప్పఁ జని తరువులు మహాశైలంబులెత్తి యనుపమలీలమై నతిశీఘ్రవృత్తిఁ గొనివచ్చి నలునకుఁగొమ్మని యొసగ నప్పుడు శ్రీరాముఁడా సేతువెల్లఁ దప్పక కనుఁగొను తాత్పర్యమొప్ప వనధీశ్వరుండును వనచరాధిపుఁడు దనుజనాయకుఁడును దనుఁజేరి కొలువ సౌమిత్రికరముపై సౌభాగ్యలీల వామహస్తముఁజేర్చి వడిఁగట్టమీఁద సన్నపుదరహాసచంద్రిక లొలయ నన్నరనాయకుఁడటుచూచువేళఁ దరుచరేశ్వరులెల్లఁ దరులును గిరులు బిరుదులై వడిఁబేర్చి పెకలించి తెచ్చి నలుచేతి కొసగ నా నలుఁడవి వుచ్చి తలకొని కట్టె. నాతఱి నొక్క370యుఱుత “గొబ్బున సేతువు గొనసాగవలయు ని371బ్బల్లిదులకుఁదో డేనుగావింతు.” ననుచు శ్రీరాముని యడుగుఁదామరలు మనమునఁజేర్చి యా మనుజేశునెదుర నచ్చపుభక్తితో 372నల వార్ధి మునిఁగి వచ్చి తా నిసుకలో వడిఁబొరలాడి తడయక యట చని తనమేని యిసుక వడిఁగట్టపై రాల్చి వనధిలో మఱియుఁ దేలి గట్టున కేఁగి తిరుగంగఁబొరలి వాలినభక్తితో వచ్చి 373విదల్చు నివ్విధంబున నుండ నినకులాధిపుఁడు దవ్వులఁబొడగాంచి తమ్మునిఁజూచి: “పొందుగా లక్ష్మణ! 374పొన్నదె చూడు ముందఱఁబటుతరు మూషికంబొకటి నా మీఁద భక్తి నున్నతగతిఁబూని తామేను జలములఁదడిపి గట్టునకుఁ జని వేగ యిసుకపైఁజల్లాడి తిరుగఁ జనుదెంచి 375కొండలసందున రాల్చి కర మొప్పుచున్నది. కపికులాధీశు లురుశక్తిఁదరుగిరు లొగిఁదెచ్చుచోటఁ దానెంత యని మదిఁదలఁపక ప్రేమఁ బూని సహాయమై పొదలుచున్నదియుఁ గనుఁగొంటె.”యనవుడుఁ“గమలాప్తవంశ్య! కనుఁగొంటి భవదంఘ్రికమలముల్ భక్తి నెవ్వఁడు మది నిల్పి యెసగఁదృణంబు నవ్వేల్పుగిరిఁబోలు మనినఁగాకున్నె! కావున భక్తియే కారణంబనఘ!” నావుడు ముదమంది నలినాప్తసుతునిఁ గనుఁగొని: “మది దానిఁగనుఁగొను వేడ్క పెనఁగొనుచున్నది; ప్రేమ376నిచ్చటికిఁ దె.”మ్మన్న వేంగంబె తెచ్చి సుగ్రీవుఁ డమ్మహాత్మునిచేతి కందియిచ్చుటయుఁ బలుదెఱంగుల దానిఁబ్రస్తుతి సేసి కలితదక్షిణకరాగ్రమున దువ్వుటయు నెంతయు సంతోష మినుమడింపంగ నంత లక్ష్మణుఁడు నయ్యబ్దినాయకుఁడు 377దనుజేశుతమ్ముండుఁదరుచరాధిపుఁడుఁ దనుఁజేరి వీక్షింప దా నట యొసగ నందంద కైకొని యలరుచునుండఁ జందన మందార చంపక క్రముక పున్నాగ సహకార భూరుహప్రతతు లున్నచో విడిపించె నుర్వీశుఁ.డంత హనుమదంగద నీలహరిరోమకుముద పనసాది వానరప్రముఖులు గూడి కనుఁగొన నాశ్చర్యకరమైనయట్టి ఘనతరంబైన యా కట్టపై నిలిచి |