| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
అనవుడు దివ్యాంబరాభరణంబు లనుపమ గంధమాల్యంబులు దాల్చి చారుతేజముల భాస్వన్మూర్తులగుచు నా రవిచంద్రులో యన వెలుంగుచును వననిధి 395యంత దీవనలతో ననుప 396ననిలజనీలుర యంసంబు లెక్కి సకలదేవతలును సన్నుతుల్ సేయ సకలలోకంబులు జయపెట్టుచుండ సకలతరంగిణీశ్వరు వీడుకొల్పి సకలేశ్వరుం డనుజన్ముండుఁదాను రామణీయకమైన రాక్షసలక్ష్మి సీమంతవీథిపైఁజెలఁగెడు మాడ్కి మునుకొని లంకాభిముఖుఁ397డౌచు నడచె ఘనమైన సేతుమార్గంబొగిఁ బట్టి. తగ విభీషణుఁడు గదాహస్తుఁడగుచు మొగిఁగపిసేనకు ముందఱ నడచి తన మంత్రులును దాను దర్పంబు మెఱసి వినుతవిక్రముఁడు సువేలాద్రి విడిసె. మిగులమొత్తంబులై మిన్నంది398క్రంది నగచరసేనలు నడవంగఁదొడఁగె. వడిగొని సేతుక్రేవల నేఁగువారు, విడువక త్రోవను వెస నేఁగువారు, వేడుక వినువీథి వెస నేఁగువారు, నాడకాడకు గుములై యేఁగువారు, దోయధిలోన నీఁదుచు నేఁగువారు, బాయలుగాఁ399జొచ్చి పఱువిడువారు, నప్పు డా సేనల యార్పులమ్రోఁత 400యుప్పొంగువారాశియురుఘోష మడఁచె: దివియుఁబాతాళంబు దిక్కులు భువియు నవిరళంబుగ నప్పుడల్లలనాడె. గడునొప్ప సేతువుఁగడచి యిబ్భంగి విడిసె రాఘవుఁడు సువేలాద్రియందుఁ.
తడయక వనచరదళము లేతెంచు
జారులచే రామజనపాలురాకకడుసంభ్రమముఁజూచి ఘనధనుర్ఘోష మడరింప బ్రహ్మాండ మవిసినట్లయ్యె. నుడువీథిఁ1జుక్కలు నురలె మ్రోయుచును. బెడిదంబుగా భూమి2బెగడొంది యళికె నుడుకారి వైదేహి యుల్లంబు చెలఁగె. (నడరి లంకాపురి యట్టిట్టులయ్యె. వడి భయంపడిరి క్రవ్యాదులందఱును) ఖండపరశు శిరఃకంపంబు సేసె. దండిరాక్షసులెల్లఁ దల్లడపడిరి. (కెరలెడువారాశి క్రిందుమీఁదయ్యెఁ. దరమిడి ఫణిరాజు తలలటు వాంచెఁ. దనరిన మేరువు తలక్రిందులయ్యె. ఘనభీతి దిక్కరుల్ కంపంబు నొందె. ననయంబు బిట్టుల్కె నాది ఘోణియును. గొనకొని క్రిందటి కూర్మంబు వణఁకె). నంత నా వృత్తాంతమంతయు నెఱిఁగి యంతరంగంబున నలుక దీపింపఁ జారులచే రామజనపాలు రాక యా రావణుఁడు విని యఖిల 3దానవులఁ బిలుపించి నవరత్నపీఠంబునందుఁ గొలువున్నవేళ నొక్కొలువులోపలికి నంత నా వృత్తాంతమంతయుఁ దెలిసి చింతించి కైకసి చిడిముడిపడుచు వంత నొందుచు మాల్యవంతుఁబిల్పించి యెంతయుఁబొగులుచు ననియె నాతనికి. నలఘువిక్రమశీలుఁ డా రామవిభుఁడు చలమున వానరసైన్యంబుతోడ విడిసె సువేలాద్రి వినుమింక లంక 4చెడియెఁదప్పదు రాముచే నిటమీఁద (సరవితో నట బ్రహ్మశతము గాచినను ఉరువడి రఘురాము ఊరక పోఁడు). పద5పడి మనమింకఁబంక్తికంఠునకు విదితంబుగా సీత విడుమని బుద్ధి చెప్పుదమన(ట)మె(యె)న్ని చెప్పిననతఁడు చెప్పిన బుద్ధులు చెవియొగ్గి వినఁడు. అనువుగాఁ దలిదండ్రులైనట్టివారు తనయుండు ధర్మంబు దప్పినయెడల తగ బుద్ధి చెప్పుట తగవు ధర్మంబు. నగునంచుఁజెప్పుదు రనఘులు బుధులు వినుము నాకును మున్ను విశ్రవసుండు వినుపించె నన్నియు విశదంబు గాఁగ నని పరమరహస్య మతనికిఁజెప్ప విని మాల్యవంతుండు వెఱఁగంది కూఁతుఁ గనుఁగొని యయ్యేవి కా కేల మాను? మన బుద్ధి వినఁడని మానంగరాదు. అమ్మ! నీవును నేను నా దశాననున కిమ్మహాగోప్యంబు లిన్నియుఁదెలియఁ జెప్పంగవలయు నేర్చిన నీతులెల్ల. నిప్పుడే కదలుద మిది వేళ గాన, వలనొప్పఁగా విశ్రవసబ్రహ్మపలుకు దలపోయ నెవ్వరు దప్పింపలేరు. చెప్పుము నీవు నేర్చిన బుద్ధులెల్ల నొప్పుగా ననవుడు నువిద యా క్షణమె పసిఁడిపల్లకిమీఁదఁ బసమించనెక్కి అసముతో నచ్చరలందంద 1మోవ ధవ2ళాంబరంబులు తరుచుగాఁగట్టి ధవళ3శంఖంబులు తరుచుగా మ్రోయ ధవళచందనములు ధవళాక్షతములు ధవళభూషణములుఁదలకొన్న ప్రేమ4 నవిరళంబుగ సభ నందఱి కమరఁ దవిలి దివ్యాంగనాతతి వెన్క నడవ సుతభృత్యహితమంత్రి సోదరుల్ నడవ మతిమంతులైనట్టి మంత్రులు నడవ శ్రుతిపాఠతంత్రజ్ఞ సూనృతుల్ నడవ వ్రతధర్మగుణజాల వర్తనుల్ నడవ కిన్నర గంధర్వ గీర్వాణ యక్ష పన్నగ ఖగ సిద్ధ భామలు నడవ వంకృతి యను మాల్యవంతునిదేవి సంకృతి యనుమాలిసతి5కేతుమతియు మానితంబైన సుమాలి తన్వంగి దానవాంగనలు గొందఱు వెంట నడవ ముగ్గురుతల్లులు ముందఱ వెనుక డగ్గఱి నడవంగ ధవళచామరలు గరుడగంధర్వాది కాంతలు వీవ నరుగుచో నాట్యంబు లచ్చరల్ సేయ బంధురంబుగ మిత్రభాతలైనట్టి బంధుజనంబులు బలిమితో నడవ యూపా6క్షుఁడతికాయుఁడొగి విరూపాక్షుఁ డేపున ముందఱ నేచితో నడవ ముదుక కుప్పసములు ముదమొప్పఁదొడిగి ముదిసిన రాక్షసముదితలు నడవ సందడిఁగదుముచు సాహో యటంచు ముందట ఫణిహారముఖ్యులు నడవ గురుతరబహువేదఘోషంబుతోడ సరిలేని యా బ్రహ్మసభతోడ నడచి(వఁ-జం) చంద్రదీధితులతో శారదాదేవి ఇంద్రుమందిరమున కేతెంచుకరణి మందారచంద్రికామల్లికాశ్వేత 7కందరహిమశైల కర్పూరహార చందనగోక్షీర శరదిందు కాంతి నందమై విలసిల్లు నభినవస్ఫురణ మందాకినీదేవి మఱి దివి నుండి బృందారకులుఁదానుఁబృథివి కేతెంచి విలసిల్లువిధమున వీక్షింప నొప్పి కలితవిలాసమై కైకసికేల? వరరత్నమణిగణవలయముల్ మెఱయఁ గరమొప్ప ముత్యాలకంఠమాలికలు వెఱవారఁ దనమేన విలసిల్లుచుండ మెఱుపులఁ దగుశుభ్రమేఘమో యనఁగ? దీపించునాదిత్య తేజమో యనఁగ? నేపారి యెంతయు నిభములు నడవఁ బ్రబలనీలాంబుదపటలమో యనఁగ? నిబిడమై రాక్షసనిచయంబు నడవ రథసింధుఘోటకరాజి సైన్యంబు పృథివి బీటలువాఱఁబెల్లుగా నడవ వనజోదరునిపుత్త్రి వాహినుల్ గొలువ నెనయంగ నజుసభ కేతెంచె ననఁగ? నమృతవారిధి పొంగి యమలతరంగ విమలమై యట వెల్లివిరిసెనో యనఁగ? నరిది నక్షత్రంబులన్నియు వచ్చి గురిగాఁగ నొకచోటఁ గూడెనో యనఁగ? నుదధిముత్యములెల్ల నొక త్రోవ వచ్చి పొదిగొని యట మున్ను పొడమెనో యనఁగ? 1గురుతైనకప్రంపుఁగొండలో యనఁగఁ? దిరమైన వెన్నెలతేటలో యనఁగ? యుక్తంబుగాఁదన్ను నువిదలు చేరి ముక్తాతపత్రముల్ ముదముతోఁబట్టఁ బ్రాభవంబొప్ప సంభ్రమమున నప్పు డీ భంగిఁగైకేసి యింద్రారిసభకు నభినవస్ఫురణమై నమర నేతేర విభవ2శుభాచారవినుతులు సెలఁగ శుభలీలఁగైకేసిఁజూచి రావణుఁడు రభసంబుతో గద్దె రయమున డిగ్గి ముదమునఁబ్రణమిల్లి మునుకొని మఱియు ముదితకు నందంద మ్రొక్కి కైదండ ప్రమదంబుతో నిచ్చి పల్లకి డించి యమరారి గొనివచ్చి యాస్థానమునకు తన భద్రపీఠంబు దరియంగ నొక్క కనకాసనంబిడఁ గైకసి యందుఁ గూర్చుండి తల్లులఁగూర్చుసోదరులఁ గూర్చిన భక్తితో గూర్చుండుమనియె. నంతరాంతరముల నందఱు నిట్టు లంతంతఁగూర్చుండి రర్హపీఠముల నంత నా కైకసి యనుమతిఁజేసి చింతామణీభద్రసింహాసనమున దానవేంద్రుండును దత్ప్రకారమున నూనిన సంతోషమొప్పఁగూర్చుండి 3యుండి యా రాక్షసయోధులనెల్ల 4నొండొండ యాసనయుక్తులఁజేసి యచలితమతిమంతు నమ్మాల్యవంతు నుచితాసనంబున నుండఁగాఁబనిచె. నా వేళ రావణుం డమరవల్లభుని భావంబుఁగైకొని భాసిల్లుచుండె. నలయుమ్రోఁతయులేని యంబుధికరణి నలబలంబుడిగె నా యసురేశుకొలువు నా లోన నమరారిహస్తముల్ మొగిచి కైలాసనిభ5కాంతి కైకసి కనియె జనని! నీ విబ్భంగి జననులతోడ నెనయంగ నా సభ కెన్నఁడు రావు తాలిమితో నేఁడు తలమోచి మీర లేల విచ్చేసితి రెఱిఁగింపుఁడనిన నప్పుడు కైకసి యా మాల్యవంతుఁ దప్పక కనుఁగొని తగ నీతి మెఱసి ప్రాభవస్ఫురణమైఁబంక్తికంధరుని శోభనగుణలీలఁజూచి యిట్లనియె. (మానవాధిపుదేవి మదిలోనఁగోరి కానకు (ను)ండఁగఁ దెచ్చుకతన నింతేసి కార్యంబు వుట్టె నా కమలాప్తవంశ్యుఁ డార్యరక్షణకునై యఖిలంబు నెఱుఁగ దశరథసుతుఁడునై ధరణి జన్మించె. విశదంబుగా నీకు వినుపింతుఁదెలియఁ దొల్లి మీ తండ్రి నాతో నొక్కవార్త తెల్లంబుగా విచ్చి తెల్పె నా ఘనుఁడు) తెలియంగ నాకు నీ దివ్యరహస్య మెలమిఁజెప్పినవార్త యెఱిఁగింతు వినుము. సురలు బ్రహ్మాదులు సొరిదిమై మునులు గరుడగంధర్వులు ఖచరవల్లభులు వరుణకుబేరులు వాయువాదులును తరుగనిభీతితో1ఁదల్లడపడుచు దమ తమ యిడుమలు తమపాటులెల్ల (తమ నేలుస్వామియౌ ధాతతోఁజెప్ప విని యబ్జభవుఁడును వెఱఁగంది సురల కనియెఁజిత్తంబున నలుక దీపింప సురలార! మీ కింత స్రుక్కంగ నేల? గరుడవాహనుఁడును గైలాసవిభుఁడు మీకు మేల్ సేతురు మీరు నా పల్కుఁ జేకొని కైలాసశిఖరంబునకును వైకుంఠమునకును వారక పోయి మీకున్న బాధలిమ్మెయిఁజెప్పుఁడనుచుఁ బరమేష్ఠి వారికిఁ బరమరహస్య కరములు చెప్పి దుఃఖము వాసి మీరు వేంచేయుఁడనవుడు వెరవొప్ప వారు నించిన సంతోష మెసగ నేతెంచి ముని యక్ష గంధర్వముఖ్యులతోడ వనజసంభవసుతు వరనందికేశు కని మ్రొక్కి తమకైన గతి విన్నవింప విని విస్మయంబంది విష్ణునికడకు పొండు మీ శ్రమ హరి పోఁగొట్టుననుచు ఖండేందుధరుఁడన్నఁగదలి యా క్షణమె వారందఱును పాలవారిధికడకుఁ జేరంగఁబోయి రాజీవలోచనునిఁ గాంచి దండము పెట్టి కన్నుల నీరు నించి దుఃఖితులైన నివ్వెఱగంది యిదియేమి సురలార? యిబ్భంగి మీరు మొద(పొది) విన శోకాబ్ధి మునుఁగంగనేల? యనవుడు సురలును నమ్మునీశ్వరులు వినుపించి రెంతయు విశదంబుగాను రావణుపనుపున రాక్షసవరులు ఏ విధి నేతెంచి యెందున్న సురలఁ గాల్చుచునున్నారు కరుణ లేకింత కాల్చినపిమ్మటఁ గలుగునె శుభము?) రావణకుంభకర్ణాది రాక్షసుల నేవగఁద్రుంచి మమ్మీడేర్పు మనుచు నభయదానము వేఁడ నా కృపాంభోధి అభయదానంబిచ్చె నమరులకెల్ల. నినకులంబున జనియించి రాక్షసుల ననిలోనఁదునిమెద నవలీల ననుచు వరమిచ్చి సకలదేవతల వీక్షించి తరుచరులై మీరు ధరణి జన్మించి యనిలోన నాకుఁదోడగుఁడని పలికె. ననిచెప్పె మీ తండ్రి యా రీతి నిప్పు డమరులు వానరులై పుట్టి రెలమి నమరకంటక! నిన్నునణఁప శ్రీహరియు(యె) వనజసంభవుఁడిచ్చువరము1హరింప నినకులంబునఁబుట్టె 2నిందఱుఁబొగడఁ జెనఁటితాటకఁజంపెఁ జిన్ననాఁడేచి మునియాగరక్షణంబును జేసి కాచెఁ. బదధూళిచే శిలఁ బడఁతిగాఁజేసె. వదలక జనకభూవరునింటిలోన ధరణిపై బ్రహ్మ3ఇంద్రాదిదేవతలు (అరుదరుదని వేడ్క నభినుతుల్ సేయఁ బొరిఁబొరిఁదా నొక్క పుడకకైవడిని) హరువిల్లు మోపెట్టి యవలీల విఱిచె(చి) జనకభూపతి తనూజను బెండ్లియాడె(డి). మొనసినపరశురాముని భంగపఱిచె తన తండ్రి వచనంబు దనరార నిలిపి(లుప) జనకజాలక్ష్మణసహితుఁడై వెడలి వనములఁదపసులై వర్తింపుచుండి మునులకు నభయంబు ముదమొప్ప నిచ్చి యెనయ విరాధుని నేచి కబంధుఁ దునుమాడి విడువఁడే దోషాచరేంద్ర! వెఱచి తపుడు గాదె వేయుభంగులను? వెఱవకుండితివేని వేఱే(యే)ల? నీదు చెలియలిముక్కును జెవులును బట్టి బలిమి4ని గోసిన పగ గెల్వరాదె? అనిలోన ఖరదూషణాదులవధయు విని యూరకుండుట వెఱచుట గాదె? మారీచు నొక కోల మడియించునప్పు డూరక యొకవంక నొదిఁగి యుండితివి రాముని5ముదలించి రమణిఁదేలేక యేమఱుపాటున నెలనాఁగఁ గొనుచు వెనువెన్కఁజూచుచు వెలవెల నగుచు 6నెనయ భీతిలి దెసలె(కె)ల్లఁబాఱుచును వచ్చితిగాక భూవరుల జయించి వచ్చితే? నీ వోడి వచ్చితిగాక! నచ్చుగా రఘురాము నబ్జాక్షి నీవు మ్రుచ్చిలి తెచ్చుట మగతనంబగునె? (నాఁడె కాల్పవె నిన్ను నరనాథుదేవి వేఁడికోపాగ్నులు వివరించి చూడ) వాలాన నినుఁగట్టి వారిధుల్ ముంచు వాలిఁజంపుట నీకు నోడుటగాదె? యిన్నేలసుమ్మివి యినకులేశ్వరుఁడు మున్నీరు బాణాగ్రమునకును దేఁడె? నేఁడోడితే రామనృపశేఖరునకు? నాఁడోడితివి గాదె? నాకేశవైరి! మాటిమాటికి బేలుమనుజు లటంచు నేటి కాడెదు కడు నింత గర్వించి ఘనతపోమహిమకుఁ గరుణించి నీకు వనజసంభవుఁడు దా వరమిచ్చువేళ నరుల నెన్నక తప్పి(ప్పె) నాఁటితప్పెల్లఁ దరమిడి నేఁడిదె తలకూడె నీకు గెలుపేది? యిఁక నీకు గీర్వాణవైరి! చలమునఁగులమెల్ల సమయింతుగాక! ఏటి కిన్నియుఁజెప్ప నిట కొకక్రోఁతి దాటి వారిధి మహోదగ్రుఁడై వచ్చి యినకులుపంపున నేచి యా వాయు తనయుండు ధైర్యంబు దర్పంబు మెరయ లంకలోపలఁజొచ్చి లంకశోధించి లంకలోపలఁగల్గు లావెల్ల నెఱిఁగి లంకిణిఁబరిమార్చి లలి శంకలేక లంకెల్లఁగాలించి లఘులీలఁబోయి జానకిఁబొడఁగాంచి జననాథుసేమ మూనిన భక్తితో నొప్పంగఁజెప్పి (ఆనందభరితుఁడై యా ముద్రికపుడు జానకి కిడి రాము జయమొప్పఁజెప్పి) మరలి పోవుచు నీదు మధువనంబెల్లఁ బెఱికి కావలివారిఁబెక్కండ్రఁజంపి యక్షకుమారుతో నసురాధిపతుల నక్షణంబున నెందఱైనను జంపి బలిమి శౌర్యస్ఫూర్తిఁబచరించి నిన్నుఁ (దొలఁగక సభలోనఁదృణముగా నాడె తలకొని యా రాత్రి దనుజులనెల్లఁ బొలుచునిద్రలతోడఁబొరిగొన్నవాఁడు) ఆ విమానములెక్కి యసురేశ! దివికిఁ బోవంగ సురవరుల్ పొరిఁబొరి నగరె? యింతచేసియు మఱి యేపారుశక్తి నెంతయు నెదురు లే కేచి పెల్లార్చి నీవును నీ వారు నెఱిచెడి చూడఁ బోవఁడే యలవాయుపుత్త్రుండు దొలుత (వాలికి నెక్కు డా వాయునందనుఁడు వాలాగ్రమున లంక వడిఁజుట్టిపట్టి) 1గురుతుగాఁబెకలించికొని పోయి రామ ధరణీశుముందటఁదడయక పెట్టి తెచ్చితి2కొమ్మన్న దేవేంద్రవైరి! యచ్చట నీ సత్త్వ మది యేమిసేయు? నటుగాక యీ లంక నగలించి పట్టి తటుకున3ధరణిపై దట్టించినపుడు చిందరవందరై4చిదిసి పల్వగల నందఱు మ్రగ్గరే? యమరు లుప్పొంగ (మిగిలి సత్త్వముతోడ మేరువుఁదెచ్చి తగు నంచు లంకపైఁదా వైచునేని) కలయంగ లంకలోఁగలవారలెల్ల నలియ నడ్చినరీతి నలినలి గారె? పొంగి యంభోరాశి బొరలంగ లంక క్రుంగి కూర్మముఁబోయి కూడదే యకట! తెరలించి యరచేత దీకొని యడువ మఱియుఁదా నటు రూపుమాయదే లంక? వరుసతో నిటు పెర్కివైచినఁబోదె? తెఱఁగొప్ప నీ యేడుదీవులు గడచి పదముల నులిమిన భస్మమై పోదె? పొదిగొన్న యీ లంక పొడవెల్ల నణఁగి ధరణీశ్వరునియాజ్ఞ తలపోసి పోసి మరలుచుఁబలువగ మారుతసూతి వలదని యూరక వడిఁబోయెఁగాని యలిగి యా పుణ్యుండు నటు సేసెనేని వలదని వారించు వారెందుఁగలరె? అలర బ్రహ్మయు వచ్చియాఁగిన వినునె? అతనికి నీ వోడి తసురాధినాథ! అతని యేలికను నీవని నెట్లు గెలుతు? వనచ1రులని కదా వాలుచున్నావు వనచరులను గెల్వవశమె యానాఁడు? వనచరుచేఁ జేటువచ్చుఁ బొమ్మనుచుఁ గొనకొని నంది దాఁగోపించి 2నీకుఁ బాయ కిచ్చిన శాపఫలమెల్ల 3నీవు వాయుపుత్త్రునిచేత వాలిచేఁ4గనవె? అసురేశ! వీరు దా రమరులుగాని కొసరక వసుధపైఁగ్రోఁతులు గారు కోలాహలాభీల కుపితలాంగూల వాల నఖ క్రూరవదన దంష్ట్రములు వాలాయుధములుగా వాలువానరులు నీలాభ్రకాచల నిబిడకాలోగ్ర శైలచరాచర చటులాంధకార తాలాంకసంకాశతనువులు గలిగి కాల కాలానల కాలరుద్రులను బోలి చరించెడు భుజపరాక్రములు ఫాలాక్షుఁడాదిగా బ్రహ్మాదిసురలు నీ లీలఁబుట్టిరి యిలమీఁద వచ్చి నీ లంకయును నిన్ను నిఖిలరాక్షసుల గూలఁద్రోయుటకునై ఘోరరూపముల భూలోకమున వచ్చి పుట్టిరిగాని యీలాగు వనచరులెందైనఁగలరె? అలఘుండవై నీవు నఖిలలోకములు చలముపెంపున గెల్చి చనుదెంచునపుడు (?)కిన్నర గంధర్వ కింపురుష యక్ష పన్నగ గుహ్యక పక్షీంద్ర సిద్ధ సుర దైత్యమునివర సుదతులనెల్లఁ జెరఁబట్టినాడవు చెచ్చెర నీకు వరకాంతలందఱు వడవడవాడి పరకాంత నెపమున భస్మమై మీఁదఁ గులముతో బలముతోఁగూ5లుఁబొమ్మనుచు నలిగి శాపంబిచ్చి రది సమకూడె వాలి మున్నాదిగా వరుసతో నిన్ను వాలినబాధల వడిఁబెట్టి చనఁడె? వాలికి నెక్కు డా వాలినందనుఁడు వాలికి నెక్కు డా వాయునందనుఁడు వాలికి నెక్కు డా వాలి సోదరుఁడు వాలి నిన్ రణములో వధియింపలేరె? వాలిన కణఁకతో వచ్చెద రింక (నీలా గహంకార మేటికి వినుము సోమించి యిట బంధుసుతులతోడుతను) సౌమిత్రి నినుఁబట్టి సమయింపలేఁడె? మఱియొండు చెప్పెద మనుజాశనుండ! ఇరవంద నీవును నెఱుఁగుదు వినుము రామలక్ష్మణు లేల? రణము దానేల? కోమలి యా సీత కోపానలంబె యరుదుగా బ్రహ్మరుద్రాదిదేవతలు వరదులై నీ కిచ్చు వరములతోడ హరుఁడొసగిన చంద్రహాసంబుతోడ నరయ1మూడరకోటియాయువుతోడఁ గైలాసమెత్తిన ఘనశక్తితోడఁ జాలస్వర్ణముతోడ సంపదతోడఁ దక్కక భుజబలదర్పంబుతోడ దిక్కరి నిభమైన దేహంబుతోడ రాక్షసకులముతో రావణ! నిన్ను నీ క్షణంబునఁబట్టి యెరియింపలేదె? పరమపతివ్రత పతియాజ్ఞ మీఱ వెఱచి యూరక యుండి వ్రేగెడుఁగాని మిడుకుచు నీ పాలిమృత్యుదేవతయుఁ దొడరి నిన్ బ్రేరేచి తోడ్కొనిపోవ ధర్మపతివ్రత దగ దన కేల? కర్మవశంబునఁ గైకొని తెచ్చి యఱిముఱిఁ జెఱఁబెట్టి2తా పుణ్య3వతిని పెరిఁగి ముంగొంగునఁబెట్టిన వహ్ని నిన్ను నీ కులముతో4నీ వారినెల్ల నెన్నిభంగులఁగాల్ప కేల పోనిచ్చు? నసురేశ! యది యెట్టిదని యంటివేని విసువక నీవు దిగ్విజయంబు సేసి యకలంకమతిఁబూని యమరుల గెల్చి సకలలోకంబులు జరియించునపుడు ప్రథమయుగంబున బ్రహ్మర్షివరుఁడు ప్రథితోరుసుజ్ఞానపరమార్థవిదుఁడు పరమసాత్త్విక కుశధ్వజుఁడనునృపతి వరపుత్త్రి యగు వేదవతి5కన్యయచట (పరువడి హరిఁదనపతిగాఁగఁ గోరి స్థిరమతిఁదపమును జేయుచుండఁగను గరిమ నీ వాసతిఁగలయఁదలంప మఱి వీతిహోత్రునిమాడ్కిని గెరలి) పరమపతివ్రత పాపాత్మ! నీదు వరగర్వమంతయు వమ్ముగాఁజేసి సుతులతో సతులతో సోదరులాది హితులతోఁబతులతో నిందఱితోడ నమితవిక్రముఁడైన 6హరిచేత నిన్ను సమరంబులోపలఁజంపింతు ననుచు నఱిముఱిఁగోపించి యా ధర్మశీల మఱుఁగుచు శపియించె మఱచిపోయితివె? ఆ సతి యీ సీత యాదిశ్రీలక్ష్మి భూసుతయై పుట్టె భువనరక్షణకు నాదినారాయణుండంబుజోదరుఁడు వేదవేద్యుఁడు రామవిభుఁడై వాఁడు (అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుఁడు మఖరక్షకుఁడు రామమనుజేంద్రవిభుఁడు కరుణాపయోనిధి గాంభీర్యధనుఁడు అరవిందభవుఁగన్న యాదిదేవుండు అసురుల మర్దింప నమరులఁబెంప వసుమతి రక్షింప వచ్చె విష్ణుండు) ఎఱుఁగను నీవును నెంతటివాఁడ వెఱుఁగరు బ్రహ్మరుద్రాదిదేవతలు జగములు వెలికిని జతురత నిడుచు మగుడంగ లోనికి మాయచే నడఁచు రవిజాలకుడ్యరంధ్రంబులయందుఁ దవిలి పర్వెడు రేణుదట్టంబుపగిదిఁ గూడి యొక్కొక రోమకూపంబునందు వాడవాడలఁ బుట్టి వర్ణనకెక్కి కొలఁది నజాండముల్ కోటానకోటు లలవడ నెప్పుడు నాడుచునుండుఁ బుట్టించుఁబెరిఁగించుఁబొలియించుఁ బిదప నిట్టెందుఁదాఁగాక యేకమైయుండు నతఁడిన్నిటికిఁగర్త యతనితో నెదిరి ప్రతి నోర్వఁదలఁచినఁబాపంబుగాదె? చెదరి లోకములెల్లఁజెడిన పిమ్మటను వదలక యుండెడువాఁడువో యితఁడు శరణని యున్న యా సామజవరుని కరుణ లీలాభూతిఁగాచె నీ విభుఁడు మధుకైటభులతోడ మహిని రాక్షసుల నధికతేజస్స్ఫూర్తి నణఁచె నీ ఘనుఁడు చొచ్చి సోమకుఁద్రుంచి శ్రుతులెల్ల వేడ్కఁ దెచ్చి బ్రహ్మకు నిచ్చి దీపించె నితఁడు అమృతాబ్ధిఁ దర్పించి యమృతంబు వడసి అమృతంబు సురలకు నర్థితో నిచ్చె భాసురంబుగ దైత్యుఁబట్టి శిక్షించి భూసతి నెత్తిన పుణ్యుఁడీ ఘనుఁడు కడఁగి బాలునిఁగావఁగంబంబునందుఁ బొడమి కాంచనకశిపునిఁ జీఱె నితఁడు ధరణి మూఁడడుగులు దా నర్థి వేఁడి పెరిగి యా బలిఁజెఱఁబెట్టె నీ ఘనుఁడు రాజసంబున భృగురాముఁడై పుట్టి రాజులఁద్రుంచిన రణదక్షుఁడితఁడు (ధరణిభారము మాన్ప ధర్మంబు నిలుప సరగున మీనకచ్ఛపభూమిదార సరసింహపటురామనామరూపముల ధరియింపుచుండు నా దశరథాత్మజుఁడు ఆదినారాయణుండాతని మహిమ భేదించి చెప్ప నభేద్య మెవ్వరికి?) తప్పక చెప్పితి దనుజలోకేశ! ఇప్పుడు దేవతాహితము చింతించి రాముఁడై యుదయించె రవివంశమునను తామసగుణ మేచి దనుజేంద్ర! నీకు నేమి పాపమొ కాని యెఱుక చొప్పడదు కామాంధునకు ధర్మగతు లేల గల్గుఁ? గొడుకులచేనైనఁ గూఁతుచేనైన నడరుఁగీర్తియుఁగాని యపకీర్తిగాని వచ్చు గోత్రుల కని వరపుణ్యనిధులు చెచ్చెరఁ జెప్పిరి చెప్పెడిదెల్ల నరయ నీ నిందలు నటు తలపోయ మఱి యెవ్వరికి1వచ్చు మనకునుగాక! అది యెట్టి దంటివే?నదియును వినుము మది రోఁత దలఁపక మనచుప్పనాతి ఆయన పరమాత్ముఁడనక కామించి పోయి ముక్కును జెవుల్ పోఁజేసుకొనియె పరకాంతయన కాసపడి పట్టి తెచ్చి కరకరిఁ గులమెల్లఁ గాల్చెద వీవు నింతకంటెఁగునింద యిఁక నెందుఁగలదు? పంతమేలను ఇట్టి పాపమ్ముగలదె? (కులనాశకుండగు కొడుకునకంటె నెలమిఁబుత్త్రులు లేమి యెంతయు మేలు అని పుణ్యపరులెల్ల నాడు వాక్యములు వినియు నెఱుంగక విపుల దర్పమున) బలసి రక్షోరాజ్యప్రముఖులందఱును నెలమి విష్ణునితోడ నెదురించి కాదె? అక్కజంబగు చక్రహతి కోర్వలేక స్రుక్కి పాతాళంబు సొచ్చిరి భీతి. శంక లే కిటు నీవు జన్మించుకతనఁ గ్రుంకిన రాక్షసకులమెల్ల నెగడె. నని మనంబునఁగొంత యలరుచుండితిని దనుజేశ!నా కోర్కె తలకూడదాయెఁ జేకొని లోకముల్ చెడినపిమ్మటను ఏకమై యుదధులు నేడు నుప్పొంగి మక్కువ నా జలమధ్యంబునందు నొక్కఁడై తనకుఁదోడొరులు లేకుండ (ఇన్నన్ని యని లెక్క కెఱుఁగంగరాక పన్నిన రవిశశిబహువహ్నివిమల హాటక పటల కల్యాణదీధితులు కోటానకోటులు కూడినకరణి జ్యోతిస్స్వరూపమై సురుచిరంబగుచు భాతి విభూతియై పరగంగ నొక్క) బాలుఁడై యట వటపత్రంబుమీఁద (నోలి నంగుష్ఠంబు నొగి నోట నుంచి చాలవినోదంబు సంఘటించుచును) నా లోనఁ దేలుచు నందొక్కనాఁడు కమనీయమగు సృష్టికారణలీలఁ దమదు చిత్తంబునఁదగఁదలంచుటయుఁ గమలోదరునినాభిఁ గమలంబు పుట్టెఁ. గమలంబులోఁబుట్టెఁగమలసంభవుఁడు కమలాసనుఁడు సృష్టి గల్పించుకొఱకు నమర నవబ్రహ్మలను వారిఁగాంచె వరపుణ్యులైనట్టి వారిలోపలను పరమాత్ము పౌలస్త్యబ్రహ్మర్షివలనఁ గమలాప్తనిభదీప్తఘనయశోనిధికి విమలాత్ముడైఁ పుట్టె విశ్రవసుండు. నరుదార జన్మించి తతనికి నీవు పరికిం1చి చూడఁగా బ్రహ్మవు గావె? బ్రహ్మసంతతి యేడ? పరదార లేడ? బ్రహ్మ పాతకములఁబడ జేయఁదగునె? చేకొని లోకముల్ చెఱుతువు నీవు లోకరక్షణ కళాలోలురు వారు. ధర్మార్జకుండవై తనరవు నీవు నిర్మల ధర్మైక నిరతులు వారు మీఱిన తపసుల మ్రింగుదు వీవు భూరితపోధనపోషకుండతఁడు. చిమిడి పరస్త్రీలఁ జెఱతువు నీవు. రమణతోఁబరదారరక్షకుల్ వారు. (మిగులజీవులనెల్ల మ్రింగుదు వీవు. జగతిజీవోదయచారణుల్ వారు). వేదబాహ్యుండవై విహరింతు వీవు. 2గాదిలి వేదాంతకర్తలు వారు. (వరకృపానిధి విశ్రవసునందనుఁడవు కరముగ్ర మగునట్టి కర్మంబు లేల? తఱుగని దయ యేడఁదగిలి వర్తించుఁ బరగ ధర్మంబాడఁబ్రబలుచు నుండు). ధర్మమెక్కడ నుండుఁదగిలి దైవంబు నిర్మలస్థితి నట నిజముగా నుండు. నెక్కడ దైవంబు నేపారుచుండు నక్కడ జయమును నమరుచునుండు. దయయును ధర్మంబుఁ1దానె యౌఁగాన జయము గల్గును రామచంద్రునకెపుడు వరమిచ్చి చనినట్టి వనజజుతోడ నురగకంకణుతోడ నురగులతోడ సురసిద్ధఖేచరుల్ సుముఖులై వచ్చి యఱిముఱి2నీకుఁగా నడ్డంబు వచ్చి కాచిననైనను కాకుత్థ్సకులుఁడు ఏచిన నిన్ జంప కేల పోనిచ్చు? నొప్ప దొప్పదు చలంబొప్పదు వినుము తప్పక చెప్పితి దనుజలోకేశ! వాలిన వరగర్వ వహ్నిలోపలను ఏల కాలెదు పడి యెంతయు నేచి? బద్ధవైరము మాను పరికించి చూడు బుద్ధి చెప్పితి నాదు బుద్ధి లోఁగొనుము తల్లిదండ్రులబుద్ధి దలమోచు ధర్మ వల్లభులకుఁగీడు వచ్చునే తలఁపఁ? బ్రల్లదంబులు మాని పరికించి వినుము3 తల్లి చెప్పినమాట తగదన కీవు అక్షరుండమృతుండు నఖిలప్రపంచ రక్షకుం డురుకీర్తిరాశి కారుణ్య చక్షుండు నక్షీణశరదివ్యశస్త్ర దక్షుండు త్రైలోక్యధాముండు లక్ష్మి వక్షుండు వేదాంతవర్ణితమూర్తి పక్షముల్ గల్గుసుపర్ణనామంపుఁ బక్షీంద్రవాహుండు పరమపావనుఁడు మోక్షమీయఁగఁజాలుమోహనమూర్తి యాదినారాయణుం డమరులఁబ్రోవ మోదంబుతో మునిముఖ్యులఁగావ భూదేవిభారంబుఁబుచ్చి పోవైవ నా దశరథునకు నాత్మజుండయ్యె. నే రాజు జలనిధి నింకింపఁజాలు నే రాజు హరువిల్లు నెలమి మోపెట్టి తృణలీల విఱిచె1ను తేజంబుమెఱయ గుణరూపదాక్షిణ్యకోదండగురుఁడు సకలజనానంద సంస్తుతంబైన సకలలోకములకు స్వామి రాఘవుఁడు ఇప్పుడె 2సీతను నెసగ రామునకు నొప్పిం3చు టెంతయు4నొప్పునీకనుచు? నని పెక్కుభంగుల5 నాద్యంతవేది ఘనపుణ్యవతియైన కైకసి తనకు నిర్మలతరపుణ్య నీతిమార్గంబు ధర్మతత్త్వరహస్యతతులు సెప్పినను తలలకెల్లను దొలి తలయైన పెద్ద తలతోడఁగూడిన తలలెల్ల వంచి దండప్రణామంబు దగ నాచరించి నిండినభక్తితో నిలిచి తానపుడు తలకొన్న వేడ్కతోఁదలలెల్ల నెత్తి తలఁగక యప్పుడు తల్లితో ననియె. ఎఱుఁగుదు నన్ని నే నెఱుఁగని యట్టి మెఱుఁగులుగలవె? యీ మూఁడులోకములఁ దరమిడి నీ పరతత్త్వంబు దెలుప నెఱుఁగనేరవు నేను6నెఱుఁగుదుఁగాక తల్లిదండ్రులు నెన్ని తప్పులాడినను ఉల్లాసమున సుతు లూకొనవలయు నెలమి నాకెవ్వరు నెదురు లేకుండ బలిమిని గలిమి నేఁబదిలక్షలేండ్లు మనినాఁడ వేడ్కతో మహితసౌఖ్యములు గనినాఁడ వెఱతునే కలన నెవ్వరికి? నరులు వానరులు నెన్నఁగ నెంతవారు? సురలకన్నఁదలంప శూరులే వారు? గెలుతు నవశ్యంబు గెలుపు లేకున్న నిల రాముశరముల నీల్గుదుఁగాని ఆ మహాత్ముఁడు 7విష్ణుఁడైన రామునకు నీ మేని తోడుత నే మ్రొక్కఁజాల హేయంబుతోడుత నెసగినయట్టి కాయంబు మోచుట కష్టంబుగాదె? తల్లి! నీ వెఱిగిన ధర్మశాస్త్రములు నెల్ల నిష్ఫలములై యిప్పుడు తోఁచె. (విచ్చేయవమ్మ నీ వెంత చెప్పినను అచ్చుగా రామున కా సీత నీను) చాలు నీ బుద్ధులు చాలు నీ మమత చాలించవైతేని జనని విచ్చేసి గొనకొని నీ పిన్నకొడుకును నీవు నెన లేని సంపద నేలు మీ లంక నీ లోకసంపద లిన్ని నీ కృపను నా లోలమతి నేను ననుభవించితిని నీ బుద్ధిఁబెఱిఁగియు నేర్పుతోడుతను నేఁబదిలక్షలు నేలితి లంక నెలమితో నెదురు నా కెవ్వరు లేక బలిమిఁ జేకొనియును బ్రబలి యిన్నాళ్లు లంక1యేలితి నింతలావున మెఱసి యుంకువ వానరయుక్తులై నరులు పై వచ్చి విడిసిన ప్రాభవంబెడలి యే వంక నరుల2తో నిఁక సంధితగదు3 సచ్చరిత్రంబులు చాలించి నీవు విచ్చేయు నగరికి వేగంబె యనిన నచ్చలంబున మది నజ్ఞాన మొదవ నచ్చుగా రావణుండాడుమాటలకుఁ గైకసి మదిలోనఁ గడుఁజోద్యమంది యా కుమారునితోడ ననియెఁగ్రమ్మఱను వరతపోనిధి విశ్రవసుఁడానతిచ్చు పరతత్త్వ మది యేల పరివోవు ననుచు వనిత యప్పుడు మాల్యవంతునిఁజూచి మనమెంత చెప్పిన మానునే వీఁడు? అన విని యిట్లనె నమ్మాల్యవంతుఁ డెనయంగ నీవింత యేల చెప్పెదవు? 1వనిత! వృథావాంఛ వలవ దేమిటికి జనని! నీ కొడుకను2 సంతోషముడుగు చెడక యాచార్యులు చెప్పినబుద్ధి కడుఁబ్రీతి విననేరగా బుద్ధి గలదె? అడరంగ నీతని యజ్ఞానబుద్ధి పుడకలతోఁగాని పోవునే? యకట! కాన1కామాంధుండు కార్యంబు తెఱఁగు మాను2నే? మాటలుమాని లే లెమ్ము. అనవుడుఁగైకసి యట్లకాకనుచు నెనయంగఁజెడుత్రోవ యేటికి మాను మనమెంత చెప్పిన మచ్చరి కాని చెనఁటి యొకింతైనఁజెవి యొగ్గి వినఁడు ఏ తెఱంగునఁబోవ దిది దైవకృతము నీతి చెప్పిన విన నేర్చునే? యనుచు నా తన్విపీఠంబు నప్పుడు డిగ్గి భ్రాతలుఁదల్లులు బంధులుఁగొల్వఁ జనియెఁగైకసి హజారంబు విడిచి తన నగరికిఁబోయి ధర్మతత్త్వంబు క్రమము దప్పక నిండుకారుణ్యదృష్టి కొమరొప్ప మఱి యాత్మఁగోరుచునుండె నట దశగ్రీవుండు నధికదర్పమున .......... యా రావణుఁడు విని యఖిలదానవులఁ[వా.రా. సర్గ 25] బిలిపించి నవరత్నపీఠంబునందుఁ గొలువున్న వేళ నక్కొలువులోపలికిఁ |


