ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రావణ సుగ్రీవుల మల్లయుద్ధము
అనవుడు సుగ్రీవుఁ డా రాముతోడ
ననియె:“మీ యెదుట నీ యసుర గర్వించి
వైభవంబిటు సూపువాఁడె శ్రీరామ!
యే భంగమొనరింతు నిప్పుడ.”యనుచు
గుటిలవర్తనుఁడును గ్రూరుండు నగుచు
నటు దలలెత్తిన యసురాహిమీఁద
నకుటిలశౌర్యసమగ్రుఁడై568 నట్టి
ప్రకటదివ్యాంగ569సువర్ణుఁడై పేర్చి570
మస్తకకోటీర మహితశృంగముల
571విస్తరోరస్‌స్థల విపులసానువుల
గుఱుకొని వాఁడొక్కకొండయైయున్న
బిఱబిరఁబడ వచ్చు పిడుగుచందమున
వెస నగ్గలముగ సువేలాద్రినుండి
యసురేశ్వరునిమీఁది కర్కజుండెగసి
దేవారి రావణుఁదృణముగాఁజూచి:
“రావణ! విను మేను రామునిబంట;
మాకు నీ వైభవమా చూపె”దనుచు
వీకతో మకుటముల్‌ వెస డొల్ల వ్రేసె.
వ్రేసిన572నమ్మెయి వెలుఁగుల573డొల్లు
భాసురకోటీరపంక్తి యొప్పారెఁ
గాలరుద్రుఁడు మిన్నుఁగద574ల వ్రేయుటయు
రాలు తారాగ్రహరాజి చందమునఁ.
జాలఁగోపించి దశగ్రీవుఁడంత
వాలి తమ్మునిఁబట్టి వడిఁబడవైచె.
నంతటిలోన నయ్యర్కతనూజఁ
డెంతయురయమున నేచి పెల్లెగసి
యసురఁజేతుల575తోడ నంటంగఁబట్టి
దెసలు గంపింపంగ ధృతి దూలవైచెఁ;
గటములు నుదురులుఁగంధరంబులును
విటతాటములు సేసి వీపెల్లఁజీఱి
కడకాళ్లు మెడలతోఁగదియంగఁబట్టి
వడి గోపురంబుతో వైచి నొప్పించె.
నిటు పోరుచో వారలిద్దఱు576డస్సి
పటుగతి నేలపైఁబడ577వచ్చి వచ్చి
యా నేల మోవక యతిలాఘవమునఁ
బూనిక నెగసి గోపురము578మీఁదటను
బెనఁగిరి; పెనఁగుచుఁబృథులసత్వము579నఁ
గొనినవిన్నాణ580ముల్‌ గొనక త్రోయుచును
డాసి మోఁకాళ్ల581దట్టనలు సేయుచును
బాసి క్రమ్మఱ582వచ్చి బలము సూపుచును
బదముల గుండెలు పగులఁదన్నుచును
గదిసి మోఁచేతులంగముల నొత్తుచును
గరవలయంబులఁగడఁగి యౌఁదలలు
పొరిఁబొరి నెత్తురుల్‌ పొడమ వ్రేయుచును
దడఁబడఁబెక్కు విధంబులఁబెనఁగి
కడఁగి యెప్పటి తానకములు గైకొనుచు
నుబ్బునూర్పులతోడ నొక కొంతసేపు
నుబ్బ583రింపక పట్టి యూరకుండుచును
నిమ్మెయిఁబోరుచో నిరువురుమేనఁ
గ్గ్రమ్మి పెల్లెగయు రక్తప్రపూరముల
జేగుఱుటేఱులఁ జెలువైనగిరుల
బాగున నెంతయు భాస్వరులగుచు
నున్నచో రావణుండురువడి మాయఁ
బన్ని తన్నప్పుడు పట్టఁజూచుటయు
నెఱిఁగి యాకసమున కెగసి వేగమునఁ
గఱకురాక్షసులు వెక్కసమంది చూడఁ
గపులెల్ల నార్వ నుత్కటసంభ్రమమునఁ
గపిరాజు వచ్చి రాఘవునకు మ్రొక్క
భక్తిమై రణరజఃపటలసమ్మిళిత
రక్తపంకము నిజోరస్థ్సలంబంటఁ
గపిరాజు రాముఁడు గౌఁగిటఁజేర్చి
కృప దళుకొత్త వీక్షించుచుఁబలికె:[వా.రా. సర్గ 41]
“వాసవాంతకుని రావణునిఁగైకొనక
యీ సాహసము సేయ నిటు నీకుఁజెల్లు
“నే వానిఁజంపెద; నీ విభీషణుని
నా వీట నిలిపెద.” నను బాసకొఱకు
వానిఁజంపక నీవు వచ్చుటే లెస్స.
యేను మెచ్చితి నిన్ను నినసూతి. నీవు
వాలి తమ్ముఁడవు రావణుని నిర్జింపఁ
జాలవే?584తలఁపంగ సైరించుటెల్ల
నది నాకుఁబాలిడి యవని నా కీర్తి
వదలక585 చెల్లింప వచ్చితి.” వనుడు:
“దేవ! యా ద్రోహినిఁదెఱఁగొప్పఁజూచి
యే విధంబునఁగోప మే586ను సైరింతు.”
నని యర్కజుఁడు వల్క నతనిమాటలకు
మనమున హర్షించి మఱి యిట్టులనియె:
“స్ఫురితతారకము భాసురరక్తకృష్ణ
పరివేషమును నగు భానుమండలము
వల587న మంటలు దెగి వ్రాలుచున్నవియు
జలదముల్‌ వెక్కు రాక్షసరూపములను
జెలఁగుచు నెత్తురుల్‌ సి588లుకుచున్నవియుఁ;
గలయంగ నొకట భూకంపమయ్యెడిని;
మేటిగాడ్పులను భూమీధరకోటి
కూటముల్‌ ధరణిపైఁ గూలుచున్నవియు;
బెగడక దినకరాభిముఖంబు లగుచు
నిగుడి వాపోయెడి నెరి జంబుకములు;
సారెకు నిట్లు రాక్షసకులప్రళయ
కారణోత్పాతముల్‌ గానంగఁబడియెఁ;
దిరముగా నాంగికాస్త్రికశుభప్రకర
వరసూచకంబు లీ వలనఁగన్పట్టె;
మనకు జయం బనుమానంబులేక
యొనగూడు; నిఁకఁ దడయుట గా.”దటంచుఁ

  1. ↑మెఱసి
  2. ↑సంపన్నుఁడై
  3. ↑సకలేశుఁడగు రామచంద్రుని యెదుర - నకలంక సాహసవ్యాప్తిచేఁ బొదలి - మస్తక…
  4. ↑విస్తృతో
  5. ↑నురుము(రవు)లై వెలుఁగుచు రాలు
  6. ↑డుల్లు
  7. ↑వ్రేయుటయును
  8. ↑లోన నడఁగంగ
  9. ↑దప్పి
  10. ↑ఁగ వచ్చియును - నా
  11. ↑న నిలిచి
  12. ↑లఁ-గొనక
  13. ↑మెక్కుడుగఁద్రో
  14. ↑గట్టనలు
  15. ↑ముష్టి
  16. ↑డిం,లిం, రింపుచు ఁబ
  17. ↑యిటువలె
  18. ↑వెలిఁగింప
  19. ↑నడంపుదును
  20. ↑ను
  21. ↑ను
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )