| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నా నారదుఁడు సెప్పినట్లు రాఘవుఁడు తా నాదిహరి యౌట తలపోసి చూచి తెలిసి ధీరుని వైనతేయునిఁదలఁచెఁ. దలఁచిన నప్పుడు తలఁపు831లోఁగూ832డ నారూఢమగు నమృతాబ్ధియుత్తరపుఁ దీరంబునందుండి దిగ్గన నెగసి యూ833ది మెట్టిన పాదయుగముచే బయలు 834పాదైన ధరణిలోపలి శేషుఁడులుకఁ; గడుఁబెద్దయైన ఱెక్కలగాలి మిన్ను సుడివడి రిక్కలు835సురియలై తూల; నా మ్రోఁతపెల్లున నఖిలలోకములు 836నామ్రేడితమగు భయంబున స్రుక్క; నెఱకలు విద్రిచిన నెగసినధూళి నెఱసి చీకట్లుగా నిఖిలంబుఁగప్పఁ; జనుదెంచునురువడి శైలంబు లురుల; 837వననిధుల్ పిండితవారులై కలఁగఁ; బదివేలసూర్యులప్రభయెల్లఁ గూర్చి మెదిపి చేసిన క్రియ మెయి ప్రకాశింప; మెఱుఁగుఱెక్కలతోడి మేరువో యనఁగఁ బఱతెంచె గరుడఁడంబరవీథిఁబేర్చి. పఱతెంచుటయు నాగపాశంబులెల్ల వెఱచి యా నృపతుల విడిచి838 పెల్లుఱికె నది యట్టిదయకాదె: యతనిఁజింతింప వదలుబంధంబు లెవ్వారికినైనఁ; దనుఁదాను జింతించి తనదు బంధములు చనఁద్రోవ రాముండు సాలఁడే తలఁప! నినసుతుఁడాదిగా నెల్లవానరులు విన విస్మయంబని వెఱఁగంది చూడ వైనతేయుండును వలగొని వచ్చి యా నర839పతులకు నందందమ్రొక్కి మెఱుఁగారుఱెక్కల మేనులు దుడిచి నెఱిఁగరంబులు మోడ్చి నిలిచి యిట్లనియెఁ: “బాసె మీ840కీ నాగపాశబంధములు; వాసవాంతకుని రావణుఁద్రుంచివైచి ధరణిజఁగొని యయోధ్యకు నేఁగు వేగ. ధరణీశ యసురుల దండించునపుడు మాయలు వెద్ద; యేమఱక వర్తింపు. మే యుపాయంబుల నిఁక మోసపోకు. మని ప్రదక్షిణముగా నరిగి యా నృపుల వినుతించి దీవించి వెసఁగౌఁగిలించి మ్రొక్కి యా యమృతసముద్రంబుకడకు గ్రక్కున గమనించెఁగశ్యపాత్మజుఁడు. పాముల కట్లెల్లఁ బాయుటఁజేసి రామలక్ష్మణులును రాగిల్లి. రపుడు వనచరు లా రామవల్లభునెదుర ననురాగరసమున నందంద తేలి తనరుచు సింహనాదములు సేయుచును వినువీథిఁదోఁకలు విసరి యాడుచును గురువులువారుచుఁగునిసి యాడుచును నురువడి841ఁబాఱుచు నుబ్బి నవ్వుచును 842ఘాటించి శైలవృక్షములెత్తి లంక 843కోట లువ్వెత్తుగాఁ844గొనఁదలంచుచును మిగిలిన వారి యామిక్కిలిరభస మగలించె లంకఁ; బెల్లగలించె నభము. నంత సూర్యోదయం బగుటయుఁజరుల నంతయు నరయ దశాస్యుండు వనిచెఁ. బనిచిన నక్కోటపై నుండి వారు కనిరి సుగ్రీవుండు కదిసియుండఁగను[వా.రా. సర్గ 51] సవినయుఁడై విభీషణుఁడు గొల్వఁగను బ్రవిమలమతిఁగపిబలము సేవింపఁ బోరికి సేనలఁబురికొల్పుకొనుచుఁ జారువిశృంఖలసమదేభయుగము గతి నున్న రామలక్ష్మణుల నిక్ష్వాకు పతుల బంధంబులఁబాసినవారిఁ. గని విన్ననై వారు గ్రమ్మఱఁబోయి దనుజేశుతో నా విధంబెఱిఁగింప విని ఖిన్నుఁడై కడు వెఱఁగంది యపుడు తన మంత్రివరులతో దశకంఠుఁడనియెఁ “బన్నగపాశముల్ పాయంగ మగుడఁ గన్న యా రామలక్ష్మణులచే నింకఁ జెడఁగల దీ లంక సిద్ధంబుగాఁగఁ, బడయవచ్చునె?నాగపాశంబు లూడ? జయ మెక్కడిది నాకు? సమరంబు845లోన రయమునఁజెడుఁగాక రాక్షస846లక్ష్మి! గరుడఁడువచ్చెనో కాక, లేకున్న నురగపాశము లెట్టు లూడు వారలకు? గరుడండు ననుగెల్చెఁ847గాక లేకున్న నరు లెంతవారు? వానరు లెంతవారు?’ |