ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
అంగదుఁడు మహాకాయుని మడియించుట
నలుగడఁబాఱ నున్నతశక్తి వారి
“వలవ దోహో” యని వారణ సేసి
ఖ్యాతిమించిన మహాకాయుని మంత్రు
లాతతమతి రుధిరాశనుండనఁగ
వాలెడువాఁడును వజ్రనాభుండుఁ
గాలదంష్ట్రుండును గాలకల్పుండు
మఱి వపాశుఁడు శతమాయుండు ధూమ్రు
డఱిమురి881దుర్ధరుండనువాఁడుఁ గడఁగి
యట్టహాసము సేసి యగచరసేనఁ
గిట్టి నొప్పింప వీక్షించి పృథుండుఁ
బనసుండు, మేఘపుష్పకుఁడు, గవాక్షుఁ
డును ఋషభుఁడు,గజుఁడును,గ్రోధనుండు
శతబలి, తారుండు సబలులై వారి
నతులితగతిఁదాఁకి యని సేయునపుడు
రుధిరాశనుండంత రోషంబుతోడ
నధికబాణములు గవాక్షుపై నేయ
వేగంబె పర్వతవృక్షంబు లెత్తి
యా గవాక్షుఁడు రుధిరాశను వైచె.
వైచిన నడుమనె వాని నన్నిటిని
నేచి చూర్ణంబుగా నేసి గవాక్షుఁ
బడనేసె; మూర్ఛచేఁబడిన గవాక్షుఁ
బొడగని తారుఁడప్పుడు కలుషించి882
ఘనమైన సాలవృక్షంబెత్తి వైచె
ననువంద రుధిరాశునరదంబుమీఁద.
నా రుధిరాశుండు నమ్మహీరుహము
బోరన నడుమనె పొడిపొడి సేసి
పదిబాణములఁదారుబడనేసి మించి
కదిసి చలంబునఁగపిసేనఁగిట్టి
కడు నుగ్రుఁడయి లయకాలంబునాఁడు
మిడు883క లోకములెల్ల మ్రింగునంతకుని
యాకృతిఁగైకొని యా సేనతోడ
భీకరవృత్తితోఁబేర్చుచు నుండె.
నప్పుడొక్కింత గవాక్షతారులును
దెప్పిరి కనువిచ్చి తెలియంగఁజూచి
యంతలో గదగొని యడరి గవాక్షుఁ
డంతకాకృతి రుధిరాశను తలయు
వ్రేసిన నసురయు వికృ884తాంగుఁడగుచు
బా885సెఁబ్రాణములకుఁ;బడియె886ఁదత్తనువు.
నని వజ్రనాభుఁడుదగ్రుఁడై పృథునిఁ
గనుఁగొని పెల్లేసె ఘనసాయకములఁ;
బృథివీధరము వైచెఁ బృథుఁడప్పు;డతఁడు
ప్రథితంబుగా నేసెఁ బది వ్రయ్యలుగను;
బృథుఁడును రోషసం887భృతుఁడునై వాని
రథముపై కెంతయురయమున దాటి
విల్లు ఖండములు గావించి గుఱ్ఱముల
డొల్లించి రథము బెట్టుగ నుగ్గుసేసి
యనయంబుఁగోపించి యవ్వజ్రనాభు
ఘనశక్తి వలకేలఁగడకాళ్లు వట్టి
వెసఁద్రిప్పి నేలతో వ్రేసి రోషమున
నసువులఁబెడఁబాపి యా పృథుఁడార్చె.
బరువడి ఋషభునిపైఁగాలదంష్ట్రుఁ
డురు888శక్తిఁగొలిపె మహోద్ధత దంతి.
నటు మీఁదఁ జనుదెంచునగ్గజంబునకు
నిటునటు తొలఁగక ఋషభుండు నెగసి
వేగంబ తన పదద్వితయ మొక్కటిగ
లాగించి కుంభస్థలంబుఁదన్నుటయు
మదకరి ఘీంకృతి మానక నిగుడ
నది యొక వింటిపట్టరిగె వెన్కకును.
మఱియును ఋషభుండు మానక మీఁదఁ
దఱిమి యయ్యేనుఁగుదంతంబు వెఱికి
బాగొప్ప వ్రేసి యప్పటుకరిఁజంపి
లాగును వేగంబు లావును మెఱసి
889కాలదంష్ట్రునిఁగిట్టి కా లొగిఁబట్టి
కేలిమై ధర వ్రేసి గీటడఁగించె
నసురసైన్యంబు హాహాకార మొంద;
నసమునఁగపిసేన యార్చె నందంద.
కాలకల్పుఁడు నగ్నికల్పబాణముల
పాలు గావించె నప్పనసునిఁగిట్టి;
పనసుండు నరదంబుపైకి లంఘించి
మును బెట్టుగా నశ్వములఁజదియించి
సారథిఁబడఁదన్ని సత్త్వమేపార
నా రథంబెల్ల నుగ్గయి రాలఁగొట్టి
పిడికిట గళసంధి బెట్టుగాఁగిట్టి
పొడిచె నక్కాలకల్పుఁడు దన్నుకొనఁగఁ
బొడిచిన వాఁడు నప్పుడు పండ్లు డుల్లి
890దొడదొడ891నోర నెత్తురుఁగ్రక్కుకొనుచు
మిడుకుచు గ్రుడ్డులు మిడుకఁబ్రాణములు
విడిచె రాక్షసులెల్ల విస్మయమంద.
బలి892యుఁడై కపుల వపాశుండు గిట్టి
చలమున893నేచి జర్జరితులఁజేయ
వానిపైఁబాషాణవర్షంబు గురిసె
జానుగా గజుఁడాకసంబెల్ల నిండ.
నా వపాశుఁడు వానినన్నింటి నడుమఁ
గావించెఁదునియలుగా నంపగములఁ;
గావించి మఱియును గజు నురుమాడఁ
బావకాభములైన బాణంబు లేడు.
నేసి వెండియుఁ గిట్టి యిరువదేనింట
నేసి నూఱింట మే నేసె894ఁదూ895రంగ.
గజుఁడు నయ్యమ్ములఁగడునొచ్చి వాని
నిజరథంబంతయు నెళనెళ విఱుగ
గరుడనివిధమునఁగడువేగ896 దాటి
కరి గోపురాగ్ర ముగ్రతఁద్రోచుకరణి
నా వపాశుని తల యట్టకుఁబాసి
పో వైచె నప్పుడు భూమిపైఁబడఁగ.
రోషించి యపుడు ధూమ్రుఁడు897దుర్ధరుండు
భీషణాస్త్రముల నొప్పించి వానరులఁ
దఱిమినఁగినుకఁగ్రోధన మేఘపుష్పు
లుఱక రథంబుల కుఱికి వారలను
గరతలంబుల మస్తకంబులఁజఱచి
దురమునఁగెడపి రద్భుతశక్తి మెఱసి.
యటు వారు హతులైన నసురు లందంద
పటురయంబునఁజెడి పాఱిరి భీతి.
నసురులు వాఱుట యప్పుడు చూచి
మసలక వడి శతమాయుండు 898వేర్చి
899కవిసినచోఁబరిఘ మ్ముద్ధరించి
జవమొప్ప ఋషభుండు శతబలి పనసుఁ
డలుక గవాక్ష900నలాంగదుల్‌ గూడి
చలమున నటుతాఁకి సంరంభ మెసగఁ
గడఁగి వృక్షంబుల ఘనశైలములను
901మడవక యా శతమాయుపై వైవ
శర తోమర ప్రాస చక్ర గదాసి
వరశస్త్రచయముల వర్షంబు గురిసి
వడి శతమాయుండు వనచరేశ్వరుల
బెడిదంబుగా నొంచి పేర్చి పెల్లార్చె.
వానిచే నటు నొచ్చి వానరాధిపులు
మానక రోషసమగ్రులై కవిసి
యడరి గవాక్షుండు హయములఁజంపెఁ;
గడఁగి ఖండించె నంగదుఁడు పతాకఁ;
బఱియలుగాఁద్రొక్కెఁబనసుండు రథము
నుఱుముగా ఋషభుండు నొంచె సారథిని
నలనొప్ప నలుఁడు శస్త్రాస్త్రముల్‌ విఱిచె
జలమునఁబిడికిట శతబలి వొడిచెఁ.
బిడికిటిపోటునఁబిమ్మిటిగొనక
కడులఘుత్వంబున గరుడండువోలెఁ
బటు902సత్త్వమున 903వాలుఁబలకయుఁగొనుచుఁ
జటుల వేగంబున శతమాయుఁడెగయ
బరవసంబున వాలుఁబడియున్న బ్రద్ద
పరియును గొని శతబలియుఁదో నెగసె
నెగసి భేరుండంబు లెడ రెండు గవిసి
యొగిబోరు తెఱఁగున నురువడి మిగుల
వ్రేయుచుఁదిరుగుచు వెసఁదప్పికొనుచుఁ
బాయుచు డాయుచుఁ బాటవంబొప్పఁ
గెరలుచుఁదెరలుచుఁగ్రిందుమీఁదగుచుఁ
బొరిఁబొరి నాకసంబునఁబోరుతఱిని
శతమాయుఁ డడిదంబు జళిపించి పూన్చి
శతబలి విపులవక్షము వ్రేయుటయును
సరభసుండై యప్డు శతబలి బ్రద్ద
పరి దప్ప నొడ్డి కృపాణోగ్రధారఁ
జలమునఁదెగవ్రేసె శతమాయుతొడలు
తలక్రిందుగా వాఁడు ధరమీఁదఁబడఁగ
నవిసె దైత్యుని తల యంతంతఁజెదరి
యవనిపై గిరిశృంగ మవియుచందమున
శతమాయుఁ904డప్పుడు చచ్చినఁగపులు
శతబలితోడ నచ్చట నార్చుటయును
ధరణి మిన్నును గుణధ్వని బీటలెగయ
నరద మత్యుగ్రరయంబునఁబఱపి
యంగద నపుడు మహానాదుఁ905డార్చి
యంగదుమేను మూఁడమ్ముల గ్రుచ్చి
మఱియును వెసనేయ మర్కటేశ్వరుఁడు
వఱలుకోపంబున వానిపైఁగిట్టి
యోజనాయతగిరి యొకటి రథంబు
పై జవంబున వైవఁబడకుండ వాఁడు
నడుమనె గదవైచి నగమెల్లఁబొడిగ
వడిఁద్రుంపఁగోపించి వాలినందనుఁడు
నతనిరథంబున కవలీల దాటి
చతురసత్త్వోన్నతిఁజాపంబుఁద్రుంచి
పట్టి రథంబుపైఁబడవైచి రొమ్ము
మెట్టి గ్రుడ్డులు వడి మిడికి రోఁజఁగను
మెడ నుల్చి త్రెంచి క్రమ్మిననెత్తురొలుకఁ
బుడమిపై906వైచె నప్పుడు వాని శిరముఁ.
దమ్ముఁడు సావ నుద్దండ907శోకమున
నెమ్ములు వగులంగ నేచి యార్చుచును
మఱియును గనలుచు మహనీయరథము
మెఱయంగ నలుగడ మెఱుఁగులు వారఁ
గదలించి యమ్మహాకాయుఁ డుద్వృత్తి
మదమున సింహంబు మలయుచందమున
గుదులు గ్రుచ్చినమాడ్కిఁగ్రూరబాణముల
నెదిరి ధారుణిఁగూలనేసె వానరుల.
వనచరవీరులు వానికిఁగాక
హనుమంతు మఱుఁగున కందఱుఁజనిరి
సారథిఁజూచి: “యీ చక్కటి మనల
వారక మార్కొనువారలు లేరు;
బోరన రాముపైఁబోనిమ్ము తేరు
నేరుపు వాటించి నీ.”వన్న వాఁడుఁ
గడఁగి908యశ్వముల పగ్గములు వదల్చి
వడి909నదల్పఁగను తీవ్రంబునఁ910గదల
నా క్రూరతకుఁగాక యగచరుల్‌ పఱవ:
“నో క్రోఁతులార! మీ కులుక నేమిటికి?
శివునిచాపముఁద్రుంచి సీతఁజేకొన్న
యవనీశుపైఁగాని యాజి నే నలుగఁ.
బరశురాముని భంగపఱచినయట్టి
నరనాయకుఁడుగాని నా యీడు గాఁడు.
ఆజిలో ఖరుని నుక్కడఁచినయట్టి
రాజుమీఁదనె కాని రాదు నా యమ్ము.
ధృతి నమ్ముతుద కబ్ధిఁ దెచ్చినయట్టి
పతితోడఁగాని యే బవరంబు సేయఁ.
ద్రిజగంబులందును దీపించునట్టి
రజతాద్రియెత్తిన రావణుసుతుఁడఁ;
దుది నింక నింద్రజిత్తునకుఁదమ్ముండ;
నిదె మహాకాయుండ నేతెంచినాఁడ.”
ననుచుఁజెప్పుచునుండ నంగదుండపుడు
ఘనమైనకడిమితోఁగలుషించి పలికె:
“నోరి! మహాకాయ! యుడుగక రజ్జు
లీ రణస్థలమున నేల ప్రేలెదవు?
మీ తండ్రి గిరి యెత్తి మెఱసె; మా తండ్రి
మీ తండ్రిఁదోఁక911 నిమ్మెయిఁగట్టి యెత్తె
నీకు నాకును912దగు నిష్ఠుర రణము;
కాకుత్థ్స913 నిధియేల? కపివీరు లేల?”
యని మ్రాఁకు గొనిమీఁద నడరింప నతని
తనువు నిండఁగఁగప్పె దారుణాస్త్రముల
గదిసి వెండియు మహాకాయుఁడంగదుని
గదగొని వ్రేసె నుత్కటకోపుఁడగుచు.
వ్రేసిన నెంతయు వివశుఁడై పడియె.
నా సమయంబున నతఁడు మూర్ఛిల్లఁ
గుతలంబు వగుల నెక్కొన దైత్యులార్చి
రతఁడు మూర్ఛిల్లిన నగచరపతులు
కలసి యందఱు మహాకాయుపైఁగవిసి
శిలలు భూరుహములుఁజెచ్చెఱ వైవ
నవి యెల్లఁదనదు బాణావలిచేత
నవలీలఁదునిమి గవాక్షునిఁబదిటఁ
బృథుని నైదిట914నూటఁబృథుసత్త్వు గజునిఁ
బ్రథితంబుగా శతబలి ముప్పదింట
నెనుబది యమ్ముల ఋషభునిఁగినుకఁ
బనసుని డెబ్బది పటుసాయకముల
మెఱసి క్రోధనుని నమ్మేఘపుష్పకుని
నఱువదింటను నూట నదరంటనేసి
యిటు వానరుల నతఁడే పడఁగింప;
నట మూర్ఛనొందిన యంగదుఁడపుడు
తెలిసి మోమునఁగ్రమ్ముదెంచురక్తంబుఁ
బలుమాఱుఁగరములఁబాయఁద్రోయుచును
నుదరుచు నప్పు డయో915మయంబైన
గదయెత్తుకొని మహాకాయుని రథము
పయికి లంఘించి యుద్భటశక్తితోడ
జయశీలుఁడై వాని సారథిఁజంపి,
వెస విల్లుఁబెళ్లన విఱుగంగఁగొట్టి,
యసమున హయముల నన్నింటిఁజంపి
తలవ్రేసె; వ్రేసిన దైత్యపుంగవుని
తలబొమిడిక మూడి ధరణిపైఁబడియె.
నా మహాకాయుండు నరదంబు డిగ్గి
భీమగదాదండభీషణుండగుచు
నంగదునంగంబు నదరంట నేసె;
నంగదుండును వ్రేయ నతఁడు దప్పించి
యంగదుమస్తక916ంబలుకతో మఱియుఁ
బొంగి గదాదండమున డాసి వ్రేసె.
నా ఘాతమున నెత్తు రడరిననైన
రాఘవుబంటు శౌర్యంబింత సెడక
గద పుచ్చుకొని మహాకాయుని వ్రేసె
నుదురు భగ్నముగాఁగ నుతశక్తి మెఱసి
యెదిరినఁదమ తండ్రి నీతని తండ్రి
విదితంబుగాఁబట్టి వేమాఱుఁదొల్లి
మున్నీటిలోపల ముంచుట దలఁచి
917మున్నిటిపగకునై ముంచెనో యనఁగ
నసమేది దనుజుఁడా యంగదుఁ918గిట్టి
వెసఁబేర్చి నెత్తురువెల్లిలో ముంచె;
ముం919చె రావణుఁబట్టి మున్నబ్ధి వాలి
ముంచినగతి వాని ముంచెరక్తమున.
నిటు మహాకాయుండు నింద్రుమన్మఁడును
బటుగతిఁబోరుచోఁ బరగురక్తముల
జే920వుఱుటేఱులఁ జెలువైన గిరుల
921భావంబు చేకొని భాస్వరులైరి.
గదయును గదయు నుగ్రంబుగాఁదాఁకి
చిదురుపలగుటయుఁజెచ్చెఱవారు
922బలుఁడును నిర్జరపతియును దొల్లి
కలసి పెనంగినకైవడి దోప
బలుధూళి923యిద్దఱ పదహతి నెగయఁ
దలపడి మల్లయుద్ధము సేయుచోటఁ
జతురతమై‘వనచరవీరుఁ డీతఁ;
డితఁడు రాక్షసుఁ.’డని యెఱుఁగంగరాక
కీలుబొమ్మలు పోరు924క్రియలను దోచి
వాలిసుగ్రీవుల వడువు925నఁబోర
నాదటఁగపులెల్ల నంగదుఁజూచి:
“యీ దుష్టరాక్షసు నేల పాలార్ప?
వాలినందనుఁడవు; వాలికైవడిని
వాలినవాఁడవు వరభుజశక్తి;
వాలిదుందుభియును వడిఁబోరుచోట
వాలి దుందుభి నింతవడి నిల్వనీఁడు;
వేవేగ చంపు మీ విబుధకంటకుని
నీ విక్రమక్రమనిపుణత మెఱసి.”
యని జయశబ్దంబు లడరింప నతఁడు
దనుజుని తల ముష్టిఁదాటించె బెట్టు.
పిడికిటిపోటున బిట్టుగాఁదిరిగి
పడియె నా దైత్యుండు బల మఱి నేలఁ.
బడియున్న రాక్షసపతి రొమ్ము ద్రొక్కి
మెడ నుల్చి తలఁద్రెంచి926మీఁదికి వైచి
యంగదుఁడార్చె; నయ్యంగదుఁజూచి
927యంగద నార్చి రయ్యగచరపతులు.
విచ్చి దానవులును వెస నేఁగి లంకఁ
జొచ్చియు వారిధిఁజొచ్చియు నాల్గు
దెసలకుఁబాఱియు దీనతఁబొంద
నసమున నుతియించి రంగదుఁగపులు;
నుతియించి సీతామనోనాథుకడకు
నతనిఁదోడ్కొనిపోయి యత్తెఱంగెల్ల
వినుపింప రఘుపతి విని సంతసమున
ఘనముగా నుప్పొంగి కౌఁగిటఁజేర్చి
కరుణాకటాక్ష మంగదుమీఁద నునిచి
సరస928ంపు మందహాసంబున నొప్పె.
హతశేషులగు రాక్షసావళి చెప్ప
గతపడ్డ యమ్మహాకాయునిఁదలఁచి
విన్ననై తలవాంచి వెఱఁగంది కుంది
కన్నీరు నించి రాక్షసకులాధీశుఁ
డంతఃపురంబున కరిగి యా రాత్రి
చింతించుచును నిద్ర సెందకయుండె.
మఱునాఁడు పెక్కుసామంతులు గొలువ
మెఱుఁగారునరదంబు మీఁదికి వచ్చి[వా.రా. సర్గ 57]
యరిగి పెంపారిన929యలవరి నెక్కి
పరపైన తన కోట పరికించి చూచి
చూచి పాళెంబులు శోధించి మీఁద
నేచిన పయికాపులిడఁబంచి యప్పు
డా రావణుండు ప్రహస్తుతో ననియెఁ.
“బేరెక్కి యెందు నభేద్య మీ కోట;
యెట్టిశాత్రవులకు నెన్నఁడు డాయు
నట్టిది గా; దిప్పు డగచరప్రతతి
వచ్చి930 భేదించి దుర్వారమై యునికి
యచ్చెరువైనది; యదియునుఁగాక
శ్రీరాముభుజబలశ్రీ యెల్లచోట
నారూఢతరము ప్రహస్త! కావునను
నీవొండె, నదిగాక యేనొండె, రణము
గావింప నా కుంభకర్ణుండు నొండెఁ
దగువార;931మిందు నిద్రారతి దనకు
మిగిలి932 నా తమ్ముఁడు933 మేల్కొనఁడయ్యె.
బోయెదవో; యేను బోదునే.”యనిన
నా యసురేంద్రున కతఁడిట్టులనియెఁ.:
“బోయెద నిదె నాదు భుజబలంబెల్ల
నా యమరులు మెచ్చ నరులఁద్రుంచెదను.
డాసి భూతప్రేతడాకినీ గణము
934లాసక్తితో నెత్తు రాని మోదింప
నటు సూడు మాజిఁబ్రహస్తుండు కపుల
నిటు సేయునే యన935నేపు సూపెదను.
‘బోరికిఁజను;’మన్న బుద్ధులు సెప్ప
నారయఁబాఁడిగా; దైనను వినుము
దనుజేశ!యొకమాట; ‘తగ’936దంటి;నింక
విను వినకుండు; వివేకించి చూడు;
దానికిఁగాదన దనుజేశ మున్ను
మానైన బుద్ధులు మంత్రులు సెప్ప
వినవైతి; విఁకనైన విను; సీత రామ
జనపాలునకు నిమ్ము; సమరంబు వలవ.”

  1. ↑దుర్దముం
  2. ↑పెడపెడ నార్చుచు బెడిదంబు మిగులఁ - గడు నుగ్రరణబల కౌశలంబమర - ఘనమైన…
  3. ↑కు
  4. ↑తాస్యుఁ
  5. ↑సిప్రా
  6. ↑ధరిత్రి
  7. ↑స్ఫీతుఁడై
  8. ↑వడి
  9. ↑దానిన కొని కాలదంష్ట్రునిఁజంపి - వాని దేహము రణోర్వినిఁగూలవైచె - నసుర…
  10. ↑తొడిఁబడ
  11. ↑నేల
  12. ↑మిమైఁ గ
  13. ↑నేసి
  14. ↑నేయుటయు
  15. ↑లం
  16. ↑ఁదాఁకి
  17. ↑దుర్దముండు
  18. ↑గవిసెఁ- గ
  19. ↑కవిసినఁ జేఁ బరిఘం బమరించి (కవిసిచే (న) పరిఘయు గదయు నమర్చి) కవిసెనా (సియా) తనిమీఁద గజుఁడెదిరించి (చె)
  20. ↑నీలాం
  21. ↑మడపక
  22. ↑ఖడ్గమును
  23. ↑పెద్దపరిఘంబు
  24. ↑డమ్మెయిఁజ
  25. ↑డేచి
  26. ↑వైచియుఁబూని డా చేతఁ-గడునల్కతో వెండ్రుకలు చుట్టి పట్టి- వడిఁద్రిప్పి లంకలో వైచె నా శిరము- తమ్ముడు…
  27. ↑కోపమున
  28. ↑సింహముల
  29. ↑ఁగ
  30. ↑గదియ
  31. ↑నెమ్మెయి
  32. ↑గాక
  33. ↑పతి(కులు)యే (డే) ల కలవీరు
  34. ↑మూఁట
  35. ↑ముఖం
  36. ↑మతఁడు రోషమున
  37. ↑మున్నిట్టివగకునై
  38. ↑బట్టి
  39. ↑చి
  40. ↑గు
  41. ↑బాగున నెంతయు
  42. ↑బలియును
  43. ↑యందంద
  44. ↑క్రియలును దోప క్రిందు మీఁదగుచు, క్రియయునై తోచె
  45. ↑నై తోచె
  46. ↑మింటికి
  47. ↑పొంగుచు దానవపుంగవు లార్వ, నంగదు… నంగదు నూరార్చి రగచర…
  48. ↑సల్లాపసంభరితుఁడై యుండె
  49. ↑యా మేడ యెక్కి, యాళ్వరి
  50. ↑వెండించి, వేధి
  51. ↑మిపుడు
  52. ↑న యాతండు
  53. ↑మేలుకొనండు
  54. ↑లాసవంబున (బని)
  55. ↑నింత వేర్చె
  56. ↑దనకిం (కదియు)
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )