| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
బలుకుచునుండ నా భానుకులుండు పెలుచ నార్చుచు గుణాభీలరావంబు చెలఁగంగ నా యింద్రజిత్తునిఁగిట్టి బలుకాండములు మీఁదఁబరగించుటయును నా రాక్షసుఁడు వేగ నవి ద్రుంచివైచి ఘోరనారాచముల్ గురిసి పెల్లార్చె. మదిలోనఁగోపించి మఱియు లక్ష్మణుఁడు గదిసి యా శాఖామృగంబు లార్వఁగను జలమున నొక యర్ధచంద్రబాణమున బలియుఁడై వాని చాపముఁద్రుంచివైచి పడగ నేడింటను బడ నేసి యొకటఁ దడయక సారథితలఁద్రెవ్వ నేసి పదియింట వక్షంబు పగులంగనేసి యదరంట నేసె రథ్యముల నాల్గింట. నా రావణునిసుతుండప్పుడు దానె సారథి రథియునై సౌమిత్రిఁగిట్టి నెట్టన యేయుచు నిగుడుకోపమున నట్టహాసము సేయ నా లక్ష్మణుండు నరదంబుఁగడపుచు ననిసేయుదైత్యు నరుదార వీక్షించి యదరంట1764నేసె. నా వాఁడియమ్ముల నధికంబు నొచ్చి రావణుసుతుఁడు మూర్ఛా1765గతిఁబొంది యంతలోఁదెలివొంది యాత్మలోఁబెద్ద చింతించి:“యిది యేమిచిత్రమో నరుఁడు నన్ను నొప్పించె; నెన్నఁడు నిట్టి దెఱుఁగ మున్ను నే యాహవంబులఁబోరునపుడు. కాల మెవ్వరికినిఁగడవరా.”దనుచు వాలినయుష్ణనిశ్వాసంబు లడరఁ జాపంబుఁదివియంగ శరము సంధింప నోపక పరిపంథి నొప్పంగఁజూడ నేరకయుండిన నిఖిలదేవతలు నా రాముతమ్ముని నగ్గించి. రపుడు వెలవెల నగువాని విన్ననిమోముఁ గలయంగఁగనుఁగొని కపివరులార్వ 1766వీరాగ్రగణ్యుండు వెసఁబ్రమాథియును మేరుసన్నిభుఁడగు మేఘనిస్స్వనుఁడు శరభుండు ఋషభుండు శైలశృంగములు నరుదార నింద్రారియరదంబు విఱుగ నటువైచుటయును రథ్యంబుతోడ విటతాటమై కూల విపులకోపమున నసురనాయకసుతుం డంత1767టఁబేర్చి వెస విభీషణు రామవిభు ననుజన్ము నుదురును వక్షంబు నోనాట నేసె వదలక మూఁడేసి వాఁడిబాణముల. నేసి గుణధ్వని 1768యెసకంబుగాఁగఁ జేసి చెలంగించె సింహనాదంబు. నప్పుడు కోపించి యధికరోషమున నిప్పులు కన్నుల నివ్వటిలంగ రావణుసుతుని యురంబుచ్చి పాఱఁ గా విభీషణుఁడేసెఁ గాండంబు లైదు. ఆతఁడు గోపించి యాగ్నేయబాణ మా తండ్రిపయి నేయ నది రాఁగఁ జూచి వారుణాస్త్రంబేసె వడి లక్ష్మణుండు. నా రెండు నటు పోరి యవనిపైఁ బడియె. నురగాస్త్ర మాదైత్యుఁడుగ్రత నేయ గరుడాస్త్రమునఁద్రుంచె1769ఁగడఁగి లక్ష్మణుఁడు. తగఁ గుబేరాస్త్ర ముద్ధతి నాతఁ డేయ నగణితంబుగఁ ద్రుంచె నైంద్రస్త్ర మేసి. తగఁ గుబేరాస్త్ర ముద్ధతి నాతఁడేయ నగణితంబుగఁద్రుంచె నైంద్రాస్త్ర మేసి. దానవుఁడపుడు గంధర్వాస్త్రమేయ దాని లక్ష్మణుఁడు రౌద్రంబునఁద్రుంచెఁ. జలమున నిటు వారు సమరంబు సేయ బ్రళయకాలము నాఁటిభంగియై తోచె. సౌమిత్రిరణపరిశ్రాంతి1770 మాన్చుటకు నా మందవాయువు లల్లన వీచె.
అంతటిలోన నాప్యాయనంబొంది
నంత లక్ష్మణుఁడు నా యంతకుపగిదియంత నప్పుడు లక్ష్మణాస్త్రనిర్ఘాత భేదితామరవైరి భీమైకభుజము మీఁదికి జిమ్మిన మెఱపుచందమున ధరణిమీఁదను రక్తధారలు దొరుగ గరుడవక్త్రమున వ్రేల్ ఘనసర్ప మనఁగ ఖేచరమార్గమై క్రిందుగా మరలి వీచిమాలికి దిగు విషదంబుభంగిఁ జండతరోద్దండ సమవర్తి కాల దండంబుచే జారి ధరఁగూలురీతి విదళితభూవృష్టి విరియలు గాఁగఁ జెదరి దైత్య స్త్రీలు చెడి భీతిఁబాఱ నిజగృహాంగణమున నినదమై పడిన ప్రజలెల్లఁజూచి విభ్రాంతులై రప్పు డంత లక్ష్మణు.......... .......... నంతకంతకుఁగ్రూరుఁడై యింద్రజిత్తు నటు చూచి కార్ముకజ్యానినాదంబుఁ బటుశక్తితో దిశాభాగంబు వగులఁ జెలఁగించి మెయి వెంచి సింహనాదంబు సెలఁగించి దేవేంద్రుచేఁగొన్నయట్టి యారూఢిమీఱు1771నైంద్రాస్త్రంబుఁదొడిగి “యా రామవిభుఁడు ధర్మాత్ముఁడౌనేని, దేవి యా సీత పతివ్రతయేని, దేవతాకరుణ నాదెసఁ గల్గెనేని; యింద్రాదులకునెల్ల హితవగునేని యింద్రజిత్తుని తల నిమ్మహాశరము త్రెంచుఁగావుత.”మని దృష్టి సంధించి మించి యేయుటయును మిన్నెల్ల నిండి పృథుదీర్ఘనిర్ఘాత భీషణంబగుచుఁ బ్రథన1772నిష్ఠురతరప్రారంభ మగుచు బహురత్న పుంఖశోభాయుతంబగుచు విహగేంద్రసమజవావి1773ర్భావ మగుచు నహిముఖానలకణ వ్యాలోల మగుచు నహిమాంశుబింబప్రభాభీల మగుచు మండుచు రుచులతో మహియు నాకసము నిండుచు నత్యుగ్రనిగ్రహోదగ్ర గతులమైఁబఱచి రాక్షసలోకనాథు సుతుఁగిట్టి యందంద సురలు మిన్నందఁ దనరినయమ్మహోద్దండాస్త్ర మతని యనుపమ మణికుండలాంచితంబైన లలితారు1774ణాక్షతాలంకృతంబైన తల బొమిడికముతో ధరఁగూలఁద్రోచెఁ గలుషభావమున లంకానిధానంబుఁ జలమున నుగ్రుఁడై సాధింపఁగోరి బలియిచ్చుకొఱకు నై పటులులాయంబు తల ద్రుంచివైచువిధంబచ్చువడఁగ.
రజనీచరాంగనల్ రవములు చెలఁగ
ననిలోనఁబడియున్న యా యింద్రజిత్తుఁభుజగేంద్రుఁ బోలినపుడమిహస్తంబు ముసరి చూచుచుఁజేతిమొండె మెవ్వరిదొ? వెస సులోచన కిది విదితంబుగాను తెలుపుద మనుచు నేతెంచి లోపలికి బలసి నక్తంచర బహువిలాసినులు పరివారయుక్తులై పాటలాటలను సరససల్లాపాది సద్గోష్ఠికథలఁ బరిహాసచాతుర్యపరిభాషణముల మెఱసి చిత్తంబు రా మెప్పించుచుండఁ దులలేని యా హంసతూలికయందుఁ దులఁదూఁగుచున్నట్టిదొరసానిఁగాంచి మానినీమణిఁజేర మఱి సాగిపోయి యా నిశాచరభామ లనిరి కేల్మొగిచి యోయమ్మ! వినవమ్మ! యొక విచిత్రంబు సాయకచ్ఛేదితాంచద్రక్తబాహు దండంబు సురుచిరోద్దండచాపంబు మండిత నవరత్నమయ ముద్రికాదు లొనరంగ బహుభూషణోజ్వలంబగుచు మనమందిరాంగణమధ్యభాగమున (?)నా నీలమయమహాహస్తయుక్తముగఁ బైనుండిపడెను భూభాగంబు లదర. నేణాక్షి! తెలియరా దెవ్వరి దనుచు రాణించుచున్నది రమణి! వాకిటను వనజాక్షి! యందాఁక వచ్చి చూచెదవొ? యనువాక్యశరము లా యతివకర్ణములఁ జొరకుండఁదప్పించు సొంపు వీక్షించి తిరిగి దాసీజనుల్ దెలుపంగఁదనరి. మనము గందగఁ దనుమధ్య వల్లభుఁడు అని చేయఁబోయి రాఁడాయెను మూఁడు దినములు జెల్లెను దెలియంగ నేఁడు మన మీఁద సంక్షోభమానసుండగుచుఁ గైలాసపతి యేమిగల్పించె? ననుచు లోలాక్షి యపుడు విలోకింత మనుచుఁ గడువేగమునను నక్కడి కేగుదెంచి పడియున్న పెనిమిటిబాహుమూలంబు గురుతుబట్టగ లేక కూర్చుండి యచట పరమవిచారంబు పడఁతి సేయగను గలితనానారత్న గణదీప్తులడర విలసితముద్రికా వేష్టితంబైన తర్జనిచే వ్రాసె ధరణి పత్రముగ నిర్జరాంతక వధూనివహంబు జూడ పెను ప్రాణవల్లభి విశదంబుగాను ననిలోన రఘురాముననుజన్ముఁడైన యా లక్ష్మణుని బాణహతుఁడనై నిన్ను లోలాక్షి! యెడఁబాసి లోకాంతరమున కరుగఁజాలక వామహస్తంబు నీకు నెఱుకగా నినుఁబిల్వ నే నంపినాఁడ నందాఁక వైధవ్య మతివరో! నీకు నందకయుండ నే నాత్మయందొక్క ప్రాణంబు బిగఁబట్టి పటు కళేబరము రాణిరో! పడకుండ రణభూమిలోనఁ గులిశవిచ్ఛేదిత కూటాద్రివోలె నిలిపియున్నాఁడను నీ రాక కెదురు వనజాక్షి! చూచెద వడి నేఁగుదెమ్ము. అనుచు వ్రాసిన పతిహస్తాక్షరములు లోనభిప్రాయంబు లోలాక్షి చదివి మానసంబున శోకమగ్నయై చాల హానాథ! హా నాథ! హా నాథ!యనుచు నా నాథురూపంబు నాత్మలోఁదలఁచి కరువలిచేఁదూలు కర్పూరరజము సరి దోచు ధూళిధూసరదేహయగుచు నిలవ్రాలె వనితలు నెలుఁగెత్తి యేడ్వఁ గలకలంబులు వుట్టెఁ గడు లంకలోన నంతఁబ్రౌఢ స్త్రీలు నా మూర్ఛ దెలిపి సంతాప ముడుగుము సౌభాగ్య మమరఁ బొందుగా బతిఁగూడఁబోదు నీ విఁకను ఇందీవరాక్షిరో! యేల శోకంబు? వామాక్షి! పనిలేదు వగపు చాలించి కోమలి! తీర్చుకో కోర్కి నీవనుచుఁ బడఁతులెల్లరుఁగూడి బలువూరడింపఁ బడఁతి సాదరమంది పతిబాహుఁగూడి కాలిగజ్జలు మ్రోయఁ గలితమనోహ రాలోకమయ తురగారోహ యగుచు బెరయఁగా నా నికుంభిళపురంబెడలి తరలె లంకకు నతిత్వర సులోచనయుఁ గమలాక్షి గుఱ్ఱంబు గ్రక్కున డిగ్గి యమరంగ నక్తాంచరాంగనా వితతి కొలిచిరా రావణుకొల్వుకూటంబు కలధౌతమయకుడ్యఘనతరంబైన * * * రావణు లోకవిద్రావణుఁ గాంచి దేవేశరిపురాణి దీనాననమునఁ జని పాదముల వ్రాలి జలజాక్షి నేత్ర వనములఁదత్పాదవనరుహంబులకు నభిషేక మొనరింప నా దశాననుఁడు సభ గనుంగొన సులోచన నెత్తి మూర్ధ్ని చుబుకించి దయచూపు చూచి యిట్లనియె నబలరో! నేఁడు నీ కాపద గలుగఁ బనియేమి? యెవ్వఁడు బాహుశౌర్యమున నని దంతములు పట్టి యైరావతంబు ధరణిపైఁబడద్రోసి దంభోళిధరుని చెఱదెచ్చి దివిజులఁ జెండాడినట్టి భువనభీకరమూర్తి భూరివిక్రముని యువతివి ఫాలాక్షుఁడున్నభూధరము నవలీలఁబైకెత్తి యమరసంఘముల బవరంబున జయించి పట్టి బంధించి భీకరగతితోడఁ చేర్చి యీరేడు లోకంబులన్నియు లోకువపఱిచి యీసుచేఁ గాంతల నెఱిచెఱవేసి వాసి కెక్కినయట్టివానికిఁ బెద్ద కోడలివైన నీకొక రెగ్గుసేయఁ గూడ దెవ్వరి కిట్లు కోమలి! నిన్నుఁ జెనకిన పరమేష్ఠి శ్రీవాసుదేవు ఘనసురావలులను ఖగపతినైన నని ఘోరశరజాలహతులఁబాశముల విను కట్టి తెచ్చెద వెలఁది! నీ కడకు దివిజులతోఁగూడ దివి నేల వైతు భువి క్రిందుమీఁదుగాఁబొరలంగఁద్రోతు జలరాసు లింకింతుఁజంద్రసూర్యులను బలుగ్రహంబుల భూమిపై రాలఁజేతుఁ గులశైలములఁద్రోతుఁ గూర్మశేషులను బలిమిఁ బీకుచుఁ గడ బాఱంగవైతు నల కాలమృత్యువు నరకాల రాతుఁ జలమున నా దిశేశ్వరనివాసములు కొల్లలాడుచుఁ జేతుఁ గోలాహలంబు పల్లవాధరి! చెప్పు పలవింపనేల? ననుచు నీ విధమున నా దశాననుఁడు తన కోడలికిఁదెల్పఁ దన్వంగి మగని ఘనబాహుదండంబు గ్రక్కున నెదుట మనసు మ్రగ్గగఁబెట్టి మఱియు నిట్లనియె రాక్షసోత్తమ! నిను రణభూమిలోన నక్షీణవిక్రముండైన నీ సుతుండు క్షీణవిక్రముఁడయ్యు శ్రీరామవిభుని ప్రాణబంధుఁడు మహాబలశాలియైన యా లక్ష్మణునిచేత హతుఁడయ్యె నేఁడు చాల నీ కోర్కెలు సాంగంబుగాను అనుమాట చెవులకు నమ్ములై తాఁకి మనమున శోకాగ్ని మండి పైకొనఁగ హాపుత్ర! హా పుత్ర! హా పుత్ర! యనుచుఁ ప్రాపైనయిరువది పాణిపద్మముల నురుశిరంబులు మ్రోవ నుజ్జ్వలంబైన గురురత్నమయహారకోటీరదశక ములు నేలఁబడ మణిముక్తావితాన కలితహారావళి గాసిల్లి తెగఁగ శోకోదకములు చక్షువుల రాలఁగను శోకించియును దేహశుద్ధియు మఱచి యున్నతాసనముపై నుండి భూరజము అన్నిమోములు నిండ నంగంబు దూలె. మనుజాశనుని పట్టమహిషి యైనట్టి యనుపమచారిత్ర యఖిలైకమాన్య రమణి మండోదరి రాణివాసమున నమరంగఁగొలువుండునంత నీ ఘోర రవములు వినఁబడి రాజాస్య బెదరి సవతులతోఁగూడి సదనంబు వెడలి గుండియ లవియఁబైకొంగులు దొలఁగ నిండుకన్నుల నీరు నిబిడమై జార సుదతి మండోదరి సురిఁగిలఁబడిన త్రిదశారిశిరములు తీసి తాఁ దొడల నుంచి కొంగునఁదుడ్చి యుపచారవిధులు మంచివిగాఁజేయ మఱి మూర్ఛ దెలిసి తూలె నా తేజంబు తూలె నా లక్ష్మి తూలె నా భోగంబు తూలె దర్పంబు తూలె రాక్షసబలాదులు దీరె నింక (?)దోలితి పుత్ర! నీ దోర్విలాసమున నాకేల యుద్ధంబు? నా కేల సీత? నా కేల రాజ్యంబు? నా కేల లంక? తనయ! నీతో గూడఁదడయ కీలోన ననివార్యశరసమూహంబులచేత దురమున రఘురాముతోఁ దారసిల్లి సుర లసురులు మహాస్తుతులు సేయంగ సరిపోలి యతనిచే సంగ్రామభూమిఁ బరలోకగతుఁడనై పరమకైవల్య పదము బొందుదుఁగాక ప్రాణంబు లొడల వదలక బిగఁబట్ట వశమె? నిన్ బాసి అనియని శోకించు నా దశగ్రీవుఁ గనుఁగొని యా భుజంగమరాజ తనయ వినవయ్య! లంకేశ!విబుధేంద్రజిత్తు తనదు బాహువు నృపోద్దండకోదండ ముక్తసాయక వినిర్ముక్తుఁడైనపుడె నక్తంచరాధిప! ననుఁబిల్వఁబనిచెఁ. బతిలేని సతులకు బ్రతుకేటి బ్రతుకు? సతమైన సౌభాగ్యసాగమసిద్ధి యందంగవలయు. నే నతని కర్థాంగ మెందుకు? నాథాంగ మెడఁబాసియుందుఁ గావున విను సర్వగాత్రప్రధాన మా వరుమస్తకం బాహవభూమి నిలుపక రాముసన్నిధికిఁగొంపోయె బలియుండు సౌమిత్రి బహుళతేజమున భర్తృశిరోహీనభామ కేలాగు? కర్తృత్వ మమరు సాగమసిద్ధి కధిప! యా విరోధులయొద్ద నతిదీనవృత్తి జీవితేశుం డింద్రజిత్తు మస్తకము నున్నది యది రాక యుచితకృత్యముల నున్నమనోరథంబొదవునె నాకు? వాసవానోకహవరపుష్పనిచయ వాసనావాసితోజ్జ్వలమైన యట్టి నా నాథుతల దెచ్చి నా కిచ్చి వేగ నా నాథుఁగూడంగ నన్నంపవయ్య! అనవిని రావణుండనియె దర్పమునఁ బనిబూని నీ కేల పడఁతి చిచ్చురుక? నేణాక్షి! విను నీకు నేకాంగమైన ప్రాణేశుఁడింద్రారిప్రాణంబు లేల? పోనిత్తు నిపుడు గొంపోవు మృత్యువును మానక శిక్షించి మళ్లి తెప్పింతు యముని వేగమెపట్టి యరకాల రాచి యమపురి వెదకి శక్రారిఁదెచ్చిత్తు వనజాక్షి! నీ తల వైధవ్య మమరఁ బనిపూని వ్రాసిన పద్మసంభవుని దండింతు లోక ముద్దండరోషమున మండించు కల్పాంత మదనారిఁబోలెఁ జెండి సంహారంబు సేతుగా కిపుడు దండింతు ననిన నుద్దండరాక్షసులు రోమహర్షణఘోరరూపులు సర్ప రోముండు వృశ్చికరోముండు నగ్ని వర్ణుండు గజముష్టి వజ్రదంష్ట్రుండు స్వర్ణనేత్రుఁడు విదూషణుఁడు శంఖుండు నా మహోదరముఖ్యు లఱువదికోట్లు భీమవిక్రమపరాభేద్యులతోడ రణమహోద్యుక్తుఁడై రావణాసురుఁడు రణభేరి వ్రేయింప రవము లాకాశ గర్భంబు భేదింప ఖగసమూహముల గర్భనిర్భేదమై కదలె భూతములు. నక్షత్రములు డుల్లె నగరంబులోన. దక్షుఁడై యా సభాస్థానంబు వెడల నా దశాస్యుని కడ్డమై సులోచనయు నాదరంబునఁబల్కె నమరారి! వినుము నీ కసాధ్యంబేది? నీ నఖాగ్రమున లోకంబు లుండుఁగాలుఁడు దండధరుఁడు నీ యాజ్ఞఁదలమోచి నీ మందిరమున సేయరె?పనులెల్ల సేవకు లగుచు దాసిగా నేలవే దండి మృత్యువును వాసికెక్కిన నీకు వాసవాంతకుని లేపి తే నది యెంత లేఖారి! యింక దాప నేటికిఁ దగ్గె దైవబలంబు కాలవిపర్యాసగతిఁగాదె? యింత యేల పుట్టును? చూడు మెన్నిభంగులను కాలచక్రంబది కడువిచిత్రంబు? కాలమెవ్వరికైనఁ గడవంగ వశమె? అదిగాక యిది సేయునందాఁక నేను నొదుఁగుచు నెటులుందు నొక్క ప్రాణస్థుఁ డై కళేబరము నాహవభూమి నిలిపి నా కెదుర్చూచుచు నా ప్రాణవిభుఁడు బా....విభవానుభవ మొక్కగడియ యీ ధరకల్పంబు లెన యంత నంటె(?) వినుము శూలముకైన వెన్నియ్యవచ్చు, ననలంబు చొరవచ్చు, నచలశృంగంబు లందుండి భూపాతమైనఁగావచ్చు, పొందుగా గ్రాసంబు పులికిఁ గావచ్చు, లోతైన జలములలో దూఁకవచ్చు, నాతికిఁబతి విహీనతయుఁగారాదు. భూభారములు గావు భూరుహంబులును నా భూధరంబులు నబ్ధులు నదులు వైధవ్యవతియైన వామాక్షిభార మీ ధరాసతి యోర్వ దేక క్షణంబు అడవిలో నొక వృక్షమై యుండవచ్చుఁ బుడమి వైధవ్యంబు పొందంగ రాదు అదిగాక నన్నిప్పుడంపి యా మీఁదఁ బ్రదికించి తెచ్చిన పతిఁగూడి రానె? అన విని దశకంఠుఁడౌఁగాక యనుచు వనితరో! యిదె పోవువాఁడ నన్నప్పు డా మాటలన్నియు నా దశాననుని భామ మండోదరి భావించి వినుచుఁ దన పెద్దకోడలిఁ దాఁ గౌఁగిలించి కొని శోక ముప్పొంగఁగొంత సేపేడ్చి కోడలిచెయి పట్టుకొని లేచి వచ్చి కూడి రాజస్త్రీలఁ గూడి లోపలికిఁ బోయి యంతఃపురంబున నున్నవేళ .......... యీ రాక్షసార్ణవం బింకించు ఘోర మై రాముబాణాగ్ని యాహవంబునను ఇక మీఁద దశకంఠుఁడేఁగి యుద్ధంబు సకలేశుతోఁజేసి సంగ్రామభూమి నింద్రారి పడురీతి నితఁడీల్గువాఁడు చంద్రాస్య! సిద్ధంబు శక్రనిర్జయుని తలఁదెచ్చు టెక్కడ? తరుణి సాగమము కలుగు టెక్కడ? నీకుఁగఠినయత్నంబు విను నీకుఁజెప్పెద వెలఁది! నీ కోర్కె ఘనముగాఁ దీర్చుకోఁగల దానవేని? అనుమానపడక నీ వతిసత్వరముగ జననాథుఁడగు రామచంద్రునికడకుఁ జని భక్తవరదీనజనకల్పతరువు మనసిజ శతకోటి మహితలావణ్యు నతి దయాపరమూర్తి నతనిఁబ్రార్థించి పతిశిరంబడిగినఁ బడఁతి! నీ కిచ్చు హితము దెల్పెద నేను నింతిరో! వినుము సతులకుఁబతులతోఁజనునంతకన్న గతులెందుఁగలవు దుర్గతు లెంచి చూడ నతివ! కామానలంబది యోర్వలేక ధవునిఁగౌఁగిటఁజేర్చి దహనతల్పమునఁ బవళించు సతి తనపతి నుద్ధరించి యుభయకులంబున నుద్ధరించుటయు విభవంబు నీతోడ వివరింప వశమె? యవనిపై ధన్యురాలా పుణ్యసాధ్వి దివినుండి యెదురుగా దివిజు లేతెంచి వివిధరత్నప్రభా విస్తారమైన యవిరళగతి దివ్యమగు విమానమున నెసగ దంపతులను నెక్కించి తాము పొసఁగంగ బహువిధపూజోపచార ములు చేయుచును బుష్పములవృష్టి గురియ .......... నరయంగఁబంచవాద్యమ్ములు మొరయ .......... గరుడ కిన్నర యక్ష గంధర్వ నాగ సుర గుహ్య కాప్సర స్సుర సిద్ధ సాధ్య విద్యాధరాంగనా వితతి వేష్టించి యుద్యోగములు సేయ నూర్ధ్వలోకముల నిందిరారమణియు నింద్రాణి వాణి యిందుశేఖరురాణి యెనయంగరాని పదవిఁగైకొనుఁగాదె పడఁతి సిద్ధముగ విదితలుబ్ధాధమవితత దారిద్ర్య దుష్టదురాచారదుర్బుద్ధిమూ.......... కుష్ఠరోగి కురూపి కుటిలాత్ముఁడైన దేవికి బురుషుండు దేవస్వరూపి భావింపఁ బతి వినా పరమెందుఁగలదు? పతిలోకములెకాని భామినీతతుల కితరలోకము గల్దె యిహపరాదులకుఁ బతియె జీవనమును, బతియె ప్రాభవము, పతియె ప్రపంచంబు, పతియె సాధనము, పతి శిరోరత్నంబు, పతి మానధనము, పతియె సుక్షేత్రంబు, పతియె ఛత్రంబు, పతియె శృంగారంబు, పతియె భూషణము, పతి భక్తి, పతి ముక్తి, పతి భుక్తియుక్తి, పతియె దానంబును, బతియె ధర్మమును, బతియె తపంబును, బతియె సువ్రతము, పతియె తీర్థంబును, బతియె భూయాత్ర, పతియె దేవార్చన, పతి హోమవిధులు, పతియె సుస్నానంబు, పతి నిధానంబు, పతి సదా జపమును, బతియె మంత్రంబు, పతియె పౌరుషము, బతియె పుణ్యంబు, పతి సర్వసిద్ధియుఁ, బతి భూరియశము, పతియె నిత్యంబును, బతియె సత్యంబు, పతియె పానంబును, బతియె పాత్రంబు, పతియె సంపదయును, బతియె సంతతియుఁ, బతి బాంధవావలి, పతి సుహృజ్జనము, పతియు దూరంబైన బాంధవులేల? యతనిఁబూజింపని యా చేతులేల? యతనికి మ్రొక్కని యా శిరంబేల? యతనిఁగన్గొనలేని యా కన్నులేల? యతని మాటలు నొలయని వీనులేల? యతని వర్ణింపని యా జిహ్వయేల? యతనిపైఁ దగులని యా మనంబేల? యతనిపైఁబాడని యా పాటలేల? యతనిపై నిలుపని యా బుద్ధియేల? యతని నుతింపని యా దినంబేల? యతనిఁ జింతింపని యా చదువేల? పతి కౌఁగిలించని పణఁతికాయంబు పవనకుంభితచర్మభస్త్రిగా కేమి? సవినయంబుగ సారసల్లాపములను అమరంగఁ బతితోడ నాడని నోరు ఢమఢమధ్వనితోడి ఢక్కగా కేమి? వరుసేవ సేయని వరకరాబ్జంబు తరసాస్థినిర్మిత దర్విగా కేమి? పురుషు నీక్షింపని పొలఁతి నేత్రములు ధరఁదనుకుడ్యరంధ్రములుగా కేమి? పరమ పతివ్రతా భామలక్షణము లరయంగఁబరపురుషావలోకనము కార్యంబులకు మంత్రి, కరుణింప దాది, పర్యంకమున రంభ, పనులకు దాసి, భోజనాదుల మాత భువి శమాదులను రాజిత ధర్మానురక్తురాలైనఁ ధరఁ గుటుంబిని కులోద్ధారిణి యండ్రు. నిరతంబు పతిభక్తి నిజమనోంతర్య మున నిల్చి సేవించు ముగ్ధ కా భర్త మెనయ పునర్జన్మ మెలనాఁగ!.... పరమపతివ్రతాభామవర్తనము మఱియును దెల్పెద మానిని! వినవె! విను మొక్క యితిహాస విధముండుఁదొల్లి యనుపమంబైన దుగ్ధార్ణవ దేశ మున నొక్క బ్రాహ్మణముఖ్యుండు సుమతి యను నామధేయుండు నతి శుచిర్భూతుఁ డుచితకర్మాచారుఁ డుత్తమానంద విచరుండు షట్ఛాస్త్ర వేదవేదాంగ వేది ధనాఢ్యుండు విశ్రుతంబుగను మేదిని వర్తించి మెలఁగ నా మీఁదఁ బరలోకగతుఁడైనఁ బడఁతితో నతని కరయంగ నొక పుత్త్రుఁడత్యంతరూప యౌవనంబుల ధృతి యనుపేరఁబరగి యే వార లెట్లన్న నింతైన వినక వాఁడును బ్రారబ్ధవశగతుండగుచుఁ బోఁడిమి చెడి హీనబుద్ధి యేర్పడఁగ స్నానసంధ్యాహోమజపసురార్చనలు దానధర్మాది సద్వ్రతవిధానములు మానుచుఁజాల దుర్మార్గుఁడై దుష్ట మానవ సహవాసమగ్నుఁడై యిచ్చ ఘనుల దూషింపుచుఁగపటకృత్యములు పనిపూని సేయుచుఁబరిహాసకములఁ దలపడి నవ్వుచు దండోగ్రవృత్తి బలువిడిఁ జూపుచు బండుబూఁతాడి ప్రజల నొప్పించుచుఁ బౌరార్భకులను బ్రజలార్వఁబెనఁగుచుఁబట్టి మోఁదుచును సొగసులు చేయుచు జూద మాడుచును బగలురే యనక.... పాఠకులందు సంగీతసాహిత్య సారంబులెల్ల నంగీకరించుచు నర్థ మిచ్చుచును .......... గులసతి నెడఁబాసి కులగోత్రహీను డవుచు ముక్తికిఁగాక యట బంధుజనుల కవగూడి నీచవాక్యంబు లాడుచును దూషింప వారిచే దూషితుండగుచు దోషంబునకుఁదాళి ద్రోచి సిగ్గెగ్గు తలపడి పిత్రార్జితంబైన యట్టి కలపదార్థంబును గాసువీసంబు నిలుపక కొల్లఁగా నిరతంబుఁదీసి సెలవుసేయఁగను నంచితముగా నున్న దంతయు దుర్వ్యయంబై పోవ నతఁడు నంతట నిర్ధనుండై యిల్లు చేరి మాపందు నుండని మనసువాఁడగుచు రూపయౌవనకళా రుచిరలావణ్య శరధి సత్కులజాత, చారుచరిత్ర, పరమపతివ్రత, వరభరితాంగి, వరకుటుంబినిఁగాంచి వసుధామరుండు మఱి సొమ్ము లడిగిన మారాడ కీయ నవి దెచ్చి వేశ్యల కర్పించి కొన్ని దివసముల్ వెళ్లిన దేవపూజయును చెరవలుఁ జెంబులు సరసవస్త్రములు వరుసతోఁబశువులు వలసినట్లెల్లఁ దెగ నమ్మి బ్రతుకెల్లఁదీర నాలయము తెగువతోఁగ్రయముకుఁదెగటార్చెనంత. నతిరిక్తుఁడై యున్న యా ధరామరుని రతికిఁగాఁదమచెంత రాకుండ సతులు తఱిమిన నెడఁబాయఁ దా నోపలేక చెఱకువిల్కానిచేఁ జిక్కి వడ్డికిని వాసి కప్పులు తీయ వారు దెమ్మనుచుఁ ద్రోసి భూరుహములఁదూగ నేయుచును బౌరవీథులయందుఁ బాషాణమెత్తి యూరక యుపవాసముండఁ జేయుచును గట్టికొట్టుచుఁజాలకష్టంపుఁబాటు పెట్ట నోర్వఁగ లేక పెండ్లాముకడకు వృత్తాంత మంపిన విని పతివ్రతయుఁ జిత్తంబులో నొచ్చి చింతాబ్ధి మునిఁగి పతి.... హింసాదిక పరితాపదేహ వతి యన్నపానవివర్జిత యగుచుఁ బరమఖేదంబున బడఁతి పుట్టింటి కరిగి తల్లియుఁదండ్రు లరుదంది చూడ ముగ్ధ యేడ్చుచుఁబాదములమీఁదఁబడిన దుగ్ధ డెందములొంద దుహితఁదామెత్తి యొనరఁగౌగిటఁజేర్చి యో యమ్మ!నిన్ను జెనకెవ్వ రేమైనఁ జేసిరో కీడు? లేక నీ పురుషుండు లేదు కద్దనుచు నో కన్య! నో నాడ నోపెనో? కాక కూఁతుర! విను నీతి కులకాంతలకును ఈతిబాధల నాథుఁడెన్ని పెట్టినను అధీనవతియైన యబల కీలాగు రా ధర్మమగునె? కారణ మేమి? వేగ తెలుపవే మా కన్నఁదెలుప వల్లభుని తులువచేఁతలు తుదాదుల కేలపోవు? నన్నిపోకలు చెప్ప నల్లుఁడు నడచు చున్న దుర్నీతికి నుపఖేదమంది ధనవంతు లీయ నా ధనమెల్లఁదెచ్చి ధనవంతులకు నిచ్చి ధవు విడిపించె. నంత నా చేష్టల నతఁడు మానకను వింతగా నప్పులు వేల సంఖ్యలును దిరిగిసేయుచుఁదీర్ప వెరవు లేకున్నఁ బరిపరివిధములఁబ్రజలెల్లఁజూడఁ జాలబెట్టుగ రోసి చాలుఁ బొమ్మనుచుఁ బ్రాలుమాలక నిండ్లఁబడి దొంగతనము చేయుచుఁ దనచేతఁజిక్కువస్తువులు నా యింతులకు నిచ్చి యాసక్తుఁడగుచు వర్తింప నొకనాఁడు వాసైన పెద్ద వర్తకునిలు చొచ్చి వారిచేఁదగుల నగరివాకిట నిల్పి నాసంబు చెవులుఁ దెగఁగోసి వీథులఁద్రిప్పి పట్టణము వెడలఁద్రోసినఁబోయి విపినమార్గములఁ గడుఁగ్రూరుఁడైత్రోవగట్టి బ్రాహ్మణుల సతుల బాలకులను సాధుసజ్జనుల నతిసాహసంబున నల్పుఁడై నిచ్చఁ జంపి దోచుచునున్న జనులార్వ జరులఁ బంపి రా జాతనిఁబట్టి తెప్పించి కాలుచేతులుఁదీసి కడు నుగ్రమైన శూలంబుపై నేయఁజూడ నా వార్త విని పతి.... వచ్చి వేఁడి కొంగొడ్డి తనకును బతిభిక్ష దయచేయు మనిన నా రాజు కరుణించియౌఁగాక! యనుచు వారింపఁబురుషుని వనిత మంచమున నెత్తించికొని వచ్చి యింటిలోపలను మెత్తని పానుపుమీఁద వల్లభునిఁ బవళింపఁగాఁజేసి పతిమూత్రమలము లవి యెత్తివైచుచు నంతరంగమున నితరభావము లేక యీతఁడె దైవ మతిపావనుండని యనుదివసంబు పురమందు యాచించి పోషింపుచున్నఁ బురుషుండు నొకనాఁడు పూఁబోణికనియె. మహినిఁ బతివ్రతా మస్తకమణివి బహుగతిఁగాపాడి బ్రతికించి తింక దేవి! నా కోర్కులు తీర్చెద ననినఁ గావించు పొరుగింటికాంత నా తోడ మును బొందుచుండర్థమూలంబుగాను ధనవిహీనునకు నాదర మెందుఁగలదు? వృక్షంబులును ఫలవిగతంబులైనఁ బక్షులు చేరునే? పరగంగ వృక్ష నిచయంబులెల్లను నిర్గంధమైన విచరింప షట్పద వితతేలపోవు? ననలదగ్ధములైన యారామములను ననువుగా మృగపక్షులందేల నిలుచు? సారంబు దప్పిన సారసీతటము చేరునె యంచలచ్చెరువులకైన? రాజ్యహీనంబైన రాజుఁజేపట్టి పూజ్యుఁగావింతురే భువిఁబురోహితులు? నిజముగాఁబురుషుండు నిర్ధనుండైన భజియించుచును వెలపడఁ తేలకూడు? నినుఁజూడఁగామిని! నీ సొమ్ములెల్ల వెనుకటి కేఁగొంటి విడిపుస్తె బొట్టు ఒకటున్న దది యమ్మి యొకమాడ దెమ్మి ప్రకటంబుగాకుండఁ బడఁతి మాపైన గోడ దాటుచు నీవు గొబ్బున నియ్య యోడక నిను మెట్టి యోలి యావలికి * * * యనుచు నాడిన పల్కు లంగీకరించి పెనిమిటి యభిలాష ప్రియమారఁదీర్చె. నంతట నొక్కనాఁ డబల నీక్షించి యింతి నేనొక వేశ్య నెడఁబాయకుంటి నా లతాంగినిఁబాసి యర్ధక్షణంబు తాళజాలను మనస్తాపంబు పుట్టెఁ. గావున నా వారకాంతఁబ్రార్థించి నీవు దెచ్చిన వచ్చు నిరతంబుఁదనకు నన్నపానాదుల నమరించినట్టు లన్నియు నా వేశ్య కమరింప నోపి తేని మనోవ్యాధి దీరు నా కనిన మానిని పతియాజ్ఞఁ మస్తకంబునను ధరియించి యా వారతరళాయతాక్షి నరిగి ప్రార్థించిన నదియు నిట్లనియె విను మొక్క శపథంబు వేఁడెద నిన్ను వనిత! నీ పెనిమిటి వశముగానున్న దినములలో నౌచుఁదిట్టికొట్టుచును బనులెల్లఁదొత్తుగాఁబాయక సేసె దని సమ్మతించి ..........బాస లెనయ నిచ్చిన వత్తు నింతి నే ననినఁ గుసుమకోమలి బాస కొమ్మురమ్మనుచు వసుధామరుని చేరువకు దానిఁదెచ్చి యంత నిర్వురను నేకాసనంబునను సంతసంబున నుంచి సామి నీ కిష్ట మది తన కిష్టమౌ నని వారసతిని మది నిజస్వామిని మాఱు భావించి యుదకంబులను దెచ్చి యుభయవర్గముల పదములు గడిగియుఁబైటతోఁదుడిచి పొందుగా గంధంబుఁబొల్పార మేన నందంబుగాఁబూసి యాకులు మడిచి మడుపుల నిచ్చుచు మాపైన పరుపు నుడుగక నేసి తా నుండ కచ్చోట తలుపు మూయుచు వెళ్లి తరల కాలోనఁ బిలిచినఁబోయి చెప్పినపనుల్ దీర్చి వెలపట గాపుగా వెస నిద్రగాచి వలపుల వారుండ వనజాతనయన యుదయంబు నొకజాము నుండంగ లేచి పదిలంబుగా నింటిపనులెల్లఁదాను నతిరయంబునఁదీర్చి యర్కోదయమునఁ బతిని వేశ్యను లేపి పాన్పు దీయుచును ..........మాన సుస్నానాదివిధులు కాఁజేసి యాచింప గ్రక్కుననేఁగి పురము సంచారించి ప్రొద్దుజామయిన నెరిగి మందిరమున కేతెంచి పాక మొనరించి పెనిమిటి కొడ్డించి వెనుక ననువుగా వేశ్యకు నమరంగఁబెట్టి మిగిలినంతే తి(ని మిగుల కుం)డినను వగపింతలే కుపవాసియై యుండి వివిధోపచారముల్ వెలయంగఁజేయ నవి నిరర్థకముగా నా వేశ్యదిట్టఁ గొట్టినఁదాళుక కూయక మనసు పట్టి వర్తించుచుఁబాదయుగ్మంబుఁ తలమోపి తప్పాయెఁదాళు కొమ్మనుచుఁ బలుమారు సంతోషపడఁబాటుపడుచుఁ గురులు నున్నగ దువ్వి కొప్పువెట్టుచును గురుకుచంబులమీఁద గుత్తంపురవికె సుదతికిఁదొడిగించి సొమ్ము వెట్టుచును నుదికి తెచ్చినచీర లొప్పారఁగట్టి యడిగిన వస్తువు లల తల్లిఁదండ్రి నడిగి తెచ్చిచ్చుచు నాదరించుచును బెనిమిటిమనసు నొప్పించ కీలాగు చనెఁగొన్నిదినము లా సతులసంగమము (?)సలిపి నత్యుష్ణసౌమనశ్చరణ వలయాంతరాతటివ్యాపారనిరత విషదగ్ధదేహుఁడై విభుఁడున్న యట్టి విషయంబు గన్గొని వెతలఁగుందుచును వేసార కెప్పుడు వెజ్జుల నడిగి యా సాస నౌషథంబమరఁజేసినను వాసిగాకను బాపవశుఁడైన ద్విజుఁడు చేసినకర్మంబు చేఁజేతఁగుడుప నా రోగమతిశయంబై గాత్ర మెడలి పాఱెను సెలలూడిపడె ముక్కుఁజెవులుఁ గనుగ్రుడ్లుఁజెడి రెండుకాళ్లు హస్తములు మునుపె పోయెను వట్టిముద్దగానున్న పెనిమిటి నరచేతఁబెట్టి పోషింపు చునునుండ నొకనాఁడు శుకవాణి కనియెఁ జెలియ! నీకేమైనఁ జెప్పు దింతైన నిలువదు చిత్తంబు నీ మీఁదియాన వనిత! మృత్యువునైన వంచింపవచ్చుఁ బెనుగాలి మూటగా బిగబట్టవచ్చు గతజలంబుల నడ్డుగట్టంగ వచ్చు నతిచంచలంబల్పమైన యీ మనసు నా పరాశరశౌనకాదితాపసులు నోపరు బిగఁబట్ట నొరు లెంతవారు? తలఁపున వచ్చును దరుణి నా కదియు బిలువ నింటికి రాదు ప్రేమ నిర్ధనుని పైనుండునే? వారపద్మనేత్రలకుఁ గాన, వీపున మ్రోసి గ్రక్కున నన్నుఁ జేరవేసిన దాని శ్రీపాదములకు సారెసారెకు మ్రొక్కి సానుకూలంబు వారకామినిఁజేయువాఁడ దీనతను మారాస్త్రపీడనోన్మత్తుండ నైన ఆ వేశ్య మున్పు నా కనుకూలవతియుఁ గావునఁ గరుణించుఁగడు దైన్యపడిన నీ రాత్రి గొనిపోయి యింతిన.... యో రాణి! బ్రతికించు టొప్పు నీ కనిన నా సుదతియుఁబతియాజ్ఞ మీఱకను వాసిగా వాకిలి వడి మూఁతవెట్టి సరిప్రొద్దువేళ నిర్జనవీథులొప్ప సరసిజానన మహాసాహసంబలర గాఢాంధకారంబుగాఁగ మేఘములు (రూఢిగారొ) ప్పుచు రుచిరఘోషములఁ బిడుగులు పడిరాలఁబెనుప్రవాహములు పుడమిఁద్రెళ్లఁగ వాన బోరనఁగురియ వడగండ్లు వడ మహావాతంబు వీవఁ దడియనీయక భర్త తనువుపై నొక్క గట్టిగొంగడి గప్పి కరయుగళంబుఁ బట్టి వీపునఁజేర్చి పదిలంబుగాను వీథులఁజన నొక్క వీథిలోపలను (?)బాధకోద్యుక్తమై పరగుశూలంబు దానిపై నొక తపోధనుఁడు మాండవ్య మౌని యయుక్తకర్మము లాచరింప నొడ....రిన యీఁగ నొకచేతఁబట్టి పొడవైన యీఁగతోఁ బొసగంగ గ్రుచ్చి ధరణిఁబాఁతిన దండధరుఁడు గోపించి యురిది యా మునిఁజేర నుర్వి కేతెంచి యరుణనేత్రంబులం దనలంబు రాలఁ బరమరోషమునఁదాపసున కిట్లనియె మఱ్ఱియూ(డలవ)లె మస్తకంబునను నెఱ్ఱఁగా విడిజడ లెన్నైనఁబెంచి విఱ్ఱవీగుచు ముక్కు వ్రేళ్లతో నదిమి యిఱ్ఱిచర్మముఁదాల్చి యెసగఁగంఠమున మానిసివై నీవు మౌనవ్రతంబు బూని కన్నులు రెండుఁబొల్పార మూసి ధ్యానంబు చేసుట దగ్ధంబుగాను మౌనిలోకేశ! యీ మహిని.......... వినవె మాక్షిక సర్పవృశ్చికాదులకు జనపీడనములు తజ్జాతికర్మములు వేధ నిర్మించెను విషయమాత్సర్య బోధ కామక్రోధ భోగాభిమాన విగతతాపసులకు విహితమే హింస? జగతి హింసాపరజను లధోగతికిఁ బొసఁగఁజెప్పెడు వేదభూరిమార్గములు దాఁగెనే నీ వొక్క తపసివే చూడ? శాంతంబు లేనట్టి సంయమితపము ఎంతైన నిష్ఠల నెఱుఁగవె, నీవు(?) మోసంబు కొఱగాదు మునులకెన్నటికి మోసంబుచే మునీంద్రుని తపంబణఁగు నంతయు నెఱిఁగి నీ యపరాధరహిత జంతువు కొర్తపై జార నేసితివి అదిగాన నీవు దివ్యాయుతాబ్దములు తుదగాక కొరతపైఁదూగుదు వనుచు శాపమిచ్చిన మండి సంయమీశ్వరుఁడు పాపాత్మ! నీకిత్తుఁబ్రతిశాపమనుచు ద్వాపరయుగమున ధరణిపై మర్త్య రూప మందఁగ మునీంద్రుఁడు శాపమిచ్చె. నా రీతి వారిద్ద ఱన్యోన్య శాప ధారులైరట దండధరుఁడేఁగెఁబురికి నంత వాహిని గొల్వ నా పురాధిపుఁడు రంతిదేవుండను రాజు దండెత్తి ధరణి శాసించుచు దాశార్ణవుండు మరలి మాండవ్యాశ్రమము చేరవచ్చి చేరువ బలు తాడిచెట్లున్న యట్టి ధారుణి నా రాజు దండెల్ల దిగిన గ్రీష్మర్తువున నర్కకిరణంబు లడర గ్రీష్మంబుకై వస్త్రగేహంబుబైట తెరగట్టి యా ధరాధిపుని మంచకము తరువుక్రిందట వేయఁదరుచుగా మింట రాణించువెన్నెల రవగాలి విసర రాణితోఁగూడ నా రాత్రి నిద్రించు సమయంబునను రాజసతిమెడనున్న యమలముక్తాహారములు వేగఁదీసి కోడునఁదగిలించి కుసుమాస్త్రుకేళిఁ గూడి మైమఱచినఁగుటిలుఁడై యముడు పక్షిరూపముఁదాల్చి బాగైన తాళ వృక్షంబుపైఁజేరి వీక్షించుచుండి ముక్కునఁగబళించి ముత్తేలసరము గ్రక్కున నెగసి యా గగనమార్గమున మాండవ్యుఁడున్నట్టి మహితాశ్రమముకు మెండుగా రెక్కలు మెలఁగ నేతెంచి ఘనతరాసుండునై కనురెప్పవ్రేసి ముని తదేకధ్యానమున నున్న నతని గళమునఁదగులంగ గ్రక్కున విడిచి తొలఁగె నంబరవీథి తోడనే యముఁడు ఉదయాన హారంబు నుండకుండినను బది దిక్కులరసి తాపసు నాశ్రమంబు కా దూతలరుదెంచి యాశ్చర్యమదిగొ మా దేవి హారంబు మౌనికంఠమున విలసితంబై వ్రేలు వీఁడెపో చోరుఁ డిల మౌనివేషాన నిటులున్నవాఁడు అని పట్టి కొట్టుచు హస్తయుగ్మంబు వెనుకకు త్రాళ్లతో విరిచికట్టుచును నృపునిముందటఁదెచ్చి నిల్పిన నతఁడు కుపితుఁడై వేయించెఁగొర్తపైనుండ నంధకారముచేత నరయంగ లేక గంధేభగమన యా ఘనుఁడున్న కొర్త తాఁకిన శూలంబు తలకి యాననము లోఁకువపడెఁబొట్టలో ప్రేవులెల్లఁ జీకాకుపడి తెగి చిమ్మినట్లుబికి ప్రాకె మీఁదికిఁగంఠపర్యంతమునకు. సునిశితంబైన యా శూలనిర్ఘాత తనుపీడితుండైన తాపసోత్తముఁడు చండకోపాగ్ని జాజ్వల్యమానముగ మండి శాపంబీయ మగువకిట్లనియెఁ గలికి! గోర్చుట్టుపైఁ గాఠిన్యవృత్తఁ దలఁప రోఁకటిపోటు తాఁకుచందమునఁ బిడుగులు పడువానిఁబిమ్మట గొరవి విడువక కొని కాల్చువిధమున నేఁడు మును శూలవేదనంబునఁబొర్లునాకు నినుమడిచేసితి విట్టివేదనలు కావున నతిపాపకర్మిణివైన నీవు వైధవ్యంబు నిక్కంబుగాను అందుదుగాకని యతఁడు శాపింపఁ బొందుగాఁదామోయఁబొరలక వీపు పైనున్న పెనిమిటిప్రాణముల్ వెడలె. మా నాయనప్పుడు మగువ నిర్జీవ జీవితేశుని భువిఁజేర్చక శవము నా వీపుననె మోసి యత్యుగ్రరోష మానసయై మహామహునకిట్లనియెఁ. గానక గాఢాంధకారంబుకతనఁ దాఁకితి నెఱిఁగి నేఁదాఁకలే దనఘ! నాకిచ్చు శాప మన్యాయంబు నీకు నజ్ఞానకృతమైన యపరాధమునకు సుజ్ఞాను లల్గుట చోద్యంబుగాదె? అతులితామోఘంబు ననఘ! నీ మాట మతి ధరించితి మహామహుఁడ నే నిత్తుఁ బడఁతు లీయఁగ రాదు ప్రతిశాపమైన నుడుగక పతిభక్తి యొప్పారఁజేయు సతికి వైధవ్యంబు సల్పగా నుదుట మతివిహీనత మదోన్మత్తుఁడై వ్రాయు చతురాస్యుశిరములు శతఖండములుగ క్షితిఁదూలవే యుపేక్షింతు నెమ్మదిని పతితుఁడై దూ..........పాఱంగ విడిచి యతివేగమునను బ్రాణాపహారంబు చేసిన శమనుండు చెడ కేలపోవు? మోసంబు చేయు నిర్మోహి కాలుండు తనకుఁ దా నిలువున దగ్ధుండు గాఁడె? చన నేల ననక వంచన సేయునట్టి దురితాత్మ! మృత్యువు ధూళియై పోదె? మరుమండలముఁబాసి మహిఁబట్టపగలు రాలవె చుక్కలు రాశిగా నభము? కూలదె భువిమీఁద గొడుగుచందమునఁ? గులశైల కానన కుగ్రామ నగర జలధిసర్వాపగా సహితంబుగాను క్రుంగదె ధారుణి కులశైలములును? మంగళవతుల కమాంగల్య మడర మునినాథ! నేను నీ ముందరఁజేతు వినుము! నా శపథంబు విశ్వంభరాంబు పవనతేజోవ్యోమపంచభూతములు సవితృచంద్రాదులు సాక్షిగా నిప్పు డనుదినంబును బతియాజ్ఞ మీఱకను పనివిని మారులు బలుకక నెప్పు డరలేక ననుకూలనై యుండి యతని వరుస బుద్ధీంద్రియ వాఙ్మనఃకాయ కర్మాదులందు నిష్కాపట్యహృదయ నిర్మలమతి మహానీతితోడుతను భయభక్తి గలిగి నే భజియింతునేని? ప్రియుని దైవంబుగా ప్రీతి భావించి యితరంబెరుంగక యే నుంటినేని? పతియె సర్వంబును పతి వినా యశము గతి శూన్యమంతరంగంబునఁదెలిసి హితయుక్తి వంచనంబింతయు లేక (?)నతని మనోహర(రథ)ంబను సరించుచును బ్రతికూలరహితనై పరమాదరమున ధరఁ బ్రవర్తించిన దాన నైతేని? పరమధర్మములతాత్పర్యంబు గలిగి వరుసన దృఢశీల వర్తి నైతేని? పరమపాతివ్రత్యభరితాంతరంగ నిజముగా నే నైన నీరజాప్తుండు త్రిజగంబులెల్లను దేజరిల్లంగ నుదయింప నే రీతి నోపుఁజూచెదను? మది విచారింప నా మాటేల తప్పు? నిది శిలాక్షరమని యెంచి పీనుఁగును సుదతి వీపున మోసి సొలవక నిలువ దివసత్రయంబున దినకరోదయము భువనంబులకుఁ గాకపోవునంతటను లోకముల్ వెలుఁగవు లోకాస్తమయము గా కానవచ్చెను గాఢాంధకార మంతట వ్యాపించి యధికమై తోఁచె. నంతకంతకు దట్టమై దిగంతముల (?)ముయ్యనప్పుడు లోకముల్ తల్లడిల్లఁ దియ్యకుండెను మూఁడుదినములు తమము సురలు హవిర్భాగశూన్యులు గాఁగ నరయంగ నుడిగెను నగ్నికార్యములు నుడిగె శౌచాదులు, నుడిగె స్నానములు, నుడిగె సంధ్యార్ఘ్యంబు, నుడిగెనుజపము, నుడిగె మంత్రంబులు, నుడిగెఁదంత్రములు, నుడిగె యజ్ఞంబులు, నుడిగెహోమములు, నుడిగె నధ్యయనంబు, లుడిగె శాస్త్రములు, నుడిగె పురాణంబు, లుడిగెఁదర్కములు, నుడిగె వ్యాఖ్యానంబు, లుడిగె శబ్దములు, నుడిగె దేవార్చనాద్యుత్తమక్రియలు, నుడిగె దానంబులు, నుడిగె ధర్మములు, నుడిగె హవ్యంబులు, నుడిగెఁగవ్యములు, నుడిగె భోజనములు, నుడిగెఁబానములు, నుడిగె ప్రస్తుతములు నుత్సవాదులును, నుడిగెను బెండ్లిండ్లు, నుపనయనంబు లుడిగె సంచారంబు, లుద్యోగవిధులు నుడిగెఁగృషిక్రియ, లుడిగె నేమములు, నుడిగెఁదపశ్చర్య, లుడిగె మార్గములు, రాజకార్యంబులు, రాజధర్మములు, రాజవర్తనములు, రాజుల కుడిగె నా యుష్ణ మణఁగిన నఖిలజీవంబు లాయెడ శీతబాధాధికయుతము లై నశింపఁగఁజొచ్చె నఖిలలోకములు పూనినప్రళయంబు పోలికై తోచె. హల్లకల్లోలమై హాహారవంబు నెల్లెడ వర్తింప నెఱిఁగి దేవతలు మొరలు పెట్టిన వారి మొరలాలకించి హరిహరబ్రహ్మాదులచటి కేతెంచి సురవృతులై నిల్చి సుదతి కిట్లనిరి. సరసిరుహానన! సాధ్వి నీ వౌదు వరపతివ్రతలలోఁబరికించి చూడఁ దరుణి! మెచ్చితి మింకఁదడవేల వేఁడు వరములిచ్చెద మన్న వనిత మ్రొక్కుచును గరములు మొగిచి యా ఘనులకిట్లనియెఁ. దొలుత నీ మునినాథు దురవస్థఁబాపి యిల విముక్తునిఁజేయు టిదియొక్కవరము ప్రథితంబుగా నిచ్చి పరమాదరమున శిథిలాంగములు యథాస్థితి నుద్భవింపఁ బతి సజీవునిఁజేసి పతిభిక్ష నాకు వితరణఘనబుద్ధి విమలాత్మనిష్ఠ దాన సదాచార ధర్మసుజ్ఞాన మానితోచితకృత్యమార్గాంగ.......... శ్రేయస్స్థిరాయువు సిరియు సంతతియు నీ యెడ దయచేయు టిదియొక్కవరము సతముగా నాకును సౌభాగ్యమమరఁ బతితోడ సాయుజ్యపద మీయఁజాలు వరములు మూఁడాయె వనజాక్షు లధిక తరమాశలకుఁబోవ ధర్మంబు గాదు వేఁడ బ్రాహ్మణులకు విహితంబు నాల్గు మూడడుగఁగ రాజముఖ్యుల కగును వరవైశ్యులకు రెండు వరుసశూద్రులకు నరయంగ నొక్కటి యడుగంగవచ్చు ననవిని త్రైమూర్తు లా యింతిమీఁద ఘనకృపారసనిరీక్షణము లింపార వనిత! నీ వడిగిన వరములలోన మునిముఖ్యు నీ నాథుమొదట నీవన్న విధము నిచ్చితి మమ్మ! వెలఁది! సాయుజ్య పదమున కర్హులే? పాపిష్ఠిజనులు కలకాలమును బాపకర్మియై యుండుఁ గలితమోక్షంబేలకల్గు నీ పతికి? నన నాతి యాశ్చర్య మఖిలలోకముల వినుతికెక్కిన వేదవిఖ్యాతమైన (?)పతితపావనులైన పట్టైన బిరుదు జితవిదూషణులార! చెడనాడఁదగునె? సకల పాతకములు స్మరణ మీ నామ మొకటి చేసినఁబోవు, నుద్దండమైన పవనభంజితమేఘపటలంబుభంగి రవిరశ్మిచేఁ దిమిరంబుచందమున మందాకినీ నీరమగ్నజీవులకుఁ బొందునే మలినంబు పోవ కెందైన? దేవేశులార! మీ దివ్యనామములఁ బోవు పాతకములు పొందుగా మిమ్ము దర్శింపనిచ్చునే తద్దయు ననిన హర్షించి యౌఁగాక! యనుచు దేవతలు తనరారఁగొల్వంగఁదమగేహములకు వనజసంభవవిష్ణు వామదేవాదు లరిగినఁబురుషుండు నవయవాంగములు పరిపూర్ణములు గాఁగఁ బరమసౌందర్య రూపయౌవనగతరోగుఁడై నిల్చెఁ. దాపసోత్తముఁడతి దారుణంబైన శూలవిముక్తుఁడై సుదతి కిట్లనియె. నో లోకపావని! యో పుణ్యసాధ్వి! శ్రీమహాలక్ష్మికి శితికంఠుసతికి వామాక్షి! నినుఁబోల్పవచ్చు నీ కెవరు సాటమ్మ? నినువంటిసతులెన్న మహినిఁ గోటి కొక్కతె యుండఁగువలయంబుండు నంతరిక్షంబుండు నర్కచంద్రాదు లింతిరో! యుదయింతు రీ జగంబెల్ల నుదయాస్తమయముల నొప్పారుచుండు వదలక నెలమూఁడువర్షముల్ గురిసి యవనియు ఫలితమై యఖిలసస్యముల యువతి! సుభిక్షమై యుండు నేవేళఁ బిదుకు గోవులు రాజపీడలు దక్కి సుదతి! భూప్రజలెల్ల శోకదుర్వ్యాధు లపమృత్యువులులేక హర్షులై యుండ్రు నృపులు ధర్మంబులు నియతిఁబాలింపఁ గలధరామరులు సత్కర్మఠులగుచు సలుపుయజ్ఞంబులు సాంగమై చెల్లు నడచు సత్కర్మముల్ నాతి! నీవంటి కడు పతివ్రతలును గల్గ లోకముల ధన్యురాలవు నీవు తరుణి! నీవలన మాన్యుండనైతి నే మానె దుర్దశయు నాయురారోగ్యంబు లష్టసంపదలు శ్రేయము సంతతక్షేమలాభములు నుత్సవంబులు గల్గి యుభయదంపతులు వాత్సల్యమున నుండి వర్ధిల్లుఁడనుచు దీవించి యుత్తరదిగ్భాగమునకు దేవి వీడ్కొని దివ్యతేజస్కుఁడగుచు మునివరేణ్యుఁడు తపోముఖ్యుఁడై చనిన వనిత యింటికి వచ్చె వరునితోఁగూడ నంతట సంతతం బభివృద్ధి యగుచు సంతానములు నతిశయముగాఁగల్గి తామరతంపరై తనరారుచుండ నా మహాసంపద లధికంబుగాను లోకప్రశస్తులై లోకు లెన్నంగఁ గైకొని సకలయాగములు సేయుచును సతతదేవద్విజసంతర్పణములు నతిభక్తితోడుత నతిథిపూజలును ఉత్తమక్రతువులు నుద్యాపనములు విత్తమూలములు గావించుచు నెపుడు సకలదానంబుల సకలధర్మములఁ బ్రకటంబుగా నిహపరసాధనములు గలిగియు ధర్మార్థకామమోక్షములు వెలయ సిద్ధించె సద్విధిఁబ్రవర్తనము నవనిపై జనులెల్ల నౌనౌ ననంగ భువిఁగీర్తిమంతులై భోగభాగ్యములఁ దనివిదీరంగ వృద్ధాప్యమౌ దాఁక ననువుగా బ్రదికి కాలావసానమునఁ బరగ విప్రుడు రోగపరిపీడనములఁ బరలోకగతుఁడైనఁబడఁతి సంపదలు వారక బహువిప్రవర్యుల కొసగి భూరిదానంబులు పొలుపారఁజేసి చితిమీఁదఁ బ్రాణేశుఁ జేతులారంగ నతిభక్తిఁగౌఁగిట నమరంగఁజేర్చి ధృతధైర్యచిత్తయై దేదీప్యమాన హుతవహునందు రామోచ్చారణంబు చేయుచుఁబవళించి శిఖిశిఖాదగ్ధ కాయయై స్వప్రాణగమనంబు సేయ యమదూత లేతెంచి యమలోకమునకు నమరంగఁగొనిపోవ నవ్విష్ణుదూత లెడదారి దండించి యెసగదంపతులఁ దొడవుల మణిగణద్యుతులొప్ప దివ్య మగు విమానంబున నలర నెక్కించి గగనమార్గంబున గమనించి పోయి పరగంగ వైకుంఠపరమధామమున కరిగిరి సాయుజ్య మమర దంపతులు. నీ మహాయితిహాస మెవ్వరు వినిన భామ! వైధవ్యంబు బాధింప వెఱచు నన విని కోడలిట్లనియె నో యత్త! మును గల్గఁబతిప్రాణములు విసర్జింప వెనుక సాగమనంబు వెలఁది చేసినను .......... అంతలో వైధవ్య మనుభవం బింతి కింతైన బాధింపదే యమ్మ! యనిన వినుము, కోమలి! దీని విధము చెప్పెదను కనుఁగొనఁగాఁ బూర్వకాలంబునాఁడు తారకాసురుని పుత్త్రత్రయంబైన ఘోరదానవవీరకులవధూటికల విహితపాతివ్రత్యవిమలధర్మముల మహిమచేఁబురములు మహిఁబొందకంత రిక్షంబుననె నిల్చి రేచి లోకముల నక్షోభపడ దాడిసల్పి యా వేళ దివిజభూచరుల నుద్దీప్తతేజమున నవిరళగతి గెల్చి యసురు లజేయు లై సంచరింపఁగా నాదివిష్ణుండు భావి(సి)ంచి కపటరూపంబున నేఁగి యా మహాత్రిపురాధిపాంగనాత్రయము నేమరి పతులుగా నెఱిఁగి కామములు ప్రేమారసల్పి యా పిమ్మటఁదెలిసి హే మహాపురుష! మాకిఁకమీఁద వచ్చు పాపంపు వైధవ్యఫలము పాయుటకుఁ జూపవే మార్గంబు సుశ్లోక! యనిన సతులార! వ్రతవినాశనమైన కతన నతిఘోరదుష్కృతం బాత్మవల్లభుల హతముచేయును మీరు నా లోన పతుల కతిభక్తిఁబ్రాణంబు లర్పించి పిదప సతమైన సౌభాగ్యసాగమంబమరఁ బతులతో నతినిష్ఠ పరగఁజేసినను మీకు వైధవ్యంబు మేకొనఁ జాల దాకల్పముగను ముత్తైదువలగుదు రని యానతిచ్చెఁజక్రాయుధుండపుడు వినవమ్మ! నీవును విశదంబుగాను గినిసినకిన్కఁ బంక్తిగ్రీవుఁ డాత్మ తనయుని తలఁదెచ్చి తగనిత్తు నీకు ననుమాట లవి కల్ల యది యెట్టులన్న మును విష్ణుమందిరమ్మున జయవిజయు లను(వారు)గర్వితులై యున్నయెడల సనకాదులచటికిఁ జయ్యన వచ్చి వనజోదరునిఁ జేర వడి నేఁగునపుడు చనఁబోల దనుటయు సన్మునిప్రవరు ..........మా కొక రడ్డమా? నేఁడు మది నెఱుంగఁగ లేక మమ్ము వారించు కతమున మీరు రాక్షసయోనియందు మతిదప్పి మూఁడుజన్మంబులు నొంది కడపట విష్ణులోకంబు గాంచెదరు. ఎడసేయ నేటికి నిది తప్ప దనిన మునులవాక్యమ్ము లిమ్ములఁదలమోసి కొని జయవిజయులు కుంభినియందుఁ గృతయుగంబున దితికిని సంభవించి రతిపాపవర్తనులై హేమకశిపు కనకాక్షులనువారు కడునద్భుతముగ. .......... నందు హిరణ్యాక్షుఁడనువాఁడు గర్వ మంది ధారుణిఁజంక నలరించికొనుచు వింతగా విహరింప విష్ణుండు కనలి యంతట ఘోణియై యాహవంబునను వాని వధించి యుర్వర నుద్ధరించె. మానినీమణి! యంత మదమున హేమ కశిపుండు లోకముల్ గారించుచున్న విశసించె నరసింహవేషంబుతోడ. హరిచేత నీ రీతి నంతంబు నొంది యిరువురు రెండవ యీ జన్మమందు రావణకుంభకర్ణ స్వరూపములఁ గావరంబునఁబుణ్యకాంతల మునుల సుర గరు డోరగాసుర సిద్ధ సాధ్య నర యక్ష దేవ కిన్నర పన్నగాది వరుల బాధించిన వారలుఁబోయి హరితోడ మొరవెట్ట నవ్విష్ణుమూర్తి ధారుణిలోపల దశరథాధిపుని సారసాక్షులలోన సాధ్వి కౌసల్య యందుదయించి దశాననముఖుల మ్రందింతునని వచ్చి మనుజవేషమున నిప్పుడు దశరథోర్వీశునియింటఁ దప్పక జనియించి తాటకఁద్రుంచి యాగంబు రక్షించి యతిసతిఁగాచి నాగభూషణువిల్లు నడిమికిఁదునిమి జానకి వరియించి జమదగ్నిరాము మానంబుఁగొని తండ్రిమాటకై పూని తాపసవేషంబు దాల్చి విరాధు రూపంబు మాపి పౌరుషము చెలంగ యతివరులకునెల్ల నభయంబు లిచ్చి రతికాంక్షచేయు శూర్పణఖను ముక్కు సెవులు ఛేదించి మించిన ఖరాదులను బవరంబులోపల భంజించి మాయ నెనసినమృగమును హింసించి గ్రద్ద కనుపమానందసౌఖ్యంబు నొసంగి తరమి కబంధుని దండించి శబరి వరభక్తి కైకొని వనజాప్తసుతుని మన్నించి వాలిని మర్దించి శరధిఁ గ్రన్నన బంధించి ఖలదశగ్రీవ ఘటకర్ణముఖ్యులఁగాలునిపురికిఁ దటుకున బంచి సీతాసతిఁగూడి సురలు గీర్తింప రాజులు ప్రమోదింప సరసులు సేవింప సాకేతపురికిఁ జేరంగ నేచి తత్సింహాసనమున నారూఢిగాఁగ రాజ్యము సేయుచుండఁ బరమత్సరములు నీశ్వరపూజలందు సరిజాప్య మత్యనుష్ఠానాదులందు నాతతతీక్ష్ణంబు లస్త్రశస్త్రముల ఘాతంబు మఖపశుగణములయందు పరమనిర్దయ రణప్రభృతులయందు విరసంబు వైరాగ్యవేదులయందు నవిచారగతులు నత్యర్భకులందు వివరింపఁగఠినత్వవిధి శిలలందు వరబంధనము కేశపాశంబులందుఁ బరపీడనరతిప్రయుతాబ్జనేత్రు నం దుదాసీనంబు నతులవిరక్తు నందుఁబ్రవర్తింప నఖిలరాజ్యంబుఁ బరమసుఖస్థితిఁబరగుచునుండ నరులెల్ల రాముఁడున్నత పదంబైన వైకుంఠమునకుఁబోవలసినవేళ మా కాయములతోడ మముఁగొనిపోవు దావనేమిటికని తనరి భూప్రజలు చావక మహినిల్వ సమవర్తిపురము పాడయ్యె. రుద్రప్రవాసభూస్థలులు పోడిమి చెడునని పురహరాంతకులు క్రమమనోరోగసంగతులైన కతన యమునిదేహంబు నైల్యంబు పాటించెఁ. బ్రమథాధిపతి పాండువర్ణుఁడై వెలసె. శమనశంకరులిట్లు సంకటపడుచు నన్యోన్యులాత్మసద్వ్యవహారధర్మ సన్న్యస్తులైన సంసారతాపత్ర యములు దూగకపోవుననిప్రయత్నమున యముఁడొక్క మహిషంబు నభవుఁడుక్షంబు నమర సంపాదించి యతిదీనవృత్తి సమరసబుద్ధి విచక్షులై వారు విషయభాగురులయి విదితంబుగాను కృషిజీవనముల కాకృతిఁజేసినారు మహితరాజ్యభ్రష్టమానవేశ్వరులు విహితతపంబుల విహరించినట్లు పొసఁగని వాహనంబులు గావె యనిన వసుమతి నరహస్తివరశిబికాశ్వ ఘనవాహనంబులు గల్గియుండఁగను అనువుగా హీనవాహను లౌట గలదె? అతివ! రెండవజన్మ మా విధంబైనఁ ద్రితయజన్మంబిఁకఁద్రేతాయుగంబు నుడిగిన ద్వాపరయుగము రా వీరు నుడుగక దానవాంశోద్భవులగుచుఁ దమఘోషుఁడను చైద్యధారుణీశునికి నమరంగ శిశుపాలుఁడట దంతవక్త్రుఁ డను నామధేయులై యవని జన్మించి వనిత! విష్ణుండు భూభారహరార్థ మయి ప్రశస్తంబైన యదువంశమందు నయమార వసుదేవనందనులగుచు నలరంగ రామకృష్ణావతారములఁ దలఁప దుష్టాసురదమనులై మెలఁగి సరగున నిర్జింప జన్మముల్ దొరగి హరపితామహులకు నందంగరాని పదవిగైకొని పరబ్రహ్మమందైక్య పదులౌదు రా విష్ణుపార్శ్వసంచరులు వినుతభవిష్య మివ్విధమున నుండు ఘనుఁడైన రామునిఁ గయ్యంబులోన గెలిచెద నను దశగ్రీవున కెట్లు గలుగు నా జయములు? ఘనుఁడింద్రజిత్తు శిరము దెచ్చుట విశేషితవిస్మయంబు పరగ నసాధ్య మీ పని నాకుఁజూడ. నమ్మరో! మాటలు నలినాక్షి! వేగ పొమ్ము రాముని నీవు పొడగాంచి యపుడు పరమదయాళుండు పతిమస్తకంబు తరుణి! నీ కొసగును దడయ నింకేల? ననిన నత్తకు మ్రొక్కి యా సులోచనయుఁ దన మామకడ కేఁగి తా నప్పుడనియె. వినుము, రాక్షసలోకవిభుఁడ!నా మనవి అనికేఁగి వైరుల నణఁచి నీ సుతుని తలదెచ్చుటయు దీర్ఘతర యత్నమగును దలచినట్లుండవు దైవయోగములు కాఁదగునర్థంబు కాకేల పోవు? నా దేవతలకైన నమరారి! నీవు తలఁచిన కార్యంబు దప్ప కేలాగు తలవచ్చు? రాకున్నఁదన కార్యహాని నిజముగా గెలుపని నెఱ నమ్మరాదు. విజయాపజయములు వివరింప సమము తెలియంగ నీశ్వరాధీనంబు గాదె? చలపట్టి చేయ నౌ సత్కార్యహాని అదిగాన నీవు నా కానతిచ్చినను సదయుఁ డా రఘురాము సన్నిధికేను జని శిరంబడిగెద సౌమ్యభావమున ననఘాత్ముఁ డా రాముఁడతిదయనిచ్చు నన విని పౌలస్త్యుఁడంతరంగమునఁ దనకుఁదానొక కొంతతడవు చింతించి విను నితంబిని! నీకు విపరీతబుద్ధి మనసులోపలఁబుట్టె మహిఁగులాంగనలు నీలాగు పోదురె? యిది యధర్మంబు లోలాక్షి! యేమని లోకు లాడెదరు? రచియింప సౌందర్యరాసులైనట్టి రుచిరయౌవనకళారూపలావణ్య ములఁ దేలు యువతులమోము వీక్షించి జలపర్ణవాయుభక్షణులైన మునులు మనసిజాశుగ భేద మర్మాంగులగుచు మనసు పట్టఁగలేరు మనుజు లేపాటి? సరిలేని సౌందర్యరాసులైనట్టి కోరెక దుస్తరకామకుండాగ్ని మధ్య పతనుండి నా కింతపని పుట్టెఁగాదె? హితము గాదిది మాను మెఱిగి శాత్రవులు సీతకు బదులుగాఁజెలియ! నిన్నాడ నీతిబాధలకు వేయించరే చెఱను? బరులచేఁ జిక్కినఁ బరమసంకటము మఱువు మీ పని యన్న మామ కిట్లనియె. గుఱుతుగా నిక్ష్వాకుకులపవిత్రుండు ధరనెన్న దశరథాత్మజుఁడు రాఘవుఁడు పరమధార్మికుఁ డతిపాపభీతుండు పరవధూవిషయలంపటపరాఙ్ముఖుఁడు పరమాత్ముఁ డతఁ డేకపత్నీవ్రతుండు దురితదూరున కిట్టిదుర్మార్గవృత్తి కాలత్రయంబునఁ గల్గునే? యతఁడు ఆ లోకదుర్దోషహరనామకుండు దోషబాధితుఁడౌట ద్రోణాద్రి రోగ శేషపీడితుఁడౌట చిత్రభానుండు పరిలిప్తమక్షికా బంధురుండగుట సురగంగ మలినభాసురగర్భయగుట సరిగాదె విడువు మీ సందేహ మతని వరసోదరుఁడు నిజవంశపావనుఁడు ధర్మతత్పరుఁ డన్యదారానుజుండు ధర్మాత్ములని యెన్న ధరమించినారు పరమపావనులు కృపాళురు వారు చెఱవేయఁదలతురే చెలుల నెందైన? ననుమాన ముడిగి నా కానతిమ్మనిన వనజాక్షి కా పంక్తివదనుఁడిట్లనియెఁ. జెలియ! నీ కానతిచ్చిన రాముకడకు బలముతోఁగూడి భద్రంబుగాను నరిగి నీ విభుశిరంబడుగు వారిత్తు రెఱుఁగరే? రావణు నినకులాధిపులు నా భయంబుండును నాకవాసులకు నో భామ!మనుజుల కుండుటే యరుదు చెలిమిచే నియ్యక చెలియ పొమ్మనిన బలిమిచేఁగొనువాఁడ బాహుశౌర్యమున నెలనాఁగ! యొకవేళ యింతి జానకిని బిలుపించు విడుతు మా పిమ్మట ననుచు మారుగా నిల్పిన మనుజవానరులఁ గ్రూరబాణానల ఘోరకరాళ జాలనిర్ఘాత జర్జరిత సర్వాంగ లోలుఁడై నటియింప లోలాక్షి! భయద రక్తధారావృష్టి రణభూమి గాఁగ ముక్తజీవులఁజేసి ముగ్ధరో! నిన్ను విడిపించి తెత్తు నీ విభునిమస్తకము జడియక పొమ్మన్న శక్రారిభార్య మనమున సంతోషమగ్నయై వేగ తనమామకును మ్రొక్కి తడయ కావేళ నంత రావణుకోడ లాస్థాన మెడలి కాంతలు గొల్చిరా ఘనవాజి నెక్కి పతిబాహుదండంబుపై నిడికొనుచు నతులవాద్యధ్వనులనువుగా మ్రోయఁ జతురంగ వాహినీసహితయై రాఁగఁ బ్రతివీథులందెల్లఁ బర్వులెత్తుచును సుదతులు పురుషులు చూడ వేవేగ నెదిగి మిద్దెలు మేడలెక్కి వీక్షించి (?)మానినీమణి యాదిమార్గంబు నడవ నా నిశాచరజనం బాడుకోఁదగిన మాటలు తమలోన మమ్మొల్లమనుచు మేటి మా స్వామిని మీ తోడఁదనకుఁ బనియేమి యనియెడఁబాసి పతైన ఘనఘోషుఁగూడఁగ ఘనుని రావణుని వీడ్కొని యనలప్రవేశంబు సేయు వేడ్క రామునిచేత విభునిమస్తకము నడిగి తెచ్చెద నని యతిసాహసమునఁ దడయక పోవు నీ తరుణిఁజూచితిరె? ఈ గహ్వరీభావమెల్లను దాల్చు భోగీశు గారాబుపుత్త్రి లోకైక రావణుండైన యా రావణుండతని దేవి మందోదరి దీటైన పెద్ద కోడలింద్రునిఁ బట్టుకొని సంగరమున నీడకుఁ దెచ్చిన యింద్రనిర్జయుని పడఁతికిఁగల్గె నీ పాటు పో నేఁడు. కడు రత్నమయమైన కనకమంచమున మృదుశయ్యపైఁబూలు మేనొత్త నోర్వ కొదిఁగిన యొడలు నేఁడొందు గాష్ఠముల బర్యంకమునఁజేర్చుపగిది నేలాగు సూర్యుని వేఁడిమిసోఁ కోర్వలేని దేవి కోమలమైన దేహంబు తాళుఁ బావకముఖశిఖాస్పర్శ కే విధము? ప్రాణేశువిరహతాపము కోర్వలేని ప్రాణ మే విధి నగ్నిపరితాప మోర్చు? హోమధూమము నోర్వ నువిదనేత్రములు నా మహానలధూమమందెట్టు లోర్చు? నీచమే యొడిగట్టి నీరజాసనుఁడు చూచి వ్రాయక బుద్ధిశూన్యుఁడై నుదుట నీ చందమున లిఖియించ నేమిటికి? భూచక్రమునఁ దన పోసరంబునను అనయ శూర్పణఖ యీ యవనీశుఁజెనకి తన ముక్కు చెవులును దాను గోల్పోయె. నదిగాన ఖరదూషణాదిరాక్షసులు పదునాల్గువే లేక బాణనిర్ఘాత హతులైరి రాముచే, నంత రావణుఁడు హితము గైకొనక మారీచదైత్యుండు మృత్యువందినఁదెచ్చె మిథిలేంద్రపుత్రి నత్యరిష్టంబుల కాదిగా మొదలఁ దూలెఁగబంధుండు తునిగె విరాధుఁ డీ లవణార్ణవంబెగసి మర్కటము ఏకాకియై వచ్చి యీ లంకఁజొచ్చి చీకాకుపడి యిండ్ల సీతను వెదకి కోలాహలంబుగాఁగొల్లలాడుచును ధూళిగా వనమెల్లఁ దునిఁగిపో వైచి గట్టిగా రాక్షసాగ్రణుల వాలమునఁ గట్టి వారిధి ముంచి కడు లంకఁగాల్చి యక్షాదులను జంపి యది పోయె మరల నక్షీణతర విక్రమార్జిత మగుచు విపరీత మిది కన్నవిన్నది లేదు నెపముగా నంబుధినీళ్లపై రాళు లే కాలమునఁదేలె? నీ ఋక్షకపులు మూకలుగాఁగూడి ముట్టడి లంక యే కాల మేసిరి? యిది కాలవికృతి గాక సుపర్వారిఘనతరపథ్య కపిమానవాశనకర్బురోత్తములఁ గపిమానవులు చంపఁగర్తలై రరిది కూలెఁబ్రహస్తుండు ఘోరవిక్రముఁడు తూలె ధూమ్రాక్షుండు దోర్బలయుతుఁడు తెగె విరూపాక్షుండు త్రిశిరుండు పొలిసె నెగసె నికుంభుండు నీల్గెఁగుంభుండు ఘనబలాధికుఁ డతికాయుండు మ్రగ్గె. దునిసెఁబార్శ్వుండును దునిగె దోర్బలుడు పడె వజ్రదంష్ట్రుండు బలుఁడకంపనుఁడు నుడిగె దేవాంతకుండుక్కరి మడిసె నొరిగె నరాంతకుండొగిఁ గుంభకర్ణుఁ డరిగెను మకరాక్షుఁడంతకుఁగదిసె నింద్రజిత్తుఁడు జచ్చె నిటమీఁద రామ చంద్రునిచే నిశాచరనాథుఁడైన యా రావణుఁడుఁగూల నట విభీషణుని యా రాజధానికి నీశుఁగావించి ధరణిజతోఁగూడి దశరథరాముఁ డరుగు నయోధ్యకు నానందమలర నని యిట్లు పౌరజనావళు లాడు కొన వారి మాటల కోలాహలంబు కర్ణయుగ్మంబులఁగడువేడ్క వినుచుఁ బూర్ణేందు ముఖమునఁ బొడినవ్వు చిలుకఁ దన వృత్తి రామాంఘ్రి దర్శనాపేక్షఁ దనరంగ లంకయుత్తరపువాకిటను వెడలె రావణుభాగ్యవిభవైకలక్ష్మి. వెడలిపోయిన క్రియ వేవేగ రామ చాపముక్తములైన శరములో యనఁగ నా పయోధరగర్భ మందుండి జారు జలబిందువులఁబాసి చరమాద్రిఁబాసి వెలువడు వాహిని వెల్లువ లనఁగఁ గడువేడ్కఁగుచముఖగ్రహణంబు సేయ విడివడ్డ లేగల విధము దీపింప భయదరాక్షససైన్యపరివార యగుచు రయమార నడవంగ రాఁజూచి కపులు చతురంగవాహినీసహితంబు గాఁగ నతిముదంబున వచ్చి రాహవంబునకు నదె రాక్షసుల దర్పమణఁపంగవలయుఁ బదపదండని శైలపాదపౌఘములు మొదలంటఁబెరుకుచు మొనలు సాగుచును విదితభూభాగంబు విరియ మిన్నదర నురుముచు నెదురుగా నురువ డేతెంచి గిరిచరు లత్యంత కినుకతో యుద్ధ సన్నద్ధులై నిల్చి సతిరాకసొంపు కన్నులఁజూచి యా కాంతయెవ్వతెయొ? లాలితలావణ్యలక్ష్మి గాఁబోలుఁ? బోలిన యా చతుర్భుజ శంఖ చక్ర ములును వైష్ణవచిహ్నముల నవియేవి? తలపంగ నా శక్తి దాక్షాయణైన హరివాహనము తృతీయాక్షత్రిశూల కరమేది శారదగాఁబోలు ననిన జే పుస్తకము వీణె సితగాత్రమేది? యా పులోమజ(యైన) హస్తీంద్రవాహ నమదేది తోచు జానకిని రావణుఁడు సముదయంబులతోడ సాగనంపినను అదె వచ్చె నా సీతయనుచు సమ్మోద హృదయులై తమచేత నెనయుసాధనము లుర్విపైఁబడవైచి యుఱికి యా రాఘ వోర్వీశుకడ కేఁగి యొగి సాగి మ్రొక్కి వినతులై హస్తారవిందముల్ మొగిచి యొనరంగ నుల్లాసితోత్కంఠు లగుచు నో దైవతారాధ్య! యో దైత్యదమన! నీ దేవి సీతను నేఁడు రావణుఁడు అవివేక మెల్లను నటుపాఱఁద్రోసి వివిధమాయాబలవిదుఁడైన యగ్ర సుతుఁడింద్రజిత్తుఁడు శూరాగ్రగణ్యుఁ డతులశౌర్యుఁడు సుమిత్రాత్మజుచేత రణహతుఁడైన కారణమున భీతి వణఁకుచుఁదన సైన్యపంక్తితో నంపె నీ యంద మీ చంద మీ చక్కఁదనము మా యమ్మనే కాని మఱి చూడఁగలదె? అనవిని రఘురాముఁడల్లన నవ్వి మనమున భావించి మఱియు నిట్లనియె మట్టాయెనో దృష్టి మమతతోఁదిరుగఁ బట్టెనో భూతంబు భ్రమలఁబొందితిరొ? వనచరోత్తములార! వైదేహి గాదు ఒనర సూర్యోదయం బొకవేళ నగును దెలియంగఁబశ్చిమదిగ్భాగమునను జలనమౌ కనకాద్రి సరి నుదకములు ఆ జన్మగిరి కెక్కు నంబుధు లింకు, బీజంబు పాషాణభేదియై మొలచుఁ, జెదలంటు నగ్ని, యుష్ణించుఁజందురుఁడు, మృదు వందుఁబవి, నమృతమగు విషము, జనియించు దృష్టియు జన్మాంధునకును, విను బధిరుఁడు, గోప్యవృత్తంబు మూక పాడు సంగీతంబుఁ బల్కనృతంబు పాఁడి దప్పును సత్యపరిభాషుఁ డితర పురుషావలోకనంబున సంచలించు పరమ పతివ్రతాభామచిత్తంబు, నింత పుట్టినఁబుట్టు నెన్నిభంగులను సంతాపకోప మాత్సర్యాభిమాన కుటిలగుంభితమనస్కుండు రావణుఁడు పటుతరంబుగ మేనఁబ్రాణంబులుండ వైదేహి నిచ్చునే? వలదేల యనక కాదు సీతాదేవి కపులార! మీరు పదర నేమిటికి నీ పడఁతెవ్వరిచట (?)కెదుగవచ్చినవిధంబెఱుఁగంగ వలయు. ననునంతలోపల నా విభీషణుఁడు పనిచియుండినచరుల్ పరగ నేతెంచి సవినయంబుగ సులోచనరాక దెల్ప రవికులాధిపుఁడంత రాని రాకుండఁ జెనక నేటికి మీరు చెనకకుండినను అని యానతిచ్చిన నౌఁగాకయనుచు వనచరు లంత నా వారవర్తింప జనక నా శ్రీరామజనపాలు నాజ్ఞఁ నూరకుండిరి. ముగ్ధ యురువ డేతెంచి భూరిసైన్యంబుతోఁబ్రోగుగా బైట నునిచి యశ్వము డిగ్గి యుత్సాహమెసగ నొనరంగ సేవికాయువతిసమూహ పరివారయుక్తమై పదము వీడంగ పరగ నందెలు మ్రోయ బాహువు లూఁగఁ గటితట మసియాడ గనకనూపురము పటుతరధ్వను లీయఁబాలిండ్లు గదల జఘనముల్ మొరయంగ జడ వీపు నాడ రఘురామముఖ కళారమణాంశునికర రత నిజాంబక చకోరములు ప్రాశింప సతియు నత్తఱి సభాస్థానంబుఁజేరి సౌమిత్రి నలవిభీషణ గజగవయ రోమహర్షణ నీల ఋషభ సుగ్రీవ హరి మైంద కేసరి హంస సుషేణ శరభ తేజోముఖ శతబలి ద్వివిద హనుమ దంగద ముఖ్యహరిఋక్షవరులు తనుఁగొల్చి వేష్టింప దారకామధ్య మునఁబ్రకాశించుసోమునిభంగిఁదోప వనధివేష్టితుఁడైన వరుణుఁడో యనగఁ బ్రమథాది పరివృత పరమేశుభంగి నమలసన్మునిసేవితాబ్జజుభంగి నగపరివృత హేమనగము చందమున ఖగసంయములతో ఖగరాజుఁబోలెఁ గుసుమశరాన్విత కుసుమేషుభంగి వెసఁబరీక్షక జనవితతిమధ్యమున విలసిల్లురత్నంబువిధమున నుండ బలువిడి చనుదెంచి భావంబు నలరఁ జండాంశుఁగనుగొను చక్రవాకంబు పండువెన్నెల కాసపడు చకోరంబు అంబుదంబును జూచు నలమయూరంబు అంబుపానము గోరనాతఁడు మడువు నరయ ధన్వంతరి నతిదీర్ఘరోగి పరగ నల్పాయువు పరమామృతంబు నిరుపేద మిగులపెన్నిధిఁగన్నకరణిఁ బరమపావనమూర్తిఁబరమాత్ము రామ భద్రునిఁబొడగాంచి పరితోషయగుచు భద్రేభయాన సద్భక్తి పూర్వముగ శిరము వంచుక ప్రదక్షిణములు చేసి గురుతరోన్నతకుచకుంభయుగ్మంబుఁ బిక్కటిల్లగఁజూచి ప్రీతి రెట్టింప మ్రొక్కులు మ్రొక్కి రామునిసన్నిధాన మున నిల్చి సభికులు ముదమంది చూడ వనజాక్షి గంభీరవచనచాతుర్య మృదుమధురోక్తుల మెలఁగ నిట్లనుచు సుదతీశిరోమణి స్తుతియింపఁదొణగె. దేవాదిదేవేశ ! దేవారినాశ! రావణాసురకంఠరంభావిభేద! మశకీకృతారి! దుర్మదదైత్యమథన! .......... సురమౌనిమౌళి భాసురపాదపద్మ! హరచాపహరణ! యహల్యావిశేష శాపమోచన! భూమిజాకరగ్రహణ! పాపపంకాదిత్య! భవరోగవైద్య! రాజపూజిత! రాజరాజానుజారి! రాజశేఖరబాణ! రాజాఘహరణ! రాజతారారాజ! రమ్యసులపన! రాజజీవంజీవ! రాజీవనాభ! క్రమసరయూతీర కల్యాణధామ! సమదదానవ! మహాజలదౌఘపవన! కమలసంభవనుత! కపటాపహరణ! కమలభంజన దివాకరవంశతిలక! కమనీయశరచాపకరకంజయుగళ! రమణీయమత్త సారంగేశవరద! మహితాష్టవర్ణైక మంత్రస్వరూప! రహితకల్మషమహారణరంగభీమ! కదనదారిత కుంభకర్ణ ఋష్యాత్మ! సదన సంతతవాస! సద్దరహాస! చిదచిద్విశిష్ట! యోచిన్మయాకార! మదనసన్నిభతేజ! మకరాంకజనక! బలపరాక్రమ! బాహుబలమహాశౌర్య అలఘుదయాశీల! ఆర్యానుకూల! వనజసన్నిభకర! వనవధూచుబుక! ఘనకుచగ్రహణసంగతచతుర్హస్త! కమలజభవచిత్త కమలైక తపన! కమలజాంబక! నీలకమలభృద్వర్ణ! కమలసంగతదైత్య గర్వాపహరణ! కమలబాంధవకోటికాంతివిస్ఫురణ! సతతదానవవధూజనకంఠసూత్ర! లతికావిభేద సల్లలితోగ్రదాత్ర! జలములోపలఁబుట్టి జలము భేదించి ఖలు సోమకాసురు ఖండించినట్టి నిగమగవేషణాన్వితమత్స్యగాత్ర! మిగులవేడుక ననిమిషులు దానవులు మదమున దుగ్ధాబ్ధి మధియింప నగము కుదురుగాఁదాల్చిన కూర్మస్వరూప! శతకోటి హరిరుచి దంష్ట్రాగ్రఘోర! వితత సువర్ణాక్ష విదళనాధ్యక్ష! వసుధాతలోద్ధార వారాహదేహ! మెసగ భక్తార్థమై యిల హేమకశిపు నఖశరంబులఁజీరు నరహరి దేవ! మఖవిదీక్షిత మహామహుఁడైన బలిని ధరణి మూఁడడుగులు దానంబు వేఁడి పరమపాదంబునఁబాతాళమునకు వరుసతోఁద్రొక్కిన వామనాకార! గురుతుగా క్షత్త్రియకులుల మార్కొనుచుఁ గయ్యంబులోఁ బరాక్రమము దీపింప ముయ్యేడుమార్లు నిర్మూలంబు చేసి ప్రణుతికెక్కినయట్టి భార్గవరామ! రణమున ఘటకర్ణరావణాసురుల దండింపఁబుట్టిన దశరథరామ! మెండైన యీ మహామేదినీభార మంతయు ధరియింపు హలధరమూర్తి! వింతగాఁబురవధూవిలసద్వ్రతములు భంగంబు నొనరించు బౌద్ధవిఖ్యాత! సంగరాంగణవీరసమ్లేచ్ఛహరణ! కలితహయారూఢ కల్య్కావతార! తలఁప ననంతావతారుండ వైన మనుజేశ! నీ మహామహిమ వర్ణింప .......... జిహ్వలు రెండాయెఁ జెలియ వాగ్దేవి గహ్వరిపత్రంబుగాఁజేసి మేరు సమకజ్జలంబును జలధిపాత్రంబు నమలకల్పనరేఖ నమరంగ సార్వ కాలంబున ననంతకల్యాణగుణము లేల వ్రాయుదు పార మేమంచు నాభి కమలజాతుఁడు బ్రహ్మ గనెనె వేయ్యేండ్లు విమలోదకంబుల వెదకి వేసారె నినుఁగొనియాడంగ నే నెంతదానఁ గనుఁగొన నినువినా కలదె తారకుఁడు పరగఁ బిపీలికాబ్రహ్మపర్యంత మరయఁబ్రపంచభూతాదులయందు నణురేణువులయందు నగ్నిపాషాణ ఘనకాష్ఠములయందుఁ గలుగుచందాన పరిపూర్ణుఁడవు నీవు పరమాత్మకుఁడవు కరిరాజసంరక్ష కరుణాసముద్ర! శరణు వేడినఁ గాచుస్వామి నీ బిరుదు మరుగు చొచ్చితి నేను మన్నించు మనిన విని రాఘవుఁడు కృపావీక్షణుండగుచు మనమున సంతోషమగ్నుఁడై పలికె. నీ వెవ్వతెవు? మరి నీకుఁబేరేమి? రావలసినది యే క్రమ మీడ? కనిన భామిని రామభూపాల! నావృత్త మా మూల మడిగితి వాదరంబునను విను, సరసిజయోని విమలవంశమున ననుపమతేజుఁడౌ నా విశ్రవసుని సుతుఁడు వాసవముఖ్యసురదర్పహరుఁడు నతులవిక్రముఁడు లోకాంతకుఁడైన రావణుకోడల రణమహోదగ్రుఁ డౌ వాసవారి కిల్లాల నేఁగానె పేరు సులోచన ప్రియుఁడింద్రజయుఁడు ఘోరాహవక్షితిఁ గూల దద్బాహు చండవిక్రముఁడైన సౌమిత్రి నిశిత కాండనిర్భేదమై గగనంబు కెగసి నిజగృహాంగణమున నినదంబు గాఁగ భుజపతనంబైన భూమీశ! నేను అనుమానపడిన నీ యవని పత్రమునఁ దనరుతర్జనివ్రేల తనరు నా వెంట నరుగుదెమ్మని వ్రాసె నందఱు చూడఁ బరమాత్మ! నీ పాదపద్మంబులాన అదిగానఁ పతిశిరంబడుగ మిమ్మిపుడు సదయాత్మ వచ్చితి సమ్ముఖంబునకు నన విని రఘురాముఁడంతరంగమునఁ దనకుఁదా వెఱఁగంది తనుఁగొల్చియున్న సభికుల వీక్షింప సభికు లారామ విభున కిట్లనిరి. యో విశ్వేశవంద్య! యా కళేబరరూపమైన వృక్షంబు పైకొమ్మ నుందురు పక్షులై జీవ పరమాత్ము లిద్దఱు పరిపక్వమైన నరయఁగర్మాకర్మ మను ఫలంబులను అనుభవించును జీవి యా పరమాత్మ కనుఁగొన సాక్షియౌ కర్తవ్యఫలము సర్వజ్ఞుఁడవు నీవు సర్వాత్మకుఁడవు సర్వప్రపంచాది సాక్షిభూతుఁడవు నీ వెఱుంగనియది నిఖిలంబు నందు నే వస్తువరసిన నెందైనఁగలదె? సరసీరుహాక్ష! నీ చరణాబ్జములకు వెఱచియుందుమొ? లేక వెఱవక విన్న వింతుమో? మాకెల్ల వినఁజోద్యమౌను వింతచర్యలు కన్నవిన్నది లేదు. నిర్జీవహస్తంబు నిజముగా నేఁడు తర్జనివ్రేల భూతలపత్త్రమందు వృత్తంబు వ్రాయుట వింతగా కేమి? చిత్తంబులోపలఁజింతించిచూడు మదిచూడఁదడకపో మగవాని బొంకు ముదితబొంకదిగోడ మోసంబు గలదె? వినుము, ప్రాణంబులు విరహితంబైన ననుదిన మభివృద్ధి యగునె దేహంబు? కనుపాప లణఁగినఁ గాంతి కన్నులకు ననువుగా నుండునే యనృతంబు గాక? వనితమాటల కేమి వచ్చెఁ బొమ్మనిన? విని, సులోచన రామవిభున కిట్లనియె నశనిధరస్తోత్ర! హరిమంత్రరూప! శిశుకాంక శశికోటిశృంగారరసిక! సశివకార్ముకహస్త! జనకజాలపన! .......... అఖిలాండకోటి బ్రహ్మాండ నాథుఁడవు నఖిలప్రపంచభూతాదులయందు భానుండు ఘటమునఁబ్రతిబింబరూప మైన చందంబున నంతరాత్ముఁడవు నిర్వికల్పుఁడ వీవ! నిత్యుఁడ వీవ! సర్వాత్మకుఁడ వీవ! సర్వంబు నీవ! యాదిమూలంబీవ! యభవుండ వీవ! వేదశాస్త్రము లీవ! విశ్వంబు నీవ! రవిచంద్రతారకారాత్రులు నీవ! దివి ధరాతల మీవ! దివసంబు నీవ! క్షరమును నీవ యక్షరమును నీవ క్షరము కక్షరముకు సాక్షివి నీవ ..........డ వీవ! ద్వీపంబు నీవ! దివిజసంఘము నీవ! తేజంబు నీవ! కమలోద్భవుఁడ వీవ! కాలుండ వీవ! అమరనాధుఁడ వీవ! యంబుధు లీవ! వసుమరుద్రుద్రదిగ్వరులను నీవ! అసురరాక్షసులీవ! యపమృత్యు వీవ! భూధరంబులు నీవ! భూతలంబునకు నాధారములు నీవ! యబ్జంబు లీవ! గరుడ పన్నగ యక్ష గంధర్వ సిద్ధ నర కిన్నరాసుర నరులును నీవ! యజ్ఞరక్షుఁడ వీవ! యజ్ఞంబు నీవ! ప్రజ్ఞలు నీవ! ప్రాభవములు నీవ! యశమును నీవ! యధ్యాత్మయు నీవ! దశలును నీవ! దుర్దశయును నీవ! సగుణనిర్గుణములు సత్వాదులైన త్రిగుణంబులును నీవ! త్రి.... వీవ! అలజన్మపోషసంహర్తవు నీవ! పలుమాఱు నా పరబ్రహ్మతేజమున ధర జనించినరామ! దైత్యవిరామ! పరమపావన రామభద్ర! నీ వఖిల కపటనాటకసూత్రకారివి గాని నృపమాత్రుఁడవు గావు నీ దివ్యనామ ములు తలంచిన బాపములు ముట్టవెఱచుఁ గలలోననైనను గారానియట్టి యనృతభాషణములు నధిప! నీ యెదుట ననృతంబు లాడిన నవి దాగునయ్య! ప్రాణరక్షణములఁబరిణయాదులను బ్రాణుల కనృతపాపములు బాధింప వని చెప్పుదురు ఆర్యు లవనీశ! వినుము, పనిఁబూని యెవరైనఁబాపంబు లనఁగ ననృతంబు లాడిన నాయుష్యహాని యనృతంబు లఖిలపాపౌఘమూలంబు లనృతంబుచేఁజెడు నఖిలసంపదలు ననృతంబు చేయుఁబ్రాణాపహారంబు ననృతంబు నరకకూపాంధకారంబు అనృతంబు లాడిన నగు మానహాని యరయంగ మృషకన్ననల్పంబు గలదె? ధర.......... కులశీలధర్మతాత్పర్య పరమపతివ్రతాపద్మాక్షు లరయ ధరణీశ! యనృతంబు తగ నాడఁగలరె? అవమానజారచోరాపవాదములు భువిఁ బతివ్రతలకుఁ బోరానికీడు రామ! నీ మది విచారము సేయు మనిన రామ కిట్లనియె శ్రీరామచంద్రుండు. అరవింద నేత్ర! నీ వనృతమాడుదువె? పరమాద్భుతంబైన పతిబాహుకృత్య మెఱిగించితివి సత్యమిది లోకములకుఁ దరుణిరో! తోచదు తథ్యంబుగాను ఆలింప నవని లోకాపవాదములు కాలత్రయంబునఁగారాదు మేఘ నాదుహస్తంబు మార్గణముచేఁ దెగిన మీఁదికి నెగసి యా మేదినిమీఁదఁ బడుట కెక్కడ నేమి పడవచ్చు నింకఁ? బుడమి వ్రాయుట మహాద్భుతముగావిన్న వారికెల్లను దోచవచ్చుఁదోచినను వీరిసందేహంబు వెలఁదిరో! పాప వలసితేనియుఁ బాయువరుని మస్తకముఁ గలకల నవ్వించఁగల దానవైన రజనీచరాంగనా రాజిమధ్యమున నిజముగా వ్రాసిన నీ నాథుశిరము నగరావళిచూడ నవ్వకుండినను మగువరో! నగుబాటుమాటలు గావె? యన విని యహిపుత్రి యనియె శ్రీరామ! అనుమాన మేల? నీ యద్రిసంచరులు ననిమిషాదులు చూచి యౌనౌ ననంగ జననాథ! నీ మహాసంవిధానమున నా నాథుశిరము నే నవ్వించుదాన భూనాథ! నా మాట బొంకు గాకుండ నవ్వు(నా)శ్చర్యమై నాకారి శిరము ఇవ్విధంబునఁబల్క నింతి కా శిరము నిమ్మని సెలవీయ నినతనూభవుఁడు తెమ్మన్న శరభుండు దిగ్గన లేచి వాసవవానోకహవరపుష్పనిచయ వాసనావాసితోజ్జ్వలమయంబగుచు సహితరక్తంబైన శక్రారిశిరము బహుళలంబితకేశపాశముల్ పట్టి యట్టహాసము చేసి యార్చుచుఁద్రిప్పి పట్టుపట్టు మంటంచుఁ బడఁతిముందఱను బాఱవైచిన ధూళిపైఁగ్రమ్ముకొనఁగ ధారుణిపైఁబడ్డ ధవుశిరంబెత్తి తడయక పైటతోఁ దనచేతఁదుడిచి తొడ నుంచి లోచన తోయబిందువులు పతిమస్తకముమీఁదఁ బడఁగ నవ్వేళ నతిఖేదయుక్తయై యబల యిట్లనియె రాక్షసకులతోయరాశిసంభూత నక్షత్రపతిసమానంబైన మోము త్రిజగంబులందును దీప్తతేజమున విజయంబుగా శత్రువితతి శక్రాది సురలకుఁగన్నెత్తి చూచెద మనినఁ బరమదుర్లభవృత్తి బహువికాసించు జోదులై యా యూర జోగులందఱును ఆదిశేషునికంఠ మంటుచందమునఁ దలబట్ట నోపిరే తరుచరాధిపులు? తొలఁగె రాక్షసలక్ష్మి తోయజాసనుని విపరీతకృతమైన విధము కేమందు? నపకీర్తి పాలు నన్నందఱిలోన రమణఁజేయక నీవు రాముసన్నిధిని సమదవానర ఋక్షసభికులందఱును గనుఁగొన హాసంబు గ్రక్కునఁజేసి ఘనఘోష నా మాట ఘనముగాఁజేయు ఘనమైన వారింట ఘనముగాఁబుట్టి వనజాసనుని వంశవర్ధనుండైన రావణబ్రహ్మ గారాబుకోడలయి దేవేశవైరి! నీ దేవినై వెలసి లోకంబులో సర్వలోకు లెన్నంగ జేకొన్న సుగుణముల్ చెడకుండ బ్రదికి యశముఁబొందిననాకు నంత్యకాలమున దశరథాత్మజు రామధరణీశు సభను ననృత....మంటు టది ధర్మ మగునె? అనృతంబులాడిన యతివ లెందైనఁ బరమపతివ్రతా పద్మాక్షులందు నరయ నెన్నిక గాంతు రా వల్లభునకు సతి యర్ధదేహంబు సతియపఖ్యాతి పతిది గాదే? యిహపరలోకములకు నిను వేఁడుకొనియెద నీకు మ్రొక్కెదను ననుఁజిన్నపుచ్చక నవ్వవే నాథ! నాకధీశుఁడ వీవె! నా దిక్కు నీవె! ప్రాకటంబుగఁబ్రియప్రాణంబు నీవె! నా మానవధన మీవె! నా దాతవీవె! నా మాట చెల్లించు నాథ! నీ విపుడు తడయ నేమిటికి నీ దాసిపై నేఁడు కడుకోపమో లేక కారాని యలుకొ? మున్ను....మోహంబు దోప నన్ను నవ్వింతువు..........రేచి యా మోహ మెటుదాగె? నా రీతినున్న ప్రేమాతిశయము లే పెంటపాలాయెఁ? బరిహాసకుల పరిభాషావిశేష నిరతప్రియుండవు నే నవ్వుమన్న నవ్వు రా దిదియేమి? నన్నుపేక్షించి యివ్వగ నగుఁబాటు నిటువంటి సేతఁ చేయఁగా మదినిఁదోచినదికాఁబోలు పాయ కెప్పుడ మందపరిహాస మెసగఁ బున్నమచంద్రునిఁ బోలు నీ మోము ఖిన్నమైయున్న సంకేత మేమిపుడు? జగదేకవీరుఁ డా సౌమిత్రిచేత నగణితవివిధ బాణౌఘమర్మాంగ నిర్భేద వేదనానిధిలోన మునుఁగ గర్భపాత చ్ఛేదకంబులై చాలఁ బరితాపమొందెదో పరమఖేదమున? సురలు శత్రులు నిన్నుఁజూచి మోదింపఁ గాక మీ తండ్రి లంకాపురాధిపుడు లోకువపడుట కాలోచనస్థుఁడవొ? బల్లిదుఁడను నేను బగవారిచేతఁ బ్రల్లదంబై పరాభవమైతి ననుచుఁ దల్లడపడియెదో? తడయ నింకేల? కల్లచేసితి వౌను ఘనుఁడ నా మాట చెల్లఁబో బాహువుచేయు కృత్యంబు నొల్లఁబురాధర యొరులకుఁజెప్ప నీ రీతి నిందలందేల లోనైతి? బ్రారబ్ధకర్మంబు పట్టించెఁగాక! హా నాథ! యనుచితంబాయె నే మందు? భూనాథుఁడిక నన్నుబొంకెఁబొమ్మనఁడె? నలువురిలో రట్టు ననుఁజేయఁదగునె? చెలియకు సిగ్గుల చేటెల్ల నీకు రమణ తప్పునె మహారాజసన్నిధిని? అమరాదు లెకసక్కె మాడరే చూచి? నగుఁబాటు చేసితి నాకంత్యమందుఁ గలిగి యపఖ్యాతి దలమోయవలసె నీ పాటు గలుగ నే నేమి నోచితినొ? నా పాపఫలములు నాకు సిద్ధించె వగచిన నే మౌను వచ్చుకర్మములు తగలకుండునె రుద్రధాతలకైన? మోమిట్టివంకలై మురియగా నద్ద మేమిసేయును గర్మ మీ రీతినుండ? సారెకుఁగంఠశోషంబులు గాఁక నీరదనిర్ఘోష! నిను దూరనేల? యనుచు నీ విధమున నతిదీనవృత్తిఁ జననాథునకుఁదోప దాను నేడ్చుచును అలసి వేసరితి నా కానతిమ్మనుచు నలినాక్షి వల్లభాననము వీక్షించి మరియు నిట్లనియె మా మామ రావణుఁడు పరుషవాక్యములాడి పగవారిమీఁద నినుఁబంప నీ వెత్తి నిజముగాఁబోవు మునుగల్గ నాథ! నా ముంద టా మాట తెలిపిన వేవేగఁ దెత్తునో పోయి బలశాలి మా తండ్రి ఫణిలోకవిభుని నతఁడు పాతాళసైన్యావృతుండగుచు నతివేగముగ వచ్చు నా సహాయముగ మృతుఁడ వౌదువె నీవు? మీఱి శాత్రవులు జితము నీ కీయఁడే జిహ్మగాధిపుఁడు? వాసుకి తక్షక వలయుఁడై శేషుఁ డీసున రాఁ బుట్టునే యింత చేటు? అది దప్పెనన విని యా యింద్రజయుని వదనంబు పకపక వడి నవ్వఁజొచ్చె. నవ్విన సభనున్న నగచరోత్తములు నవ్విభు లిరువు రత్యాశ్చర్యపడిరి. సురవరు లిదియేమి చోద్యమోయనుచు బరమశంకాభయభ్రాంతులై కూడి తామెల్లఁ దమ మొనఁదగ నరిష్టంబు లేమి పుట్టుటకు నీ హేతుభూతంబొ? అని విచారించిరి అంత టా రామ జననాథుఁడా సభాసదుల కిట్లనియె. ఘనులార! మీరెఱుంగకయున్నవారు వినుఁడు, ఈ సందేహవృత్తి పాపెదను ఈ చిక్కు మాకెల్ల నెఱుగంగఁజేసి దాపనేటికి దనతండ్రైన శేషుఁ డా లక్ష్మణుఁడె కాక యన్యుఁడే?తన్ను నాలంబులోపల నాతఁడే చంపె. ననుచుఁబక్కున నవ్వె నమరారి శిరము మనమున వెఱగంది మగువ మాటలకు నన విని సభికులౌ ననుచు రాఘవుని వినుతించి రప్పు డా విధము లక్ష్మణుఁడు అనువుగా విని పల్కె నంతరంగమున ఘనఖేదయుక్తుఁడై కంట నీరూర నవనీశ! నా పుత్రియైన యీ నాతి ధవునిఁజంపితిఁబ్రమాదంబున నేను జామాతఁజంపిన జడుఁడు లోకమున భూమీశ! కలఁడె? నా బుద్ధి కేమందుఁ? దన హితంబునకుఁగాఁ దనవారి యహిత మున కొడిగట్టిన మూఢుండు గలఁడె? మును పెఱుంగకపోతి మోసంబు వచ్చె జనదూషకుఁడనైతి జగతిపైఁజాలఁ బగగొని సుహృదులప్రాణంబు గలఁచఁ దగిన పాపాత్ముఁ డీ ధర నున్నవాఁడె? నింద మోయుటకంటె నిఖిలశస్త్రాస్త్ర మందు పతనమైన యా చావు మేలు జననాథ! తరియింపఁజాల నే నింక ననినఁదమ్మునిఁజూచి రఘుకులేశుండు విను, సుమిత్రాత్మజ! విహితమే నీకు మనమున ఖేదింప మఱియు మూర్ఖుఁడవె? శ్రుతిచోదితంబులై సృష్టిపై వెలుఁగు నతిరాజధర్మంబు లవి విచారించు నీకుఁజెప్పెద రాజనీతులు వినుము లోకువపడువాని, లోఁగినవాని, శరణు వేఁడినవాని,.......... ..........వాని,యదరినవాని, శూన్యవాహినివాని, సుడిఁబడ్డవాని, దైన్యంబుఁబడువాని, దశదప్పువాని, మఱుఁగు సొచ్చినవాని, మఱి పలాయితుని దురములోపల మూర్ఛితుండైన వాని, విరథుఁడౌవానిపై విక్రమించుటయు నరయ నా క్షత్రకర్మాచారములకు ననుచితంబులు ధర్మహాని రాజులకు జనకుఁడైనను మఱి జామాతయైనఁ దనయుఁడైనను సహోదరుఁడుఁ బోషకుఁడు ననువుగా బ్రాహ్మణుఁడతివృద్ధుఁడైన, హితుఁడైన, నలపురోహితుఁడైన, ముఖ్య పతియైనఁబ్రియుఁడైన, బాంధవుఁడైనఁ బరగదేవుండైనఁ, బరమాత్ముఁడైన, నరయంగ నాచార్యుఁడైన, యుద్ధమునఁ దనరార శస్త్రాస్త్రధారుఁడై యెదుట మునుకొని సంగరోన్ముఖుఁడయి నిల్చు వాఁడు పాత్రుఁడు ఆహవంబున నతని నోడక చంపుట యుచితకర్మంబు. దశరథాత్మజ! రాజధర్మ మీలాగు విశదంబుగా నుండు విడువు శోకంబు నని యివ్విధంబున నన్న దెల్పుటయు విని సావధానుఁడై వెలసె సౌమిత్రి. యంతట రఘురాముఁడబలపైఁజాల సంతోషమున దయాసమదృష్టి నిలిపి సకలవానర సభాసదు లాలకింప వికసితవదనారవిందుఁడై పలికె. నో ధర్మచారిణి! యో పుణ్యసాధ్వి! సాధు వౌదువు దేవి! సకలలోకముల బహుధన్యురాలవు భామరో! నీవు మహినిఁబతివ్రతామణివి నీ సాటి సతు లెందుఁగలరమ్మ! సర్పవంశంబు నతులితంబైనట్టి యసురవంశంబు నుద్ధరింపగఁబూని యుద్భవించితివి. సిద్ధంబు మెచ్చితిఁ జెలియ! నీ వింకఁ దడయక నీ కిష్టతరమైన వరము నడుగుము నే నిత్తు ననిన లక్ష్మణుఁడు కను గీటె చేసన్న కపిరాజు చేసె. హనుమంతుఁడులికి హా!హా! యనఁజొచ్చె సైగఁగా నా విభీషణుఁడంతఁదెల్పె. వాగీశుఁడట సరస్వతిఁజూచి యపుడు నిద్ర గోరగఁజేసి నిఖిలదేవతలు భద్రప్రదంబుగా భయనివారణము చేసిరి యిపు డింద్రజిత్సతియైన యా సులోచన జిహ్వయందుండి నీవు ధవు లేపు మనుచు నీ తన్వంగి నోట భువనప్రమాద సంభూతమైనట్టి వచనంబు రాకుండ వంచింపవలయు రుచిరాంగి పొమ్మన్న రూపలావణ్య వతి సరస్వతి చతుర్వదనున కనియె. శతపత్రసంభూత! సకలలోకేశ! ఘనమునిస్తుత! మేఘకలితనాదుండు మనుజాశనుఁడు మదోన్మత్తాత్ముఁడసుర యోనిసంజాతుఁ డా యువతి సుశీల మానితాఖిలలోకమాన్య, సౌజన్య, సతతసద్గుణగణ్య, సదమలపుణ్య వతి పతివ్రత గాదె? వసుధపై నాగ లోకసత్కులజాత లోకాహితంబు గా కోరునే భయంకరమైన వరము జననాథుఁడగు రాముసన్నిధానమునఁ దన హితంబునకుఁగాఁదగ దేలయనక నాకుఁదోచదు ఇట్లు నాథ! నీ యాజ్ఞ చేకొని యిపు డేను జేసెద ననుచు బొసఁగంగ చెఱకునఁబుట్టెనో పండు పసిఁడికి వచ్చెనో పరిమళంబనఁగ శారద యా సులోచననాల్కనుండెఁ. బ్రారంభమున మంచిపల్కు లాడింప నంత నా ఫణిపుత్రి యత్యద్భుతముగ నంతకంతకుఁబుట్టు నా మహోత్పాత మైన హేతువులెల్ల నాత్మలోఁదెలిసి యా నాథుశిరమంత నవనిపై నునిచి వనరుహానన లేచి వసుధేశు రాముఁ గనుఁగొని పాణియుగ్మము ముకుళించి ప్రవిమలచిత్తయై పలికె నా వేళ సవినయంబుగ సభాసదులెల్ల వినఁగ. జయ నిత్యకల్యాణ! జయ జగత్ప్రాణ! జయ భానుకులభూరిజలరాశిసోమ! కరిరాజవరద! యో కరుణాసముద్ర! మఱి యితరాపేక్ష మానసంబునను గలుగదు నీ పాదకమలంబులాన తలఁప నా కిహలోకధావంత మేల(?) యలసి వేసారితి నౌ నింకఁజాలు నలినాప్తకులనాథ! నా కిత్తుననిన వరములే నడిగెద వరునిమస్తకము తిరముగా దయచేసి తీవ్రంబుగాను పతితోడ నుత్తరపరలోకగతులు సతముగా నా కిచ్చి సంసారఘోర కూపంబులోఁబడకుండ రక్షించు పాపదుష్కర్మాది పాశజాలముల ఖండించి మోహాంధకారంబు లెల్లఁ జండించి నీ పదాబ్జాగ్రంబునకును జేరనీయవె నేను జేసినమనవి మీఱక కృపఁజూడు మిగులంగ నాకు దూరస్థులే మీరు? దుహితను గానె? యారయ పుట్టినిల్లౌట నాకిపుడు వినఁగఁదేటాయెను విహితకృత్యములు జనకులు బిడ్డకు సాంగంబు సేయ సహజంబు గావున సర్వేశ! నేఁడు మహితవానరులను.......... పొంగుచు బలశౌర్యపురుషార్థములను సంగరంబునకుఁగా సాగి పోకుండ మన్నించు వత్తురు మా యత్తగారు కన్నులారంగ సాగమనంబు చూడఁ గన్నతండ్రులు గాన కడువేడ్క మిమ్ము నన్నదమ్ముల.......... నరయ నా పినమామ యగు విభీషణునిఁ గరమర్థి బ్రార్థింతుఁగరుణతో వచ్చి మముఁగృతార్థులఁజేయుమది మీకుఁగలదె? విమలాత్మ! యే పుణ్యవిధము నేనెఱుఁగ? నీ పాదములమీఁద నే దృష్టి నిలిపి యాపాదమస్తకాద్యవయవంబు.......... శుభచిహ్నముద్రికాస్ఫురణంబులగుచు శుభకామ శుభనామ సూనాస్త్రకోటి తతసురుచిరరూప! తపనప్రతాప! హతభవసంఘాత! యఖిలైకదాత! ఆనందమయమంగళాకారమైన శ్రీనాథ! నీ మహాశృంగారమూర్తి కనురెప్ప వేయక కన్నులఁజూచి ఘనపాపహరము మంగళము నీ స్మరణ సరగఁజేయుచుఁబతిసహవాసమునను అరుదైన దహనతల్పారూఢ నగుచు స్ఫూర్తిగా దేవతల్ పొగడుచు నుండ భర్తతోఁ బవళించి ప్రాణముల్ విడిచి కృతకృత్య నౌదును క్షితితలాధీశ! గతదోష నీ యనుగ్రహము పెంపునను భవబంధనంబులు పాపవే తండ్రి! .......... శరణు లోకారాధ్య! సద్గుణసీమ! శరణు పరంధామ! సతతాభిరామ! శరణు పరబ్రహ్మ! సంపూర్ణకామ! శరణు సీతారామ! శరణు శ్రీరామ! యనుచు నీ విధమున నహిరాజపుత్రి మనవి సేయఁగ విని మదిలోన రాముఁ డచ్చెలి మాటల కానందమంది మెచ్చి మస్తకమూచి మేలు మేలనియెఁ గాచెఁబో భంగంబు గాకుండఁబనులు చూచితే యీ నాతి సుచరిత్ర మంత సాధుసాధువటంచు సౌమిత్రి సకల యోధవానరు లెల్ల యుబ్బి రాహూగ్ర ముఖముక్తులైన సోములవిధంబునను ముఖములు విలసిల్లి ముదితాత్ములగుచుఁ బొగడి రా యువతిని భూరివాక్యముల జగములు నిండ రాక్షసులు భీతిల్ల నిర్జరుల్ హర్షింప నించి రా వేళ గర్జించి జయజయాకారశబ్దములు స్రష్ట నిర్మాణైక సర్వప్రపంచ సృష్టిపైఁ దన కీర్తి స్థిరముగా నిలిపె. నని కొనియాడుచు నంతరంగముల ఘనతరసంతోషకలితులై రంత దివి తేటఁబడె నష్టదిశలు శోభించె. భువి సుస్థిరంబయ్యె భువనత్రయంబు నుత్సాహమునఁబొందె నూర్జితంబగుచు సత్సంగములఁజెల్లె సకలరాజ్యములు నంత నా రఘురాముఁ డబల నీక్షించి వింత నీ చర్యలు వేయి వక్త్రములు కలిగిన మీ తండ్రి కాద్రవేయుండు కలఁడె వర్ణన సేయఁగమలాక్షి! నీవు నవిరళంబుగ భుజంగాధిపునింట నవని సుస్త్రీరత్నమై పుట్టినావు భామ! నీ పుణ్యప్రభావోదయంబు నేమింప శక్యమే? నిజముగా నుభయ వంశపావన మాత్మవల్లభాదరణ సంశయరహితమై సమకూరె నీదు వరుశిరంబిచ్చెద వనిత! సిద్ధముగఁ బరమపతివ్రతాభామల కెల్ల సత మగు సౌభాగ్య సాధనోత్తుంగ గతిమార్గమైన సాగమనద్వయంబు సాంగంబుగాఁజేసి సత్కార్యసిద్ధి మాంగల్యవై మహామహిమ దీపింపఁ బతితోడ నుత్తమ పరలోకగతుల కతివ! నీ వధికారి వౌదువుగాక! నీ పతితలఁగొంచు నీ వాడ కరుగఁ జూపుల కింపైన సుదతి! నీ కృతము వరసహోదరకపివ్రజసమేతముగ నరుదెంచి చూతు మేమందఱుఁగూడి .......... అని యానతిచ్చిన నతివ సమ్మోద మున బ్రదక్షిణములు ముమ్మాఱు రామ జనపాలునికిఁజేసి సాష్టాంగమైన దండప్రణామముల్ దగ నాచరించి మండలాఖిలదిశామండనుండనుప నతని సౌమిత్రిని నసురేశకపుల నతివేగ వీడ్కొని యసురకామినులు తనుఁజుట్టి కొల్వఁగా దన యొద్దనున్న మనుజాశనుని బాహుమస్తకంబులును వెంటఁబట్టించుక వేవేగ వాలు గంటి యాస్థానంబు గ్రక్కున వెడలె. నంతట రఘురాముఁడర్కనందనునిఁ జెంతనుండగఁజూచి చెలువారఁబలికె ననఘ! సుగ్రీవ! యీ యబలకార్యంబు అనుకూలముగఁజేయనగు మాకుఁగాన నెరవేరునందాఁక నిఖిలవానరులు పరువులెత్తుచు మహాభండనార్థంబు లంకదిక్కునకు నల్లనఁబోవకుండఁ బంకజహితపుత్ర! పనిబూని సేయ వలెనన్న రామాజ్ఞ వహియించి యపుడు బలశాలి కపిచమూపతి నీలునికిని సెలవీయఁజాటింప శీఘ్రతఁబనిచె. బలములోపల మహాబలు లెఱుంగఁగను అంత శేషునికన్యయట తేజినెక్కి యింతులు తనవెంట నెదిగి రా ఘోర రాక్షసాధిప చతురంగసైన్యములు నక్షోహిణులు మూఁడు నావృతంబుగను వివిధ వాద్యధ్వనుల్ వేధోండగర్భ మవిసి మ్రోయంగను నమ్మహాసమర భూమి భయంకరాద్భుతశస్త్రసమితి నా మహాచలపాదపాస్త్రఘాతముల నందంద పడి పొర్లునవయవాంగములు చిందఱవందఱై చెదిరిన కురులుఁ దెరలినపక్షముల్ తెగినబాహువులు నురుమైన చేతులు నుగ్గైన తొడలుఁ బగిలిన ఫాలముల్ పడినశీర్షములుఁ దెగినకొటారముల్ త్రెళ్లినచెవులు భంగంబులైనట్టి బహుళమధ్యములుఁ ద్రుంగినదంతముల్ తునిగిన మెడలు గండతుండములై ఘనపాదములును మెండుగాఁదొరగిన మృదుకపోలములు విఱిగిన మోకాళ్లు విఱిగినవ్రేళ్లు నఱికినముక్కులు నలియైన పెదవు లవిసిన వీపులు నస్థిసంఘములు రవలైన పిఱుఁదులు రాలినగ్రుడ్లుఁ బిండైనవృషణముల్ పెక్కు కాయముల ఖండంబు లవనిపైఁగలయు.......... చీలినపొట్టలుఁ జెడిననాలుకలుఁ గూలినజంఘలుఁ గుండలద్యుతుల నగుచున్న నానావిధముల మోములు వగరుచుప్రాణముల్ వదలంగలేక కొట్టులాడెడువారు గురక లంతంత పెట్టువా రాప్తులఁ బిలిచెడివారు .......... ..........మొఱపెట్టి తిట్టెడివారు నాడిన నిశితాస్త్ర నానాయుధములఁ బాడిగాఁబట్టిన పనసపండ్లనఁగ భూరజంబునఁబడి పొరలాడువారు భూరుహపర్వతంబులక్రింద నుఱికి తన్నులాడెడివారుఁదలలెల్ల మిడికి మిన్నంద నెగయుచు మేదినిమీఁదఁ బడుచుండు మఱికళేబరవితానములు నెడనెడఁబాతర లింపుగా నాడ రవరవ లన నేలరాశిగాఁబడిన నవిరళమౌక్తి కాయత హరినీల వరపుష్యరాగ ప్రవాళ వైడూర్య గురుతర మాణిక్య గోమేధికాది ఘనదివ్యరత్నసంఘంబు లంతంతఁ గనుఁగొంచు నా రణాంగణభూమిఁజొచ్చి మహితసంగరధరా మధ్యదేశమున విహరించుచును మహావీరలక్ష్మ్యనఁగ వీథులఁజని యాత్మవిభుఁజేరఁబోయి సాధుతరాశ్వంబు సరగున డిగ్గి యంగనామణి చూడ నతిఘోరకదన రంగమధ్యంబున రాజితంబగుచు సంగరార్ణవమహాసారనిర్మథిత శృంగాంగవిచ్ఛేదశేఖరంబైన మందరనగ మన మస్తకంబూది యందంబుగా నభమందియున్నట్టి మొండెంబునకుఁజుట్టుముట్టిముమ్మాఱు దండంబుఁబెట్టి మస్తకమదోద్దండ బాహుదండంబులు పతియొద్ద నునిచి రాహువుచెంతఁ దద్రమణిచందమున నింతి సులోచన యింద్రారిచెంత నింతులు వేష్టింప నెసగఁగూర్చుండె. నంత దశాననుం డాత్మజుశిరము నింతి తెచ్చినవృత్తమెల్ల వార్తికులు తనకుఁజెప్పిన విని తనర నోష్ఠములు నెనయ నిర్వదిచేతులెలమిఁద్రిప్పుచును బదితలలూఁగ దర్పమున నుప్పొంగి మదమహోద్దండుఁడై మంత్రుల కనియె. నీ భామకిప్పుడు నింద్రారిశిరము నా భయంబున నిచ్చి నరనాథసుతులు సాగ నంపించిరి సహజ మే నింక! వేగిరంబచటికి వేంచేయవలయు. ననుచు దిగ్గన లేచి యద్భుతోత్తుంగ ఘనకేతుశోభిత ఘంటికావలయ విలసితషోడశ విస్తీర్ణచక్ర కలశోజ్జ్వల ప్రభా గగననిర్భేద రోమహర్షణఘోర రూపంబు లైన పాములచే మహాభయదమై యుండ భర్మరసోజ్వల ప్రభలొప్ప విశ్వ కర్మనిర్మిత రత్నగణదీప్తులొప్ప నురుతరాశ్వంబులు నొక వేయి పూని వరసారథులు చతుర్వర్గంబు దోల నమరుచు నున్న శతాంగంబుమీఁదఁ బ్రమద మందోదరి ప్రాముఖ్యులైన సర్వకుటుంబినీ సహితుఁడై యెక్కి పార్వతీసహితుఁడౌ పరమేశుఁడనఁగఁ దారకావృత హిమధాము చందమున ఘోరరాక్షసకోట్లు కొలిచి రా మఱియుఁ బ్రతివాహినీభయోద్భటమహోద్ధూత చతురంగవాహినీసమితుఁడై వెడలి పౌరులందఱుఁజూడఁబరువెత్తి రాఁగ భూరివాద్యధ్వనుల్ భూనభంబునను భరితమై బ్రహ్మాండభాండంబు చెదర ధరణి గంపింప దిగ్దంతులు మ్రొగ్గ నొనర లంకాదుర్గ ముత్తరద్వార మున బయల్వెళ్లి యా ముమ్మరంబైన సమరభూభాగంబు సావకాశముగఁ గమలాక్షి మయపుత్రి కనుగంటఁజూడ రామబాణానల రాసులు నద్రు లీ మహి నెడనెడ నెదుగుచందంబు చెలియ! నే నేమని చెప్పుదు రాముఁ దలఁప నాశ్చర్య మాతని మహామహిమ అతివరో!.... పున నా రాజు దోచు ధృతచాపశరతూణదృఢధైర్యుఁడగుచు వామభాగంబున వసుధేశుఁడైన రామచంద్రునిమూర్తి రంజిల్లుచుండు భామదక్షిణమున పామరుండగుచు నా మహాత్ముఁడు దోచు నంతకాకృతిని సన్మతితోఁజూడ సమ్ముఖంబునను జిన్మయాకారుండు శ్రీరాముఁడుండు భూనభోంతరములు పూర్ణంబుగాను మానినీమణి! రామమయముగాఁదోచు సర్వాత్మ రాముఁడు సర్వమై తాను సర్వదిక్కుల నుండి సర్వరాక్షసుల బహుభయంకరమైన భూపాలనేత్ర దహనంబు లోకనిర్దహనంబు చేయు కరణి రాక్షసకులఘనకాననంబు హరియించె నే మందు హరిమధ్య!చూడు మయపుత్రి! యిక్కడ మనయింద్రజయుఁడు భయదోగ్రమైనట్టి ఫణిపాశములను రణవీథిఁగపిఋక్షరాజయుగ్మముల వనజాక్షి! లోకముల్ వడఁక బంధించె. సామాన్యుఁడగుచు నీ సమరరంగమునఁ గోమలి కూలె నీ కొడుకు.......... ననుచు మందోదరి కన్ని దెల్పుచును జని మేఘనాదుని శవకళేబరము ఉన్నచోటికిఁబోయి యుండె సైన్యములు తన్ను వేష్టింపంగ దక్షిణదిశను అంత నా రఘురాముఁడంతరంగమున నింతి కిచ్చిన వాక్యమీడేర్పవలయు ..........న్ముఁగూడి వనచరాధిపుఁడాది వనచరోత్తములు నా విభీషణముఖ్యులందఱుఁగొల్వఁ బావనిభుజములపైని వేంచేసి మఱియు మేరువు శింశుమారంబు పోలె విరమణవాహనవిష్ణుచందమున వరుసతో సౌమిత్రి వాలినందనుని పరమోన్నతస్కంధపరివాహుఁడగుచుఁ దన వెంటరా వేగఁ దర్లి యుద్ధోర్వి వనధి కేఁగెడు మహావాహిను లనఁగ నగచరసేన నానా ముఖంబులను నెగయుచుఁబరచుచు నెలమి బ్రహ్మాండ మవియంగ నార్చుచు నట్టహాసముల భువి తల్లడిల్ల నంబుధు లుప్పతిల్ల నగశృంగములు డుల్ల నరులు మూర్ఛిల్ల గగనంబు గాసిల్ల ఖగులు భీతిల్ల నక్షత్రములు డుల్ల నడచి యంతంత దక్షిణదిగ్భాగ ధరణీతలంబు నాక్రమించుచుఁద్రికూటాద్రిపైఁజేరి శక్రారి పడియున్న సంగ్రామభూమి కెడ....రివార మెనసి వేష్టింపఁ బొడవున నిల్చి యుప్పొంగుతేజమున నురగారి వీక్షించు నురగంబు భంగి హరిదృష్టిఁబారిన హస్తిచందమునఁ దముఁజూచి రాక్షసు దర్పమంతయును గమనంబు చేయఁగాఁగమనీయమైన నవనేత్రదృగ్జాల నలినాప్తరశ్మి కవిసె రావణహృదయాంధకారంబు. చూచుచు విలసిల్లు సురరాజుచెంత వాచస్పతి యనంగ వలపటనున్న యా విభీషణుఁజూచి యవనీశుఁడనియె. రావణుసైన్యంబు రణభూమిలోన నీ వరకింకిన దిది నాక నూట బావి చందంబునఁ బ్రభవింపుచుండు బడబాగ్ని దగ్ధ శంబరరాశివోలెఁ గడమ గానక నీలకంఠునకైన గణుతింప శక్యమే ఘనుఁడు రావణుఁడు ప్రణుతింప ధన్యుఁడౌ భాగ్యభోగముల ముందు నాతనిఁజూపి ముఖ్యరాక్షసుల నిందులో నెరెవ రెఱిఁగింపు నాకు? ననిన విభీషణుఁడనియెఁ శ్రీరామ! వినుము, చెప్పెద నీకు వివరించి నేను భూవర! త్రైలోక్యభూతిసంగ్రహణ రావణుండదె చూడు రామ! నీ యెదుట హిమశైలసన్నిభహేమనిర్మాణ కమనీయమణిగణ కాంతివిస్ఫురణ నభము నందిన మహా నాగధ్వజంబు నుభయభాగంబుల నొగి బహుచ్ఛత్ర చామరవిలసిత స్యందనారూఢుఁ డై మహాప్రళయకాలాగ్నిచందమున బహువిధాయుధ దీప్తిపటలంబు చేత సహజతేజంబునఁ జాలంగ మెఱసి ఘోరరాక్షసకోటిగోత్రమధ్యమున మేరునగంబన మే నొప్పుచుండఁ బదిమస్తకంబులఁబదికిరీటముల విదితంబులగు బద్ధవివిధరత్నముల తేజ మర్కాంశులదీటు భంగింప నాజానుబాహువు లతిఘోరమైన ....కృతులుగా వింశతి యొప్ప ఋషిపత్నియైన యరుంధతివోలె మహిఁబతివ్రత చారుమతిశీల మయుని దుహిత మందోదరి తొడలపై మోప నవయ వసుంధరాత్యంతవిచిత్ర వివిధభూషణదీప్తి విలసిల్లుచుండ లక్ష భార్యాసముల్లాసుఁడై మించి నక్షత్రపరివృత నలినారివోలె నతఁడే దశాననుండవనీశతిలక! క్షితినాథ! యీ దశశిరుని దాపునను సమరనానాకళాసారశోధకులు రమణీయతర రౌప్యరథముపైఁదోచు నతఁడు మహోదరుండమరారిమంత్రి శతమన్యుదంతికి సమగతి నెక్కి నతఁడు వృశ్చికరోముఁడతిభయంకరుఁడు అతిఘోరసింహవాహనుఁడైనవాఁడు సాహసోదగ్రుండు సర్పరోముండు బాహుబలోదార బహుకాలజీవి నిర్మలమతి మహానీతికోవిదుఁడు భర్మరసప్రభా భాసితంబైన యా తేరిపైవాఁడు నసురాధిపతికి మాతామహుండైన మాల్యవంతుండు నెనయంగఁబంచలోహితరథస్థుండు ననలకల్పుండైన యగ్నివర్ణుండు భీమంబుగా గండభేరుండ మెక్కి కామితమాయావి ఖలుఁడు మారీచు నిజపుత్త్రుఁ డా కాలనేమి యన్వాఁడు త్రిజగద్భరణ రామ! తేటగాఁజూడు మసురేశవార్తికు లతిబలక్రూరు లసమానసాహసులగు కామచరులు సారమేయము నెక్కు సారణుండుగ్ర వారాహమందున్నవాఁడు శుకుండు శరభంబుపైవాఁడు జంభుండు ఘోర తరమహాభల్లూకధ్వజుఁడుగ్రకేశి మర్కటారూఢుండు మాణిభద్రుండు కర్కటవాహుండు కాలచిత్తుండు ఘోటకారూఢుండు ఘోణినేత్రుండు హాటకధ్వజుఁడంతకాంతకాఖ్యుండు శిఖివాహనుఁడు కాలజిహ్వభిధాన ముఖవాహనులు కాలముఖ-వారణులు పంక్తికంఠునిఁమూలబలమేడుకోట్లు పంక్తికంఠునికంటెఁబటుబలాధికులు గతమైన దదిగాక కయ్యంబుక ..........సైన్యంబుల నింతంత యనుచు మితిచేసి తెలియంగ.......... హితముగ వినిపింప నినకులాధీశ! నాకుఁగాదటుధాతృనాగభూషణులు చేకొని యా సంఖ్య చెప్పనోపుదురె? విలయ కాలంబున విశ్వలోకముల విలయించుఫాలాక్షువిధమున నిపుడు భువి నాదివిష్ణు సంపూర్ణాంశమునను అవతారశీలుండవైన నీ చేత భువనభీకరులైన భూరిరాక్షసులు హవనమయ్యెను గాక హరవిధాతలకు నిర్జింప శక్యమే నిజదృష్టిఁజూడ నిర్జరాధిపవంద్య! నిఖిలలోకేశ! అన విని తనకుఁదా నాశ్చర్యమంది మనుజేశుఁడంతట మాఱాడకుండె నంత నా దేవత లంతరిక్షమున సంతోషమున సులోచనసాగమంబు వీక్షింపఁదమ తమ వివిధవాహనము లా క్షణంబున నెక్కి యతివలుఁదారు నిబిడంబుగా దివి నిండి రవ్వేళ ప్రబలబలాయతప్రమథవర్గంబు కొలువ విషంబుచేఁగుత్తుక మెఱయ మొలకనవ్వులు మోము ముంచి పైకొనఁగ శరదిందునిభతనుచ్ఛాయ శోభిల్ల నురగభూషణములు నొప్పార ఖండ శశికళాకలిత మస్తకము చెన్నొంద విశదోక్షవాహన విలసితుండగుచుఁ జారుచంద్రానన సౌందర్యసార గౌరీసమేతుఁడై గంగాధరుండు అరుదెంచి నిల్చె నయ్యంబరవీథిఁ. బరమ మహామౌని పరివారుఁడగుచు వివిధ శాస్త్రపురాణ వేదవేదాంగ నివహంబు వెనువెంట నియతి శోభిల్ల మణికమండలు దండమండితుండగుచు బ్రణుతికెక్కిన హంసపరివారుఁడగుచు వాణితోఁగూడుక వనజగర్భుండు భూనభశ్చారు లద్భుతమంద వచ్చెఁ. దనరారఁగా దివ్యతరవిమానములు పనిఁబూని యెక్కి ముప్పదిమూఁడుకోటు లనిమిషావళి రాఁగ నైరావతంబు ననువందఁగా నెక్కి యతివ పౌలోమి రహిఁగూడ వచ్చె పురందరుండెలమి బహుభయంకరకాలపాశదండములు ధరియించి మాహిషధ్వజవాహుఁడగుచు నిరువంక దూతలు నేఁగిరా మఱియుఁ తల లుగ్రతేజంబు తరళజిహ్వయును వెలయుసర్పాకృతి వికటబాహువులు శుభ్రోరు.......... శోణనేత్రములు బభ్రుకేశంబులు భయదాననంబు సరి మేష వృశ్చిక సర్పరోమములు బెరయ నురస్థ్సలిఁబెనుమంట లెసగ నత్యుగ్రపాశంబు లరుదారఁబట్టి మృత్యువు తోడరా మెఱసి యంతకుఁడు నరుదెంచె లేడిపై ననిలుండు వచ్చెఁ. జరణత్రయంబు మస్తత్రితయంబు నురుణజటాలోహితాక్షయుగ్మంబు నురుతరజిహ్వ లేడొప్పార ఘోర తర మహాధూమకేతనము రంజిల్ల మఱి గౌరవర్ణతోమరహస్తుఁడగుచు స్వాహామహాదేవి సకియ మేధయును దేహప్రభామహాదీప్తులై వెలుఁగఁ దన పార్శ్వముల నొప్పదహనుఁ డా వేళ ఘనతరసంతోషకలితుఁడై మేష వాహనుండై వచ్చె వరుణుండు సింధు. వాహినీచయపరివారుఁడై మకరి పై నొక్కియేతెంచెఁ బరగ నైరృతియు నా నరవాహనంబమర వేంచేసె. ఘనతురంగంబుపై గ్రక్కున నెక్కి ధనదుండు గుహ్యకతతి గొల్వవచ్చె. నమర నాఖువు నెక్కి యా గజాననుఁడు సముదితోల్లాసుఁడై చనుదెంచె దేవ! సేనాధిపతి మహాశిఖివాహనంబు పైనఁగూర్చుండుక పర్వెత్తి వచ్చె. సప్తఘోటకయుత స్యందనంబెక్కి తప్తహాటకకాంతి దనర భాస్కరుఁడు పఱతెంచె నశ్వినీప్రభృతి నక్షత్ర పరివారుఁడై వచ్చెఁ బంకజాహితుఁడు సహితకావ్యసురేజ్యశను లాదియైన గ్రహతారకామరుద్గణవాలఖిల్య గరుడ విద్యాధర గంధర్వ యక్ష నర కిన్నరాసుర నాగ కింపురుష చారణాప్సరసలు సాధ్యసిద్ధాదు లారయ సద్విమానారూఢులగుచుఁ బరివారయుక్తులై పఱతెంచి రమిత హరుషులై తుంబురుం డా నారదుండు కౌండిన్యముద్గలకపిల వాల్మీకి మాండవ్య జాబాలి మైత్రేయ జహ్ను పుండరీ కాగస్త్య పులహ మతంగ శాండిల్య గౌతమ చ్యవన మార్కండ వరవిభాండక భరద్వాజ సునాభ పరమ ఋశ్యశృంగ భద్ర మరీచి గాలవ కణ్వ మార్కండేయ కాల గాల పరాశర గర్గ దూర్వాస గౌతమ బక దాల్భ్య కౌశి కోదంక సూత శౌనక భృగుసుత జమదగ్ని వరతంతు కశ్యప వామదే వాత్రి హరితస వటు వసిష్ఠాంగిర సాది మునులు భార్యలతోడ ముగ్ధసాగమముఁ గనుఁగొనఁగా వచ్చి కడ నుండిరంత. నంగ కుంతల కరూ శాంధ్ర సౌవీర వంగ కర్ణాటక వత్స సౌరాష్ట్ర మరహాట కేకయ మగధ నేపాళ కురు పాండ్య బర్బర కోసల ద్రవిడ మాళవ బంగాళ మత్స్య పాంచాల చోళ యుగంధర శూరసేనాఖ్య కొంకణ కేరళ కుకురు కళింగ టెంకణ సాల్వ విదేహ శైలూష కాశ బాహ్లిక మద్ర గాంధార నిషధ దాశార్ణ పౌండ్ర విదర్భ సుదేష్ణ కరహాట కాంభోజ కాశ్మీర యవన వరసింధు ఘోట కావంతి పుళింద కురు జాంగల వరాట ఘూర్జర హూణ వరకిరాత త్రిగర్తవరు లాదిగాఁగ నలర సమస్తదేశావనీశ్వరులు బలములతోఁగూడి పఱతెంచి రపుడు. నంత నా శేషుండు నాత్మలోకమున సంతోషమున సభాసదులెల్ల వినఁగఁ గొలువుకూటంబునఁగూర్చుండి వార్తి కులు తేటపడఁదెల్పఁగూఁతువృత్తంబు విని విచారస్థుఁడై విషధరేంద్రుండు తన సభికులఁజూచి తడయ కిట్లనియెఁ. గనుఁగొంటిరే! దైవగతివిచిత్రంబు ఘనుఁడు మాయాబలగణవిశారదుఁడు హరవనజాసనాద్యమరసంఘముల కరయ నవధ్యుండు నఖిలలోకముల నతిభయంకరమూర్తియగు నింద్రజయుఁడు మృతిఁబొందె నేఁడు సౌమిత్రి శౌర్యమునఁ దన బిడ్డ కీపాటు తగునె తానుండ? మనసు తాళదు మోహమమత బాధింప నల్లనఁబాతాళ మటు వెళ్లిపోయి మళ్లి నే లేపెద మణిమహత్త్వమున నా మేఘనాదుని ననుచు రోషమునఁ గామరూపంబులు కడు నొప్పఁదాల్చి ధృతరాష్ట్ర వాసుకి దినకరోదగ్ర శతజిహ్వ విహ్వల శతమూర్ధ కాల కాళి తక్షక నాగ కర్కోట కోగ్ర పాలక ముఖమణిప్రకరంబుతోడఁ జండతరోద్దండసర్పసైన్యములు మెండొడ్డి తనచుట్టు మితి లేక నడవ వలనొప్పఁ బాతాళవల్మీకబిలము తలకొని యా మహాద్వారంబు వెడలి భువి క్రిందుమీఁదుగాఁబొరలెనో యనఁగ నవిరళగతిఁ బేర్చి యహికులాధిపులు నేల యీనినభంగి నిబిడమై తోఁచె. భూలోకమంతయు భోగిసంతాన మయముగా రామాభిమార్గులై చనుచు రయమార నమ్మహా రణభూమిఁజొచ్చి దుహితఁజేరఁగఁ బోయి దుస్సహంబైన సహగమనాతురసచ్చిత్తయగుచు నొనర శ్రీరామనామోచ్చారణంబు మనసులోపలఁజేయుమగువ నీక్షించి యూఱడింపక ఫణాయుతమహోద్ధూత ఘోరతరోచ్ఛ్వాసఘూర్ణితుండగుచు భూరివిషానలంబునకుఁదోడనఁగ మాఱైన క్రోధాగ్ని మఱి ప్రకోపించి సృష్టిసంహారంబు చేయునో యనఁగ స్పష్టంబుగా సురప్లవగపుంగవులు శంకింప నా నిశాచరుతోడఁగూడ లంకేంద్రునికి మహోల్లాసంబు గాఁగ భీకరస్వరమున బిడ్డకిట్లనియె. నో కన్య! నీ విప్పు డుగ్రాగ్ని శిఖలఁ బనిఁబూని చొర నేల పతివిమోహమున వినుము నేఁదెచ్చిన విశ్రుతస్ఫురణ మణి విశేషంబున మగువ! నీ ప్రియుని క్షణములో లేపెద శత్రుసంచయము హరిహరకమలజాద్యమరసంఘములు వరుసతోఁ దాఁకిన వారిలా వోర్తు నేను గల్గఁగ నేల నిప్పాటు నీకు? నా నవ్వి యతనికి నాతి యిట్లనియె. సామాన్యుఁడవె సర్పసచరాధినాథ! భూమిభారకుఁడవు భుజగలోకాధి పతివి నారాయణపర్యంకమైన యతులితాంగుఁడ వనంతాదిశేషుఁడవు తాత! నీ విట్లాడఁదగునె? నీ వింక నీ తమోగుణరహితుఁడవై యాత్మ బ్రాఁతిచే నీ వొకబాగుగా మదిని జింతించి చూడుమా శేషుఁడెవ్వాడు? ఆ లక్ష్మణుండెవ్వఁడతనికి నీకుఁ గాలత్రయంబునఁగలదె భేదంబు? వినుము, నీ విక్ష్వాకువిమలవంశమున జననాథు దశరథేశ్వరుని గర్భమున సృష్టిపై నవతారశీలుండవగుచు శిష్టరక్షకుఁడైన శ్రీరాముతోడ జనియించి లోకప్రశస్తంబు గాను అనుజుండవై దండకారణ్యమునను జనుదెంచి పదునాల్గు సంవత్సరములు జనవల్లభునిసేవ సద్భక్తితోడ ననుదినంబును జేసి యాహారనిద్ర లనక యింద్రియముల నణఁచి యత్యంత తాపసవృత్తితోఁ దప మాచరించి యా పన్నులైనట్టి యమరవర్గములఁ గాపాడి యఖిలలోకంబుల బాధఁ బాపెడుకొఱకుఁగా బహుళయత్నముల శేష! నీ వా యింద్రజిత్తు యుద్ధమున రోషాధికుండవై రూపుమాపుటయుఁ దిరిగి లేపుటకు నీ తెల్వేల తప్పె? సురతాపసులకుఁగా శుభమాచరించు. ఋషి మహాధ్వరకార్యరూపివై మెలఁగు. విషమహానిధి! చూడు విజ్ఞానవీథిఁ బదర నీ కీలాగు పాఁడియే తండ్రి? వదలు మీ వని యన వ్యాళాధిపతియు వెలఁది మాటలు రెండువేలనేత్రములఁ దెలియంగ విని సముదితచిత్తుఁడగుచు ఫణసహస్రంబును బల్మారు సూచి ప్రణుతి సేయుచు మెచ్చి పదునూఱునోళ్లఁ గొనియాడి యంతటఁ గుండలీశుండు ఘనముగా....జ్ఞానాంగదృష్టిఁ గనుఁగొని మాఱాడఁగా లేక తాను మనమునఁదెలివంది మఱిచూచుచుండె. నంత రాముఁడు శేషుఁడా దశాననుఁడు నింతిసాగమముకై యింధనంబులకుఁ బొమ్మని సెలవీయ భుజగవానరులు నమ్మహారాక్షసు లతిసత్వరమునఁ జనుదెంచి వట, బిల్వ, జంబు, జంబీర, పనస, దేవద్వార, బదరి, శమ్యాక, మందార, చందన, మాకంద, లోధ్ర, కుంద, కేతకి, శమీ, కురవకాశోక నారికేళ , కపిత్థ, నాగ, పున్నాగ, పారిజాతాగురు ప్లక్ష పాలాశ కార్జు నామలక చూతాశ్వత్థ నింబ ఖర్జు కౌదుంబర క్రముక దాడింబ తాల తక్కోల తమాల హింతాల సాల సీతాఫల సహకార వేణు నారదాద్యఖిల నానాజాతి గంధ భూరుహంబుల శుష్కభూరికాష్ఠములు ముందు నే నీ వని మోపు లాదిగను అందఱుఁగొనివచ్చి రచలమో యనఁగ వేదికపొడవంత వెళపుగాఁబేర్చి రా దేవతలు వేసి రమరవృక్షములు దివ్యశుష్కంబులు దివినుండి పడఁగ భవ్యచారిత్ర యా భామకై చాల నంత రాక్షసముఖ్యు లహికులాధిపులు నంతకాకారు లైదాఱువే లింద్ర జిత్తు దేహంబెత్తి చితిమీఁద వ్రేయ నత్తఱి సతి చితికయి చుట్టుఁదిరిగి శ్రీరామ! శ్రీరామ! శ్రీరామ యనుచు నా రామచంద్రుని నాత్మలోఁదలఁచి యా మహామహుఁజూచి యతిభక్తి మ్రొక్కి కామినీమణి పల్కెఁగరబద్ధయగుచుఁ. బరిపూర్ణ సత్కృపాపాంగుండ వగుచు ధరణీశ! నా కాజ్ఞ దయచేయు మింక భూపాల! నా మనోబుద్ధి పూర్వకముగ నీ పాదములకు నీ నిఖిల ఖేచరులు భూచరాదులు సాక్షిభూతులై వినఁగ దాచక భావంబు తథ్యంబుగాను వెళ్లనాడెద నేను విన్నపంబొకటి కల్ల గాదిది విను కాకుత్థ్సతిలక! అరయ నీ పంచభూతాత్మకంబైన పరమదుర్లభ కళేబరపాత మగుట నా పంచభూతంబులం దైక్యమగుచు భూపాల! సరిగదా భూతపంచకము నైనను ఇతరంబులందుఁగాకుండ మీనాంకనిభ! నీవు మెలఁగ భూస్థలిని భూమి భూతంబును బొలుపార నీవు నేమంబుతోడుత నిరతంబు సేయ స్నానపానాదుల సలిలంబులోనఁ బానీయభూతంబు పరగ నీ తేజ మందు తేజోభూత మంగసంగంబు మందంబుగాఁజేయు మారుతంబందు వాయుభూతంబును వసుధాతలేశ! పాయ కే వేళ నీవైయున్న యట్టి గగనమధ్యమున నాకాశభూతంబు మిగులంగఁగలసి లో మెలఁగుచు నుండ ఘనముగా మోక్షాధికారులఁజేసి మనుజేశ! నీలోన మముఁగల్పుకొనుము అరవిందభవవాసవాదుల కైనఁ బరమదుర్లభ ముక్తిపదము గోరెదము అనువుగా నుండినయవని తచ్ఛేష మునకుఁగా నిహలోకమునను జన్మములు గలుగఁజేసితివేని ఘనుఁడ నీ కృపను దొలఁగింప వశమె నా దుష్కృతంబెంత? ననుభవింపకతీరదైన నే మాయె? జననాథ! నా జన్మజన్మాంతరముల విలయకాలానల విగ్రహంబైన బలపరాక్రమ బాహు బలశౌర్యశాలి మహి నింద్రజిత్తుఁడే మగఁడు గావలయు బహుబలాఢ్యుండైన పంక్తికంధరుఁడు మామ గావలె నాకు మయపుత్త్రియైన భామ మందోదరి ఫణికులాధిపుఁడు ఆదిశేషుఁడు తండ్రి యతులవిక్రముఁడు వేద వేదాంగాస్త్రవిదుఁడు సౌమిత్రి వాసవాంతకునికి వైరి గావలయు భాసురంబుగ రామభద్రునిమీఁది భక్తి చిత్తంబున బాగుగా నుండి ముక్తదేహంబాత్మమోహంబుఁబాసి ధరణీశ! నీ సన్నిధానంబు గల్గి పరమోత్సవంబులఁబాఱఁదోలుచును మరువ కంతమున నీ మహితనామములఁ బరతరస్మరణచే బ్రహ్మైక్యమందఁ గాఁజేయవే తండ్రి! కరుణతో ననుచు రాజేంద్రుఁడైన యా రఘురాముచేత ధృతసదనుజ్ఞయై దేవి సౌమిత్రి కతిభక్తి మ్రొక్కి నా కానతి మ్మనుచుఁ బరమపావన సీతపదపద్మములకుఁ గరము లెత్తుచు నమస్కారంబు సేసి భూనాథుకుడిదిక్కు పొలుపారుచున్న మానితుండగు పిన్నమామ కిట్లనియె. దశముఖానుజ! మీకు దండ మిమ్మహిని దశరథాత్మజ!రామ! దయ చాలఁగల్గి స్థిరముగాఁబట్టాభిషిక్తుండ వగుచు సరస లంకాపుర సామ్రాజ్యమిఁకను నిర్విచారంబుగా నీ వేలి యెప్పు డుర్వీశుపై భక్తి యుడుగకు మనుచు నతని మన్నించుచు నంత సుగ్రీవు నతులిత నల మరుదాత్మజ నీల హరి గజ జాంబవ దంగదాదులను బరమాదరంబునఁబాఱంగఁజూచి మీకు మ్రొక్కెద నింక మీరలందఱును నా కానతీయరే నా యన్నలార! రాము కార్యమునకై రణదక్షుఁడైన యా మేఘనాదుని యస్త్రసంతతుల గాసిల్లి తిరిగెడు కష్టంబులెల్లఁ బాసి రాఘవకృపాపాత్రులై మీరు వాసిగా నిఁకమీఁద వర్ధిలుఁడంచు వేసారకందఱ వేర్వేఱ నడిగి యంతటఁదండ్రైన యాది శేషునికి నింతి దండము వెట్ట నిరువేయికనుల శోకోదకంబులు సుదతిపై రాల నా కుమార్తెను చూచి యతఁడు దుఃఖింప నిలు నిలు మీ భ్రాంతి నీ కేల పుట్టె? పలుమారు వగతురే పాఁడిగా దనుచు వనజాక్షి! తక్షకవాసుకి ప్రముఖు లనుపినతండ్రుల నతివేడ్క నడిగి అత్తమామలకును నతివ యిట్లనియె విత్తాధిపానుజ! వినవయ్య నీవు సామాన్యుఁడవు గావు సారాంశమలర నేమంబు లేర్పడ నిగమఖండములు బాగుగాఁ జేసితి బ్రహ్మవంశాగ్ర సాగరోదయుఁడవు శక్రాదిదివిజ కాలరూపివి లోకకంటకుఁడనఁగఁ బౌలస్త్యకులనాథ! ప్రఖ్యాతముగను వెలసినవాఁడవు విభవాస్పదైక లలిత లంకారాజ్యలక్ష్మిఁ గైకొనుచు నిఁకమీఁద రావణ! యెన్నిభంగులను సకలేశుచే ముక్తి సమరరంగమునఁ గలుగు నవశ్యంబు గర్వాంధకార జలరాశిలోపలఁజలముచే మునిఁగి మత్తుండవై పోక మహితాత్మురాముఁ జిత్తమం దిఁకనైనఁ జింతించి చూడు నా మీఁద దయయుంచి నా కానతిమ్ము ఓ మామ! యన నతండుత్కంఠ శోక చిత్తుఁడై కౌఁగిటఁజేర్చి కోడలిని ఒత్తిలి యేడ్చుచు నొక కొంతసేపు మానె మందోదరి మగువ కిట్లనియె. మానిని! నీ భాగ్యమహిమ కే మందు? హరపితామహనిర్జరాధీశులకును పరమగోచరుఁడైన పరమాత్ముఁడితఁడు నీకుఁగాఁ జనుదెంచి నిఖిలదేవతలు లోకత్రయంబు నాలోకించ నిలిచి సాంగంబుగాఁజేయ సార్థకంబాయె. నంగన! సాగమనాంగకార్యములు పరమధన్యవు నీవు పౌలస్త్యుకులము కురగసత్కులమున కుర్విపైఁజాలఁ గీర్తి దెచ్చితివమ్మ! కేవలంబుగను భర్తకు ముక్తిసోపానమార్గంబు కలిగె రాముని పాదకమలయుగ్మంబు నెలఁత!నీ మనమున నిలిపి యంత్యమునఁ దెలివి దప్పక రామదివ్యనామములు పలుకుచు నీవందు పరలోకమనిన నా మహోదరముఖ్యులైన రాక్షసులఁ బ్రేమతోఁబ్రార్థించి పిదప సన్మునుల కతిభక్తి వందనం బాచరించుచును నుతిచేసి వారిపత్నులకెల్ల మ్రొక్కి సకలమహీపాలసముదయంబులకు ముకుళితహస్తయై మొగి సెల్వువడసి యతివ దేవతలదిక్కభిముఖ యగుచు శతకోటిసూర్యభాస్వత్తేజ మలర నతులితవృషభరాజారూఢుఁడగుచుఁ బ్రతికాంతులొరయంగఁబార్వతీసహితుఁ డై మహాప్రమథవర్గావృతుండైన శ్రీ మహాదేవు నాశ్రితపారిజాతు నకు మ్రొక్కి తనపాణి నలినయుగ్మంబు ముకుళించి నుతివాక్యములు గాఁగఁబలికె. జయ నిర్జితానంగ! జయ పాపభంగ! జయ చితాభస్మాంగ! జయ కృపాపాంగ! జయ శైలజాధీశ! జగదాదిపురుష! జయ చంద్రికావర్ణ! జయ జగత్పూర్ణ! జయ హేమనగచాప! జయ దివ్యరూప! జయ సోమశేఖర! జయ మహోదార! జయ భక్తమందార! జయ నిర్వికార! జయ రవీంద్వనలాక్ష! జయ లోకరక్ష! జయ భవార్ణవమోక్ష! జయ దుష్టశిక్ష! జయ వేదమయవేష! జయ చిదావేశ! జయ భుజంగమభూష! జయ దూరదోష! జయ విష్ణునుతవేష! జయ దీనపోష! జయ ధరాస్యందన! జయ పంచవదన! జయ నందివాహన! జయ శక్తిభవన! జయ జాహ్నవీధర! జయ తత్త్వసార! జయ కాలశోషణ! జయ చర్మవసన! జయ పురత్రయభేద్య! జయ వేదవేద్య! జయ విధాత్రార్జిత! జయ సర్వవినుత! యనుచు నీ విధమున నభవుఁబ్రార్థించి తనువున శారదాధాత్రంఘ్రులకును బలుమాఱు మ్రొక్కుచుఁబౌలోమితొడను విలసిల్ల దేవతావితతిమధ్యమునఁ బొలుపారుచున్నట్టి పురుహూతు నరసి చెలియ దండము పెట్టి చేతులు మొగిచి యా దిశాపతులకు ననిమిషాదులకు నాదిత్యముఖ్య గ్రహాదులకెల్ల వాసవ యక్ష విద్యాధరాదులకు నా శారదైకదంతాప్సరలకును బన్నగాదులకును బక్షీంద్రులకును గిన్నరాదులకు సత్కింపురుషులకు హారిగంధర్వుల కా గుహ్యకులకుఁ జారణవసుసిద్ధసాధ్యాదులకును నరుల కంబుధులకు నదనదీతతికి వరమరుద్గణమహావాలఖిల్యులకుఁ బావనాకృతులైన పంచభూతముల కా వనస్పతులకు నచలౌఘములకుఁ బుణ్యతీర్థములకుఁబుష్కరంబులకుఁ బుణ్యాంగనామణి భూసురాదులకు వరుసతోడుత మ్రొక్కి ప్రార్థించి.... తిరముగా ముమ్మాఱు దిరిగి తేరెక్కు చెలువంద గ్రక్కునఁజితిమీఁది కెక్కెఁ. దలకొని రామునిఁదలఁచి ధైర్యమునఁ బటుతర రిపుజాల భర్మకోటీర ఘటిత నానారత్న గణమహాసమర రంగశస్త్రాస్త్ర ధారావినిర్భంగ రంగవల్లీకృతరమణీయభర్తృ మంగళకరమైన మస్తకంబూని అంగసంగంబుగా నాలింగనంబు కాంతునిఁజేసి యా కాష్ఠతల్పమున నింతి తాఁబవళింప నింధనా లసురు లాపైనఁబేర్చుచు నాజ్యకుంభములు నోపినన్నియుఁబోసి యుచితమంత్రాగ్నిఁ దగిలింప దరికొని తఱచుకాష్ఠములు పొగ లెగయుచును బ్రస్ఫురితస్ఫులింగ ముగ భగభగ మండ భూర్యగ్నిశిఖలు గగనంబు భేదింప ఘనఘోషమహిషి మతితోడ రామనామంబు లా కంఠ గతజీవమౌ దాఁక గర్జించుచుండఁ దడయక శిరమద్భుత స్ఫోటమగుచు వెడలి ప్రాణంబులు వేగ పైకెగసె. నా మహాతేజంబు నా రామవిభుఁడు రాముని తమ్ముఁడు రావణానుజుఁడు రావణాసురుఁడు తద్రమణి రాజాస్య దేవి మందోదరి దినకరాత్మజుఁడు హనుమంతుఁడును దక్క నన్యులెవ్వరును గనలేకపోయిరి కనువిచ్చి చూడ నంత రాక్షసులు చింతాక్రాంతు లగుచు సంతోషమున శైలచరులార్వ మింట సురదుందుభులు మ్రోసె సురపుష్పవృష్టి యరుదుగా ధరణిపై నందంద కురిసె. నప్పుడా దేవత లతివకై దిశల నొప్పారు వెలుఁగుల వ్యోమమార్గమునఁ దప్తహాటక కాంతిధగధగద్ధగిత సప్తార్చినిభ విభాసలలితరత్న మణిగణోజ్జ్వలమహామండితవలయ ఘణఘణధ్వనిహేమఘంటికాయుక్త (?)దివ్యవిమానంబునందు దంపతుల దివ్యాభిషేకంబు తెఱఁగొప్పఁజేసి దివ్యభూషణములు దివ్యాంబరములు దివ్యలేపనములు దివ్యమాల్యములు కమనీయముగ నలంకారంబు చేసి యమరంగ నెక్కించి యా విమానమున గంధపుష్పాక్షత కర్పూరదీప బంధూకసురతరుప్రముఖ పుష్పములఁ బూజించి యా దివ్యపుష్పకంబెక్కి తేజంబు నభమునఁదేజరిల్లగను జుంగులు బిగఁబట్టి సొగసుగా మోసి రంగంబు లుప్పొంగ నయ్యష్టవసువు లమరు లందఱు సేవ లమరంగఁజేయ బ్రమథులతోఁగూడఁబరమేశ్వరుండు దీవించి వీభూతితిలకంబు పెట్టి ఆ వారిజాసనుండఖిలసంయములు నాశీర్వదించి మంత్రాక్షతల్ వేయ నా శచీవిభుఁడు వీరాంచితస్వర్గ మునకుఁగా నవరత్నములఁజేతులార నెనయంగ నభిషేక మింపారఁజేయ ముదమొప్ప వరుణుండు ముత్యాలగొడుగు వదలక పట్టెఁ బావకుఁడెత్తె దీప మడపంబు ధరియించె నా రాజరాజు విడువక పావడల్ వీచె మారుతము ఇరువంకలను నైరృతీశులు సురటు లరుదారఁబట్ట రంభాదికాప్సరలు నెడనెడ నృత్యంబు లింపారఁజేయ నుడుగక గంధర్వు లుచితగానములు పాటి తప్పక పాడఁబరగఁగిన్నరులు మీటిరి వీణెలు మేల మేలనుచు రామకీర్తనలు నారదుఁడు తుంబురుఁడు నేమరకను యక్షులెల్లను బొగడ వారిజాహితుఁడును వనజబాంధవుఁడు బారులేర్పడ బరాబరిచేయుచుండఁ బరువడిఁబలుమారు బహుపరాకనగ .......... విద్యాధరులు నంత విద్యావిలాస మాద్యంతమును జూప నహివైనతేయ చారణ గుహ్యక సిద్ధ కింపురుషు లారయ సిద్ధాదులందఱు మంచి యరిగలు పడగలు నాలవట్టములు నరయ ఘంటలు శంఖు లాచామరములు మాణిక్యరుచిరోరుమహిమ నా వేత్ర పాణులై ముందఱఁబరువెత్తుచుండ నా లోన శ్రీలక్ష్మిహారము ల్వేసెఁ. బౌలోమి సొంపుగాఁబసుపు తాఁబూసె. వాణి కుంకుమబొట్టు వలనొప్పఁబెట్టె రాణింపఁ బాపట రతిదేవి తీర్చెఁ గొండలదొరచూలు కురులు దువ్వంగ దండిగా జడవేసె ధారుణీదేవి. యా వనస్పతిరాణి యఖిలపుష్పముల సేవసేయఁగఁజొచ్చెఁజెలువంబు మిగులఁ. గమనీయ నేత్రయుగ్మమునఁగాటుకయు నమరంగ స్వాహామహాదేవి పెట్టె. మేధామహాదేవి మెడనిండఁబూసె. నా ధర్మచారిణి కఖిలగంధములు రంగైన బంగరు రత్నకుంభముల మంగళోదకములు మరి చాలఁదెచ్చి యంగనపాదంబు లత్యాదరమున గంగ గోదావరి కాళింది సరయు భవనాశియును దుంగభద్ర పెన్నయును బ్రవిమలకావేరి వరకృష్ణవేణి నర్మద మొదలైన నదులెల్లఁగడగ ఘర్మహారంబుగా గంధర్వసతులు పసిఁడిగాజులు మ్రోయ బాలిండ్లు గదల నసదుమధ్యంబసియాడంగ శీత మంజులానిలములు మైనిండ సోఁక వింజామరంబులు విసరుచు రాఁగ నాగ కన్యామణుల్ నలుగులుపెట్టి రాగంబు లా కిన్నరస్త్రీలు చేయఁ. గమ్మఁగా వాసించు కపురంపువిడెము లొమ్ముగా గుహ్యక యువతులందీయ సలలితతాంబూలసారపాత్రాంబు(?) పలుమారు నా యక్షభామలు చేయ నిలువుటద్దమ్ములు నిగనిగ మనఁగఁ బొలుపారఁజారణుల్ ముదమొప్పఁజూప మఱియుఁగింపురుషులమగువలందఱును అరుదారఁగాఁగొల్వ నా సిద్ధసాధ్య వనితాజనంబు కావలసినపనులు ననువందఁగాఁజేయ నా మహామునుల సుదతు లహల్యయు సుచరిత్రయైన యదితి లోపాముద్ర యా యరుంధతియు మదవతి యనసూయ మగువ రేణుకయు మొదలుగాఁగలయన్యమునికదంబముల యువతులారతులెత్తు నుత్సాహ మలర దివిజులివ్విధమున దేవి కింపైన వివిధోపచారసద్విధులాచరింప నవిరళపంచవాద్యములు మ్రోయుచును సరసవైభవముల సతిపతుల్ వేడ్కఁ బరమసామ్రాజ్యైక పదమందిరపుడు. నంత ఖేచరభూచరాదులత్యంత సంతోషచిత్తులై స్వస్థానములకు నేమి పుణ్యము చేసె నీ దైత్యవనిత రాముండు దా వచ్చి రమణప్రయుక్త గమనకార్యంబు సాంగముగ సాగింపఁ గమల యంబిక వాణి ఖగరాజురాణి యందరా నుత్కృష్టమైనట్టిపదవి నందెఁబొమ్మనుచును అన్యోన్యులిట్లు వాదించి చెలఁగిరి వాసుకి తక్ష కాదులతోఁగూడి యాదిశేషుండు .......... పాతాళమున కేఁగెఁబంక్తికంధరుఁడు ముదిత మందోదరి మొగము వీక్షించి కొదలేక మన పెద్దకొడుకుఁగోడలిని ఘనముగా నేఁడంపకములు చేసితిమి యనుచుఁగన్నీరూర నతిఖేదపడుచు ..........నిర్గతమలినంబు భంగి భాస్కరరశ్మిభంగాంధమయము చందంబు వెటలీ సంధానమునకు(?) నందనిమృగపక్షులందంబుగాను రాముసన్నిధిఁబాసి రమణితోఁగూడి యా మహానక్తంచరావృతుండగుచుఁ జెచ్చెరఁ గడుఁగ్రూరచిత్తుఁడై లంకఁ జొచ్చి గర్వముఁదక్కి సొలయుచునుండి యంత నా దశకంఠు.......... .......... గనుఁగొని జయలక్ష్మిఁగైకొని దిశలు గలయంగ1775నపుడు శంఖంబు పూరించి విలు గుణధ్వని సేసి వెస లక్ష్మణుండు నలువొప్ప నురుసింహనాదంబు సేయఁ జెలువొందె నప్సరస్త్స్రీల లాస్యములు; వీనులు సొగయించె విశ్రుతశ్రుతుల మానైన గంధర్వమధురగానములు. నంత విభీషణుఁ1776డంతంత కెచ్చు సంతోషమున గ్రుచ్చి సౌమిత్రి నెత్తి యాలింగనము సేసె నాలంబులోన నా లోన వనచరు1777లందంద చెలఁగ. నంతలో హతశేషులగు నిశాచరులు నెంతయు భీతిల్లి యేపెల్లఁబొలిసి వనచరుల్ దోలంగ వడి ధృతి దూలి తనరారుపదహతి ధరణి గంపింపఁ గలగొని చీకట్లు కన్నులఁగవియఁ దలలు వీడఁగ నాయుధంబులు వైచి చెందిన భయమునఁజెడి పాఱి లంకఁ గొందఱు సొచ్చిరి; కుధరశృంగములఁ గొందఱెక్కిరి; వార్ధిఁగొందఱు వడిరి కొందఱు 1778ఘనశైలగుహలలో దూరి. రనలుండు తీవ్రార్చు లడరంగ వెలిఁగె; దినకరుం డుజ్జ్వలదీప్తిఁ జెన్నొందె; జలధు లేడును నతిస్వచ్ఛంబు లయ్యెఁ; గలయ దిక్కుల కప్పుకావిరి విఱిసె; గగనప్రసన్నత గలిగె; నిష్కంప మగుచు భూతల మొప్పె. నప్పుడెంతయును బవనసూనుఁడు శతబలియును నలుఁడు జవశాలి పనసుండు శరభుండు ఋషభుఁ డతులవిక్రమశాలి యా వాలిసుతుఁడు నతిబలుండర్కజుఁడా 1779దధిముఖుఁడు గజుఁడును గవయుండు గంధమాదనుఁడు విజయులైనట్టి యా ద్వివిదమైందులును దక్కినవానరోత్తములు నేతెంచి మ్రొక్కి కీర్తించిరి ముదితాత్ములగుచు. నప్పుడు లక్ష్మణు నఖిలదేవతలు నొప్పార నుతియించి యొగిఁబుష్పవృష్టి గురిసిరి. వానరకోటి పెల్లార్చెఁ; బరిమళయుత మందపవనంబు వీచె; నా లక్ష్మణుఁడు విష్ణునంశంబుగాన యాలంబులోపల నతనిచేఁదెగిన కపటరాక్షసుఁడును గాయంబు విడిచి యపరాబ్దిఁగ్రుంకినయర్కుండువోలె విష్ణుసాయుజ్యంబు వెలయంగ నందె నుష్ణాంశుకులుకీర్తులొగి దిశల్ నిండ సౌమిత్రి యట జయస్తంభంబు నిల్పి రామునియొద్దకు రయమునఁజనియె సర్వవానర విభీషణ వాయుజులును బర్వి యెంతయుఁదన్ను బలిసి యేతేర? వచ్చి రామునిపాదవనరుహంబులకు నచ్చుగా నెఱఁగిన నప్పు డుప్పొంగి యలరి కౌఁగిటఁజేర్చి యానందబాష్ప ములతోడఁ దొడలపై ముదమొప్ప నునిచి పొరి నంగముల వీరపులక లనంగ నరగఱుల్ సొరఁబాఱినట్టి బాణముల 1780మునుకొను నా దుఃఖమున మేఘనాదు డనిలోనఁగూలిన యా సంతసమున నతిరయంబున మూర్ఛయంతలోపలనె ధృతి1781నూలుకొనఁదోన తెలివియుఁగలిగి యా వేళ రఘురాముఁడర్కసూనునకు నా విభీషణునకు ననుజన్ముఁజూపి: “యా యోధనంబున నలవుమై నింత సేయునే యీతఁడజేయుఁడై నేఁడు! బహుదివ్యశస్త్రాస్త్ర1782పరు నింద్రజిత్తు నహితభయంకరు ననిలోనఁజంపె. నటుగాన నాచేత ననిఁజచ్చు నింకఁ బటు శౌర్యధరుఁడైన పంక్తికంధరుఁడు నాతని విభవంబు నాతని బలిమి నాతని సుతునితో నట నేఁడు వొలిసె. నిఖిలశస్త్రంబుల నిపుణుఁడై మెఱసి యఖిలరాక్షసులకు నాధారమైన కొడుకుచావున కెల్ల కోర్కులు విడిచి కడిమిమై నాతోడఁ గయ్యంబు సేయ సర్వాయుధో1783జ్జ్వల1784సన్నద్ధుఁడగుచు గర్వించి దుర్వారగతి వచ్చెనేని చతురంగబలదైత్యసంఘంబుతోడ వితతాహవక్షోణివిశిఖజాలముల బలువిడిఁదునుమాడి బలి భూతములకు నలవడఁగా1785వింతు నద్దశాననుని.” నని సుషేణునిఁజూచి యా రాముఁడనియెఁ “దనరునోషధిశైలతటవనంబునను నురుతరప్రభలతో నొప్పువిశల్య కరణి వే తెచ్చి లక్ష్మణవిభీషణుల వానరావళి శరవ్రణవేదనలను వానరోత్తమ! పాపవలయు నీ.”వనిన నాతఁడు నత్తెఱంగటుసేయ వారు వీతక్షతాంగులై వెస నుల్లసిల్లి. రినసూనుపనుపున నెల్ల వానరులు మనమారఁగైసేసి మహిత తేజమునఁ జంద్ర దివాకరసదృశు లౌరామ చంద్రసౌమిత్రుల సరిగొల్వ నపుడు రామలక్ష్మణులును రవితనూజుండు యామినీచరపాలుఁడగు విభీషణుఁడు నుతబలుండనిలసూనుఁడు సుషేణుండు శతమన్యుమనుమఁడు జాంబవంతుండు నీలుండు మొదలుగా నిఖిలయూధపులు బౌలస్త్యులకునెల్లఁ బట్టుఁగొమ్మైన యా వీరవరుని చా వధికసమ్మ1786దము గావించి సంపూర్ణకాములై. రిటను |


