ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రావణుఁడు సీతఁ జంపఁబోవుట
నే నింక నిజముగా నిప్పుడ పోయి
జానకిఁదెగటార్చి చలము సాధింతు.”
నని హస్తమునఁజంద్రహాసంబుఁబూని
తనరిన పదహతి ధరణి గంపింపఁ
జనుచుండ వృద్ధరాక్షసమంత్రివరులు
దనరార నూహించి తమలోన ననిరి:
“దశరథాత్మజుల నీ దశకంధరుండు
నిశితబాణంబుల నిర్జింపలేఁడె?
కైకొన కీతండు కడిమిమై సకల
లోకపాలుర నాజిలో మున్ను గెలిచె;
నోలి మరుత్తుల నుగ్రాహవమునఁ
దోలెను; నలువలఁదొమ్మండ్ర నొడిచె;
నెనమండ్రువసువుల నే పడఁగించె;
ఘనతతోఁ1802దొమ్మండ్ర గ్రహముల నణఁచెఁ;
దెగువఁబన్నిద్దఱాదిత్యుల నొంచెఁ;
బగ గెల్చె రుద్రులఁ బదియు నొక్కండ్ర;
నరుదార గంధర్వయక్షరాక్షసుల
నురగుల గరుడుల నుగ్రదానవుల
నతిభీతిఁబొందించె; 1803నారసి చూడ
నితనికి నరులన నెంతటివారు?
తమకించి సతిఁజంపఁదగ1804దుగా.”1805కనఁగ
సమవర్తిఁబోలె నా సమయంబునందు
లోకభయంకరాలోకుఁడై తివిఱి
నా కీశవైరి జానకిఁజంపఁగదిసె.
నప్పు డప్పాపాత్ము నత్యుగ్రదృష్టి
కప్పుణ్య1806సతి స్రుక్కి 1807యనదచందమున
నొందినభీతితో నుగ్రగ్రహంబు
ముందఱ నిలిచిన మోదంబు దక్కి
పడియున్న రోహిణిపగిది నమ్ముగ్ధ
పడియుండి రావణుభావంబుఁజూచి:
“యీ దురాత్మునిచేత నిటు చావవలసె.
హా దైవమా!”యని యతిభీతిఁబొంది.
“దురమున నింద్రజిత్తుఁడు సచ్చుటెఱిఁగి
సురవైరి చంప వచ్చుచునున్నవాఁడొ?
కాక యా రామలక్ష్మణుల జయించి
చేకొని ననుఁజంపఁజేరుచున్నాఁడొ?
వీనిచేఁజావనా విధి చెఱఁబెట్టె.
నే నేమి సేయుదు1808నిటమీఁద నింక.
నక్కటా! దైవంబ! యతిపుణ్యధనులఁ
బెక్కుసంకటములఁబెట్టితే తెచ్చి
రామాభిరాముల రామలక్ష్మణుల
నా మీఁదిపగ”నంచు నలినాయతాక్షి
పలవించి పలవించి భావమధ్యమున
నెలకొన రఘురామునిజమూర్తి నిలిపి
పరవశయై తూలి పడి మూర్ఛవోయె.
ధరణిపైఁబడియున్న ధరణిజఁజూచి
ధరణిజదెస నల్గు దశకంఠుఁజూచి
కరము శోకించి రాక్షసులెల్లఁగలయ
హా హా నినాదంబు లడరించి యప్పు:
“డోహో! దురంత మీ యుగ్రకృత్యంబు”
అనుచుండ నత్తఱి నమరారిఁ జేరి
ఘనుఁడు సుపార్శ్వుండు ఘననీతిధనుఁడు
వెఱపక తన నీతి విభవంబు మెఱసి
తెఱఁగొప్ప నతని బోధించుచుఁబలికెఁ:
“దాత పులస్త్యుండు; తండ్రి ధర్మైక
నీతిజ్ఞుఁడురుయశోనిధి విశ్రవసుఁడు;
నీవు వేదాగమనిధివి; నీ పెంపు
భావింప కేల దుర్భావుండవైతి?
1809తగు నుత్తమస్త్రీలఁ దగిలి వధింప
నగణితంబగు దోష; మటుగాన1810వలవ
దీ కోపమంతయు నెల్లి యుద్ధమునఁ
గైకొని రామలక్ష్మణులపైఁ జూపు.”
మని చెప్పి యా చంద్రహాసంబు వుచ్చి
కొని సుపార్శ్వుండు దోడ్కొనివచ్చె మగుడ.

  1. ↑దొమ్మిది
  2. ↑నా యోధనమున
  3. ↑వు గాద
  4. ↑కనుచుఁ- దమలోన మంత్రు లత్తఱిఁ బల్కుచుండ
  5. ↑వతి
  6. ↑యంతరంగమున
  7. ↑నిల
  8. ↑తగదు
  9. ↑తగదు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )