| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
బర్వతదీప్తిప్రభాతవిభ్రాంతిఁ బర్వినభీతిమై భానువంశజుఁడు సమరలక్ష్మీరతిశ్రమ నిద్రఁబొందు క్రమమునఁ జెలువుఁడై రణశయ్య నున్న తమ్మునిఁ గనుఁగొని:“తమ్ముఁడా! నీవు తమ్ముఁడవై యుండఁదప2095మూననైతి. నిల జీవులకునెల్ల నిదె వేగెఁబ్రొద్దు; పొలుపేది నా పాలి ప్రొద్దస్తమించె. నఱిముఱి నడవిలో నాలిఁగోల్పడితి; నెఱయ నేఁడాజిలో నిన్నుఁగోల్పడితి. గెడ నాకు నైన దుష్కీర్తిపంకంబు కడుగ దిక్కెవ్వరు గలరు సౌమిత్రి! “మానపయోనిధి మహనీయశీలు నా నోచికన్న యున్నతపుణ్యలోలు నేను నీచే నమ్మి యిచ్చి2096న నకట! కానలఁగొనిపోయి కడతేర్చి తన్న; యే నేమిచేయుదు నిటమీఁద.”నన్న నేను సుమిత్రతో నే మన నేర్తుఁ? దుదిఁబోయి భరతశత్రుఘ్నులు నన్నుఁ గదియ2097ంగ వచ్చి“లక్ష్మణుఁడేఁడి?”యనిన నేమని చెప్పుదు; నేమని పోదు నా ముఖంబునను దైన్యము దోప నింక! 2098దీనికిఁజింతింప; 2099దీనికి వగవ; నేను జింతించెద నిట దీర్ఘచింత; ఖలుఁడైన రావణుగతులకుఁజేసి తలపోసి మదిరోసి తమయన్నఁబాసి హితభృత్యవృత్తిమై నీ విభీషణుఁడు చతురుఁడై నను వచ్చి శరణంబు సొచ్చెఁ. జొచ్చినఁబ్రీతి రక్షోరాజ్యమెల్ల నిచ్చితి నీకని యే నూఱడించి పట్టంబుఁగట్టితిఁబ్రతినతోఁ; బలుకు నెట్టన నిండింప2100నేర్పు లేదయ్యె. నిదె వేగుచునువచ్చె; నింక లక్ష్మణుఁడు బ్రదుకఁడు; నా కింకఁబ్రాణముల్ వలదు; దురితదూరుఁడు వీనితోడిదె లోక; మరసిచూచిన నింక నడ లోర్వరాదు; శరణన్నవారి నెచ్చట వీడరాదు; ధరణిపై క్షత్త్రియ 2101ధర్మంబు గాదు; తారు నొచ్చిననైనఁ దమ్మాశ్రయించు వారల రక్షింపవలయు రాజులకు. (నీ విభీషణుఁగొంచు నీ వేఁగి పుణ్య భావుఁడైనట్టి మా భరతునితోడ నరయ నిక్కడి కార్యమంతయుఁజెప్పి: “పరగంగ లంకకుఁబ్రతిగాఁగ నితని వెలయ నయోధ్యకు విజయలగ్నమున ఫలసిద్ధి పెంపారఁబట్టంబు గట్టు.” మని యేను జెప్పితి నని యొప్పఁజెప్పి యొనరంగ నందుండి యుచితంబుతోడ) వానరేశ్వర! నీవు వాలినందనుఁడు సేనలఁగొంచుఁ గిష్కింధకు నరుగుఁ.” డని దైన్యపాటుతో నాడ భీతిల్లి వనచరాధీశుండు వలనొప్పఁగదిసి: “పరికించి చూడఁబ్రభాతంబు గాదు; నరనాథ! యిప్పుడు నాలవజాము చొచ్చె నింతియ; వాయుసూనుండునిపుడ వచ్చు; సంతాపింపవల.”దంచుఁదేర్చెఁ. 2102(దేర్చిన నెంతయుఁదెలియక మఱియు బేర్చిన శోకాగ్ని పెల్లున మిగులఁ బొరిఁబొరి భూమిపైఁబొరలుచు వగలఁ బురపురఁబొక్కుచు భూవరతనయుఁ “డన్న, నే జనకాజ్ఞ నడవి కేతేర నిన్నుఁ బొమ్మనకున్న నీవు నా వెనుక చనుదెంచి యిడుమలఁజాలంగఁ బడఁగఁ గనుఁగొని మనములోఁగరము శోకింతు. నేఁడు నీ వొరుచేత నీలావు దూలి పోఁడిమి చెడి యిట్లు భూమిపై నుండ నేనెట్లు బ్రదుకుదు? నేమని వగతు? నే నిను డించి యెట్లేఁగుదుఁబురికి? సీత నా కేటికి? జీవ మేమిటికి? నో తండ్రి! నాకింక నుర్వి యేమిటికి? నా తండ్రి పంచిననాఁటనుండియును నా తండ్రిక్రియ నన్ను నరయుచుండుదువు. నా విధి నిను నేఁడు నాకారిచేత నీ విధి నిటు సేసె నీ రసంబెత్తి. దేశదేశముల సతీజనంబులను దేశదేశములందుఁదివిఱి బాంధవుల నరసి కానఁగవచ్చునట్టి దేశములఁ బరగఁదమ్ముని నెందుఁబడయంగవచ్చు? నని యచేతనుఁడగు ననుజుపై వ్రాలి కనుఁగొని దిక్కులు కడుధైర్య మెడలి “యన్నరో! నీవు న‘న్న’న్నని పిలువ నెన్నఁడు వినఁగల్గు నింక వీనులకు? సీత సుమిత్రఁగా స్థిరమతిఁజూతు; చూతు నన్దశరథక్షోణీశుఁగాఁగ;2103 నాతత విషమ ఘోరారణ్యభూమిఁ బ్రీతి నయోధ్యగాఁబెంపారఁజూతు. పూవులపాన్పునఁబొందించు మేను నీ వెట్లు చేర్చితి నేఁడు ఱానేలఁ? 2104బడియు నిద్రించుట పరిణామ మనుచుఁ బుడమీశనందన! పొలుపుతో నీవు పదునాలుగేండ్లును బాయ2105క నిద్ర పదిలంబుగా డించి పరువడి నడవి నరసి నన్రక్షించి యాజిమధ్యమున నరులఁజంపక పోవ నగునయ్య నిద్ర; నిద్ర నీవిట్లున్న నిజమయ్యె దీర్ఘ నిద్ర మీ యన్నకు నృపనందనుండ! మీయన్న కెప్పుడు మిక్కిలిభక్తి సేయుదు; నేఁడేల చింతింప2106వకట! 2107మన్నన 2108సేయుదు మమత నా మాట లిన్ని2109యూహంబులు నేల పెట్టెదవు? “రావణాసురుఁబట్టి రణమునఁగూల్చి భూవర! యెంతయు భూమిజఁగూర్తు.” నని నాదు వీనుల కసలారఁబలుక కునికికి2110ఁగత మేమి యో పుణ్యమూర్తి! యిప్పుడ మేల్కని:“యేమి శ్రీరామ! తప్పఁబల్కఁగ నీకుఁదగునయ్య?”యనుచు నొప్పెడు మాటల నూఱడఁజేసి తప్పక కనువిచ్చి తగఁజూడు.”మనుచు రాసుతుకెంగేలు రమణమైఁదిగిచి భాసురంబుగ 2111గండపాళికఁజేర్చి “ననుఁదేర్పవే!”యని నరనాథుఁడపుడు మనమునఁదెలియక మహిమీఁదఁబడియెఁ. బడియున్న యా రఘుపతి మూర్ఛ దెలిపి యడలు వారించి రయ్యగచరాధిపులు.”) |