| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“జనకజ మంగళస్నానంబుసేయఁ బనిచి దివ్యాంబరాభరణమాల్యములు వెలయఁగైసేయించి 2406వేడ్క నిక్కడికిఁ బొలఁతుకఁదోడ్తెమ్ము పొ.”మ్మన్న నతఁడు సంతసంబున నేఁగి సరమాదులైన యంతఃపురస్త్రీల కంతయుఁజెప్పి “జనకజఁదెం.”డన్న సంప్రీతి వారు చని భూమిజకు మ్రొక్కి సద్భక్తితోడ: “దేవి! నీ పతి రామదేవుండు పిలిచి యా విభీషణుతోడ నానతి యిచ్చి పుత్తెంచుటయు మమ్ముఁబుత్తెంచె; నీవు చిత్తంబులోపలఁజెల్వు వాటించి యభిమతమంగళాయతుఁడైన రామ విభుఁడున్నచోటికి విచ్చేయవలయు; నీ వేష మేటికి నెలనాఁగ! నీకు? నీవు కల్యాణివి నీరేరుహాక్షి!” యని మంగళస్నాన మర్థిఁజేయించి తనులతాతన్వికిఁ దడియొ2407త్తులొత్తి దివ్యాంబరంబుల దివ్యమాల్యముల దివ్యభూషణముల దేవిఁ గైసేసి యసమానమహిమతో నసురకామినులు పసిఁడిపల్లకియందుఁబడఁతి నెక్కించి తొడితెచ్చుటయుఁజూచి తోరంపుభక్తిఁ 2408గడు నొప్పుమిగుల రాక్షసకులేశ్వరుండు ప్రకటరాజ్యమునకు ఫాలపట్టమును నకలంక నియతి2409కి హస్తవేత్రమును ధరియించి యత్యంతధన్యతఁబొంది పరమానురక్తుఁడై బంటు2410నై కడఁగి ముందఱ రాక్షసముఖ్యులు నడవ సందడి జడియుచుఁజతురుఁడై వచ్చి యనతిదూరంబున నద్దేవి నునిచి చనుదెంచి యా విభీషణుఁడు రామునకుఁ జెచ్చెర వినతుఁడై చేతులు మొగిచి: “తెచ్చితి; విచ్చేసె దేవి.”నావుడును అతిహర్షరోషదైన్యావిష్టుఁడగుచు మతి2411లోనఁజింతించి మనుకులేశ్వరుఁడు: “పిలిచి తె.”మ్మనుడు విభీషణుండరిగి యొలసినకడఁకతో నుచితసంవేది పావన2412చరిత నప్పరమపావనుఁడు దేవి జానకిఁదోడితెచ్చుచోఁగదిసి ఘనవేత్రహస్తుఁడై కపుల రాక్షసులఁ గనుఁగొని 2413యదయుఁడై క్రంద వ్రేయుటయు నా మహాకలకలం బప్పు డాలించి రాముఁడు రాక్షసరాజు నీక్షించి: “యోహో విభీషణ! యుచితమే నీకు నూహింప2414ఁగా నిట్టియుగ్రకృత్యములు? వింతవారెవ్వరు వీరిలో మనకు? నింత నొప్పింతురే యిబ్భంగిఁగడఁగి? వలవదు వారింప;వచ్చి యందఱును గలసి చూతురుగాక! కలదె యెగ్గిందుఁ? గాలదేశాంతరక్రమమునఁ జెడని యీలు వొక్కటి మఱుఁ;గింతియకాక, యెనసినకోటలు నిండ్లును దెరలు వనితల కెందు నావరణముల్ గావు. వ్యసనంబులందు వివాహంబులందు 2415నెసగుకయ్యములందు నిష్టులయందుఁ దలకొని చెల్లు నుత్సవములయందు వలవ దావరణముల్ వారిజాక్షులకుఁ. నే2416నిందు నున్నాఁడ; నిది రణభూమి; గాన యెగ్గేమియుఁగాదు; రానిమ్ము.” అనిన విభీషణుఁడా రాఘవుండు పనిచిన తెఱఁగునఁబద్మాక్షిఁదెచ్చె. నప్పుడు కల్యాణి కవనీతనూజ కుప్పొంగుసంతోష ముల్లంబు నిండి వెలికి నేతెంచిన విధమునఁజెమట గలయఁదనూలతఁగ్రమ్మిదైవాఱ రాకాసుధాకర రామచంద్రావ లోకనామృతపాన లోలయై తేలి చిరవిరహాగ్నులఁజెచ్చెర నార్చి పరమానురాగసంభరితాత్మ యగుచు నేచినకోర్కుల నెలమి దీపింపఁ జూచెఁజూడ2417దనాక; చూచి రాఘవుని నవనతవదనయై యశ్రుపూరములు ధవళవిలోచనోత్పలములఁదొరుగ భయమును బ్రియమును బైపాటు సిగ్గుఁ బయిఁబడుచుండ నప్పడఁతుక యుండె. నప్పుడు రఘురాముఁడాత్మలోఁగోప ముప్పొంగఁదప్పక యుగ్మలిఁజూచి:[వా.రా. సర్గ 118] “మానంబె ప్రాణంబు మహితవృత్తులకు మానాభిరక్షణ మతిఁజింతసేసి; మానిని! వినుము నా మహితవర్తనకు నే నిన్నుఁదెచ్చితి; నింతియెకాని, యింతి! నీదెస నాకు నింతకుమిగుల నంతరంగంబున నాసక్తి లేదు. కాకుత్స్థకులజులు గాంభీర్యధనులు, లోకరక్షణకృతుల్, లోకైకనుతులు; వారి వంశంబున2418వరుస జన్మించి భూరివృత్తోన్నతిఁబోకార్చె నండ్రు; పగవాని యింటిలోపల నున్న నిన్నుఁ దగిలి వరించుట ధర్మంబు గాదు. “ఆలిఁగోల్పడి పోయి యక్కటా! మగుడఁ దేలేఁడితం,’డనుతిట్టుపాటునకు వెఱచి తెచ్చితిఁగాని వెలఁది, నిన్నొల్ల. నొఱపైన చోటుల నుండు పొ.”మ్మనిన జననాథుపరుషభాషాసాయకములు గొని కాఁడి నొప్పింపఁ గువలయనేత్ర[వా.రా. సర్గ 119] యప్పటిసంతోష మంతయు మఱచి చెప్ప నోరాడక చేష్టలు దక్కి తాపంబునొంది యుత్తలమంది కుంది కోపించి వగచి డగ్గుత్తిక వెట్టి జలజాప్తకులు రామచంద్రునిఁజూచి యెలనాఁగ యేడ్చుచు నేర్పడఁబలికె: “దేవ! నా చిత్తంబు దెలియదే నీకు? 2419నీవు సర్వజ్ఞమనీషివి గావె? ననుఁదెచ్చి నా పిన్ననాఁటనుండియును బెనిచి రక్షించి గాంభీర్యంబు 2420నించి యీ నీచభాషల నేల నొప్పింప? నే నేడ? నీ వేడ? నీ మాటలేడ? భూదేవికడుపునఁబుట్టితి; జనకుఁ డాదట ననుఁబెంచె; నంతటిమీఁద నృపశిరోమణివైన నీ దేవి నైతిఁ. జపలవధూవృత్తి సైఁచునే నాకు? మగవారు నమ్మనిమగువల నాడు తగవున నాడెదు2421తగవు వోవిడిచి. నమ్మనివాఁడవు నాఁడు నన్నరయఁ బొమ్మని హనుమంతుఁబుత్తెంచునపుడె చెప్పి పుత్తెంచినఁజెనఁటిప్రాణముల నప్పుడె విడువనే యడియాస లుడిగి.” యని లక్ష్మణునిఁజూచి:“యనఘ! మీయన్న యనుమాన2422ముడిగినన్నాడు చున్నాఁడు; తగునె యీ క్రియ నాడఁదరమె నా తరమె? తగనిమాటలు నీకుఁదగ దన2423ఁదగదె? కలపుణ్యగుణ2424ములఁగడచన్నప్రోడ; 2425వొలసి నీ యెఱుఁగనియుచితంబు లేదు. నావర్తనముఁ2426జూడ నాయందుఁగలదె భావింపఁగల్మష భావ మింతైన? |