అధ్యాత్మ సంకీర్తన
రేకు: 2-4
సంపుటము: 1-10
రేకు: 2-4
సంపుటము: 1-10
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మా సంధ్య | ॥సహజ॥ |
అతిశయమగు శ్రీహరిసంకీర్తన సతతంబును మా సంధ్య మతి రామానుజమతమే మాకును చతురత మెఱసిన సంధ్య | ॥సహజ॥ |
పరమభాగవతపదసేవనమే సరవి నెన్న మా సంధ్య సిరివరు మహిమలు చెలువొందఁగ వే- సరక వినుటే మా సంధ్య | ॥సహజ॥ |
మంతుకెక్క తిరుమంత్రపఠనమే సంతతమును మా సంధ్య కంతుగురుఁడు వేంకటగిరిరాయని సంతర్పణమే మా సంధ్య | ॥సహజ॥ |