అధ్యాత్మ సంకీర్తన
రేకు: 17-1
సంపుటము: 1-101
రేకు: 17-1
సంపుటము: 1-101
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఏఁటికి దలఁకెద రిందరును గాఁటపు సిరులివి కానరొ ప్రజలు | ॥ఏఁటికి॥ |
| ఎండలఁ బొరలక యేచిన చలిలో నుండక చరిలో నుడుకక అండనున్న హరి నాత్మఁ దలఁచిన పండిన పసిఁడే బ్రతుకరొ ప్రజలు | ॥ఏఁటికి॥ |
| అడవుల నలియక ఆకునలముఁ దిని కడుపులు గాలఁగఁ గరఁగక బడిబడి లక్ష్మీపతికి దాసులై పొడవగు పదవులఁ బొందరొ ప్రజలు | ॥ఏఁటికి॥ |
| పొక్కేటికాళ్ళ పుండ్లు రేఁగఁగ దిక్కుల నంతటఁ దిరుగక గక్కన తిరు[1]వేంకటగిరిపతిఁ గని వొక్క మనసుతో నుండరొ ప్రజలు | ॥ఏఁటికి॥ |
[1] ‘వేంకటపతి’ అని పూ.ము.పా.


