అధ్యాత్మ సంకీర్తన
రేకు: 200-2
సంపుటము: 2-515
రేకు: 200-2
సంపుటము: 2-515
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| వెడలె వెడలె నదె వీధులవీధుల తొడికి దైత్యులనుఁ దుంచఁగను | ॥పల్లవి॥ |
| కోటిసూర్యలొకకూటువ గూడుక చాటువ మెరసేటి చక్రము గాఁటపు వేవేలు కాలరుద్రులటు నీటునఁ దొలఁకేటి నిబిడచక్రము | ॥వెడ॥ |
| ప్రళయకాలముల బడబాగ్నలొలుకు- చలమరి ప్రతాపచక్రము కలకలరవముల కాలభైరవులు కలసి మెలంగేటి గండచక్రము | ॥వెడ॥ |
| యమసహస్రము లనంత మేకమై సమరము గెలిచేటి చక్రము అమరుచు శ్రీవేంకటాధిపు కరమునఁ దెమలకయుండేటి దివ్యచక్రము | ॥వెడ॥ |


