అధ్యాత్మ సంకీర్తన
రేకు: 200-3
సంపుటము: 2-516
రేకు: 200-3
సంపుటము: 2-516
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
మొక్కెద మిదివో మూఁడుమూర్తులును వొక్కరూపమై వొనరెఁ జక్రము | ॥పల్లవి॥ |
చెండిన రావణు శిరోమాలికల దండల పూజల తఱచుగను మెండుగఁ గంసుని మెదడు గంధముగ నిండ నలఁదుకొని నిలిచెఁ జక్రము | ॥మొక్కె॥ |
చించి హిరణ్యకసిపు పెనురక్తపు- అంచనర్ఘ్య పాద్యమ్ములను పంచజన ఘనకపాలపు టెముకను- పంచవాద్యములఁ బరగు చక్రము | ॥మొక్కె॥ |
బలు మధుకైటభ ప్రాణవాయువుల అలరిన నైవేద్యంబులను యెలిమిని శ్రీవేంకటేశు హస్తముల వెలసి నిలచె నిదె విజయచక్రము | ॥మొక్కె॥ |