అధ్యాత్మ సంకీర్తన
రేకు: 200-4
సంపుటము: 2-517
రేకు: 200-4
సంపుటము: 2-517
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
| చేకొంటి నిహమే చేరిన పరమని కైకొని నీవిందు కలవే కాన | ॥పల్లవి॥ |
| జగమునఁ గలిగిన సకలభోగములు తగిన నీప్రసాదములే యివి అడపడు నేఁబదియక్షరపంఙ్క్తులు నిగమగోచరపు నీమంత్రములే | ॥చేకొం॥ |
| పొదిగొని సంసారపుత్రదార లిల వదలని నీదాసవర్గములే చెదరక యేపొద్దుఁ జేయు నాపనులు కదిసిన నియ్యాజ్ఞాకైంకర్యములే | ॥చేకొం॥ |
| నలుగడ మించిన నాజన్మాదులు పలుమరు లిటు నీపంపు లివి యెలమిని శ్రీవేంకటేశ్వర నీ విఁక వలసినప్పుడీ వరములు నాకు | ॥చేకొం॥ |


