అధ్యాత్మ సంకీర్తన
రేకు: 17-3
సంపుటము: 1-103
రేకు: 17-3
సంపుటము: 1-103
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| చక్కఁదనముల వారసతులాల యిక్కువతెక్కువల మీ రేమి సేసే రిఁకను[1] | ॥చక్క॥ |
| ఒప్పుగా నరకము మాకు [2]బళిచ్చి మనమెల్ల కప్పము గొంటిరిగా యంగనలార అప్పుడే గోవిందునికి ఆహి వెట్టితిఁ జిత్తము యిప్పుడు యెమ్మెల మీ రేమి సేసే(?)రిఁకను[3] | ॥చక్క॥ |
| పంచమహాపాతకాల బారిఁ దోసి మా సిగ్గులు లంచము గొంటిరిగా నెలఁతలార వంచన తోడుత హరివారమైతి మిఁక మీ యించుక గుట్టుల మీరెందు చొచ్చే [4]రిఁకను | ॥చక్క॥ |
| దొంగిలి మాగుట్టులెల్లా దోవ వేసి మరుబారి భంగ పెట్టితిరిగా వోభామలార చెంగలించి వేంకటేశు సేవకుఁ జొచ్చితిమి యెంగిలి మోవులును మీ రేడఁ బడే రిఁకను | ॥చక్క॥ |
[1] నిడురేకు 26- యెక్కువతక్కువలు మీరు యెందుఁ బోయేరికను.
[2] బలి + ఇచ్చి. బలి = చర్మకోశము. ‘బలీ’ చామరదండే స్త్రీత్వకోశే గృహదారుణి ఇత్యాదిగా ప్రతాపనిఘంటు.
[3] నిడురేకు 26- యెమ్మెలు మీరు నేడఁ జొచ్చేరిఁకను
[4] నిడురేకు 26- గుట్టును మీరు యెందు.


