అధ్యాత్మ సంకీర్తన
రేకు: 201-2
సంపుటము: 3-2
రేకు: 201-2
సంపుటము: 3-2
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఏది నిజంబని యెటువలె నమ్ముదు పోదితోడ నను బోధింపవే | ॥పల్లవి॥ |
| సత్తు నసత్తని సర్వము నీవని చిత్తగించి శ్రుతి చె ప్పెడిని వుత్తమమధ్యమ మొగిఁ గలదని మరి యిత్తల శాస్త్రము లేర్పరచీని | ॥ఏది॥ |
| నానారూపులు నరహరి నీవని పూనిన విధు లిటు పొగడెడిని మానక హేయము మరి వుపాధే(దే?)యము కానవచ్చి యిలఁ గలిగియున్నవి | ॥ఏది॥ |
| భావాభావము పరమము నీ వని దైవజ్ఞులు నినుఁ దలఁచెదరు శ్రీవేంకటగిరిఁ జెలఁగిన నీవే తావుగ మదిలోఁ దగిలితివి | ॥ఏది॥ |


