Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 201-3
సంపుటము: 3-3
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
గెలిచితి భవములు గెలిచితి లోకము
యెలమి నీ దాసుల కెదురింక నేది
॥పల్లవి॥
జయ జయ నరసింహా జయ పుండరీకాక్ష
జయ జయ మురహర జయ ముకుంద
భయహరణము మాకుఁ బాపనాశనము
క్రియతోడి నీ సంకీర్తన గలిగె
॥గెలి॥
నమో నమో దేవ నమో నాగపర్యంక
నమో వేదమూ ర్తి నారాయణా
తిమిరి మమ్ముఁ గావఁగ దిక్కయి మాకు నిలువ
జమళి భుజముల శంకుఁజక్రములు గలిగె
॥గెలి॥
రక్ష రక్ష పరమాత్మ రక్ష శ్రీవేంకటపతి
రక్ష రక్ష కమలారమణ పతి
అక్షయ సుఖమియ్యఁగల న(వ?)టు దాపుదండగా
పక్షివాహనుఁడ నీభ క్తి మాకుఁ గలిగె
॥గెలి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము