అధ్యాత్మ సంకీర్తన
రేకు: 201-4
సంపుటము: 3-4
రేకు: 201-4
సంపుటము: 3-4
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| ఎక్కడ చూచిన వీరే యింటింటి ముంగిటను పెక్కుచేఁతలు సేసేరు పిలువరే బాలుల | ॥పల్లవి॥ |
| పిన్నవాఁడు కృష్ణుడు పెద్దవాడు రాముఁడు వన్నె నిద్దరమడలవలె నున్నారు వెన్నలు దొంగిలుదురు వీఁడు వాఁడు నొక్కటే పన్నుగడై వచ్చినారు పట్టరే యీ బాలుల | ॥ఎక్క॥ |
| నల్లనివాఁడు కృష్ణుడు తెల్లనివాఁడు రాముఁడు అల్లదివో జోడుకోడెలై వున్నారు వెల్లవిరై తిరిగేరు వేరు లే దిద్దరికిని పెల్లుగ యశోదవద్దఁ బెట్టరె యీబాలుల | ॥ఎక్క॥ |
| రోలఁ జిక్కె నొకఁడు రోకలి వట్టె నొకఁడు పోలిక సరిబేసికిఁ బొంచి వున్నారు మేలిమి శ్రీవేంకటాద్రి మించిరి తానే తానై ఆలించి నె(యె?)వ్వరి నేమి ననకురే బాలుల | ॥ఎక్క॥ |


