అధ్యాత్మ సంకీర్తన
రేకు: 202-1
సంపుటము: 3-7
రేకు: 202-1
సంపుటము: 3-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| పూచిన యీ దేహము పువ్వుగాని పిందెగాని చేచేత నెవ్వరికిఁ జెప్పనోపఁ బ్రియము | ॥పల్లవి॥ |
| పుట్టించిన దైవము పూరి మేపునా మమ్ముఁ బట్టిన పూర్వకర్మము పాసిపొయ్యీనా మెట్టిన సంసారము మెదిగిన పాటే చాలు తొట్టి కన్నవారినెల్ల దూర నోప మిందుకు | ॥పూచి॥ |
| నొసలఁ వ్రాసిన వ్రాలు నుసిగితే మానీనా కొసరి జగము నాకే కొత్తలయ్యీనా వుసురుతోడి సుఖము వుండిన పాటే చాలు కొసరి జన్మములింకాఁ గోరనోప నేను | ॥పూచి॥ |
| యేలినవాఁడు శ్రీహరి యేమి సేసినా మేలె వేళతో నాతఁడే శ్రీవేంకటేశుఁడు పాలించె నాతఁడు మమ్ము పదివేలులాగులను యీలాగులనే సుఖిఇం(???)చేము నేము | ॥పూచి॥ |


