అధ్యాత్మ సంకీర్తన
రేకు: 202-4
సంపుటము: 3-10
రేకు: 202-4
సంపుటము: 3-10
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
| భక్తసులభుఁడును పరతంత్రుఁడు హరి యుక్తిసాధ్య మిదె యొకరికీఁ గాఁడు | ॥పల్లవి॥ |
| నినుపగు లోకముల నిండిన విష్ణుఁడు మనుజుఁడ నాలో మనికియయ్యె మునుకొని వేదముల ముడిగిన మంత్రము కొననాలికలలోఁ గుదురై నిలిచె | ॥భక్త॥ |
| యెలమి దేవతల నేలిన దేవుఁడు నలుగడఁ నధముని నను నేలె బలుపగు లక్ష్మీపతి యగు శ్రీహరి యిల మా యింటను యిదివో నిలిచె | ॥భక్త॥ |
| పొడవుకుఁ బొడవగు పురుషోత్తముఁడిదె బుడిబుడి మా చేతఁ బూజ గొనె విడువ కిదివో శ్రీవేంకటేశ్వరుఁడు బడి వాయఁడు మా పాలిట నిలిచి | ॥భక్త॥ |


