అధ్యాత్మ సంకీర్తన
రేకు: 202-5
సంపుటము: 3-11
రేకు: 202-5
సంపుటము: 3-11
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| జ్ఞానినైనా నీకుఁ బో దజ్ఞానినైనా నీకు బోదు నేను చేసిన నేరమి నీకే సెలవయ్యా | ॥పల్లవి॥ |
| గరిమ మా పుట్టుగు నీ గర్భవాసములోనే అరయ మా మోక్షము నీ యరచేతిదే వెరవు లెంచుకోఁబోతే వేరే మాకు గతి లేదు నిరతి మా బదుకులు నీకు సెలవయ్యా | ॥జ్ఞాని॥ |
| నిండిన మా కోరికలు నీ పెర రేఁపులే వుండఁ జోటు నీకు నా వుల్లములోనే చండి పెట్టి మాకైతే స్వతంత్ర మించుకా లేదు నిండిన మా చేఁతలెల్లా నీకే సెలవయ్యా | ॥జ్ఞాని॥ |
| యిదె మా సంసారములు యిట్టె నీ కల్పితములు తుదమొదలును నీవే తోడునీడవు యెదుట శ్రీవేంకటేశ యేలిన వాఁడవు నీవే నిదుర మా దినములు నీకే సెలవయ్యా | ॥జ్ఞాని॥ |


