అధ్యాత్మ సంకీర్తన
రేకు: 203-3
సంపుటము: 3-15
రేకు: 203-3
సంపుటము: 3-15
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| అన్నిటా నా పాలిటికి హరి యాతఁడే కలఁడు యెన్నికగాఁ దుదిపద మెక్కితిమి మేలు | ॥పల్లవి॥ |
| కొందరు జీవులు నన్నుఁ గోపగించినా మేలు చెంది కొందరట్టె సంతసించినా మేలు నిందించి కొందరు నన్ను నేఁడే రోసినా మేలు పొందుగ కొందరు నన్నుఁ బొగడినా మేలు | ॥అన్ని॥ |
| కోరి నన్నుఁ బెద్దసేసి కొందరు మొక్కినా మేలు వేరే హీనుఁడని భావించినా మేలు కూరిమిఁ గొందరు నన్నుఁ గూడుకుండినా మేలు మేరతో విడిచి నన్ను మెచ్చకున్నా మేలు | ॥అన్ని॥ |
| యిప్పటికిఁ గల పాటి యెంత పేదయినా మేలు వుప్పతిల్లు సంపద నాకుండినా మేలు యెప్పుడు శ్రీవేంకటేశు కే నిచ్చిన జన్మమిది తప్పు లే దాతనితోడి తగులమే మేలు | ॥అన్ని॥ |


