అధ్యాత్మ సంకీర్తన
రేకు: 203-4
సంపుటము: 3-16
రేకు: 203-4
సంపుటము: 3-16
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| ఊరకే నీ శరణని వుండుటే నా పనిఁ గాక యీ రీతి నా వుపాయము లేడ కెక్కీనయ్యా | ॥పల్లవి॥ |
| ముందే అంతర్యామివై మొగి నాలో నుండఁగాను చెంది నిన్ను లేనివానిఁ జేసుక నామనసులో గొంది నీయాకారముగా కొంత నే భావించుకొంటా ఇందుఁ గల్పితధ్యానము లెట్టు చేసేనయ్యా | ॥ఊర॥ |
| కన్నులఁ జూచినందెల్ల కమ్మి నీవై యుండఁగాను అన్నిటాఁ బ్రత్యక్షమందు అభావన చేసుకొని విన్ననై తెలియలేక వేరే యెందొ వెదకుచు పన్నిన ప్రయాసాలఁ బడనేటికయ్యా | ॥ఊర॥ |
| శ్రీవేంకటాద్రిమీఁద శ్రీపతివై కొలువుండి ఆవటించి తలఁపులో నచ్చొత్తి నట్టుండఁగాను దేవుఁ డెట్టివాఁడంటా తెగని చదువులందు సోవలుగా నింకనేమి సోదించేనయ్యా | ॥ఊర॥ |


