అధ్యాత్మ సంకీర్తన
రేకు: 204-2
సంపుటము: 3-20
రేకు: 204-2
సంపుటము: 3-20
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| భావించి నేరనైతి పశుబుద్ధినైతిని యీవల నా యపచార మిది గావవయ్యా | ॥పల్లవి॥ |
| హరి నీవు ప్రపంచమందుఁ బుట్టించితి మమ్ము పరము నే సాధించేది బలుద్రోహమవుఁ గాదో సిరుల నేలేటివాఁడు చెప్పినట్టు సేయక విరసాలు బంట్లకు వేరే సేయఁ దగునా | ॥భావిం॥ |
| పంచేంద్రియములు నాపైఁ బంపువెట్టితివి నీవు యెంచి వాని నే దండించేదిది నేరమౌఁ గాదో పెంచేటి తల్లిదండ్రులు ప్రియమై వడ్డించఁగాను కంచము కాలఁ దన్న సంగతి యాబిడ్డలకు | ॥భావిం॥ |
| మిక్కిలి సంసారము మెడఁగట్టితివి నాకు అక్కర నే వేసారేది అపరాధమవుఁ గాదో దిక్కుల శ్రీవేంకటాద్రి దేవుఁడ నీవియ్యఁగాను యెక్కడో జీవుఁడ నేను యెదురాడఁ దగునా | ॥భావిం॥ |


