అధ్యాత్మ సంకీర్తన
రేకు: 204-3
సంపుటము: 3-21
రేకు: 204-3
సంపుటము: 3-21
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పరుష లదివో వచ్చెఁ బైపై సేవించను | ॥పల్లవి॥ |
| పాడిరి సోబాన నదే భారతియు గిరిజయు ఆడిరి రంభాదులై న అచ్చరలెల్ల కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి వేడుకలు మీరఁగ శ్రీవిభుని పెండ్లికిని | ॥గరు॥ |
| కురిసెఁ బువ్వులవాన కుప్పలై యెందు చూచిన మొరసె దేవదుందుభి మోఁతలెల్లను బెరసె సంపదలెల్ల పెంటలై శ్రీవేంకటాద్రి తిరమై మించిన దేవదేవుని పెండ్లికిని | ॥గరు॥ |
| వేసిరి కానుకలెల్ల వేవేలు కొప్పెరల పోసిరదే తలఁబ్రాలు పుణ్యసతులు ఆసల శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ దాను సేసలు వెట్టినయట్టి సింగారపు పెండ్లికి | ॥గరు॥ |


