అధ్యాత్మ సంకీర్తన
రేకు: 205-2
సంపుటము: 3-26
రేకు: 205-2
సంపుటము: 3-26
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| అద్దిరా వోయయ్య నేనంతవాఁడనా । వొక- కొద్ది నీ దాసుల సేవ కోరఁగలఁ గాక | ॥పల్లవి॥ |
| హరి నీమాయలకు నే నడ్డము చెప్పేవాఁడనా అరిదైన దదియు రాచాజ్ఞ గనక పరమపదాన కాసపడుటయు ద్రోహము సొరిది నీ భండారము సొమ్ము గనక | ॥అద్ది॥ |
| పంచేంద్రియముల నేఁ బారఁదోలేవాఁడనా ముంచి నీవు వెట్టినట్టి ముద్ర కర్తలు అంచల నా విజ్ఞాన మది దలఁచవచ్చునా నించి నీవు పాఁతినట్టి నిధాన మది | ॥అద్ది॥ |
| వొట్టి సంసారపుమోపు వోపననేవాఁడనా వెట్టి మమ్ముఁ జేయించేటి వేడుక నీది గట్టిగా శ్రీవేంకటేశ కదిసి నీ శరణంటి ఱట్టుగ నేఁ జెప్పేనా మీఱఁగ నీ రహస్యము | ॥అద్ది॥ |


