అధ్యాత్మ సంకీర్తన
రేకు: 205-4
సంపుటము: 3-28
రేకు: 205-4
సంపుటము: 3-28
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఇతనికంటె ఘను లిఁక లేరు యితర దేవతల యిందరిలోన | ॥పల్లవి॥ |
| భూపతి యీతఁడె పొదిగి కొలువరో శ్రీపతి యీతఁడే చేకొనరో యేపున బలువుఁడు నీతఁడే చేరరో పైపై వేంకటపతి యైనాఁడు | ॥ఇత॥ |
| మరుగురుఁడితఁడే మతి నమ్మఁగదరో పరమాత్ముఁ డితఁడె భావించరో కరివరదుఁ డితఁడె గతియని తలఁచరో పరగ శ్రీవేంకటపతి యైనాఁడు | ॥ఇత॥ |
| తల్లియు నితఁడే తండ్రియు నితఁడే వెల్లవిరై యిఁక విడువకురో చల్లగా నితని శరణని బ్రతుకరో అల్ల శ్రీవేంకటహరి యయినాఁడు | ॥ఇత॥ |


