అధ్యాత్మ సంకీర్తన
రేకు: 205-5
సంపుటము: 3-29
రేకు: 205-5
సంపుటము: 3-29
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| చూడ వేడుకలు సొరిది నీ మాయలు తోడనే హరి హరి దొరసీనిదివో | ॥పల్లవి॥ |
| పుట్టేటి జీవులు పొదలేటి జీవులు జట్టి గొని రిదియే జగమెల్లా కట్టిడి కర్మము కాయజు మర్మము నెట్టుకొన్న దిదె నిఖిలంబెల్లా | ॥చూడ॥ |
| ములిగేటి ధనములు మోచేటి ధనములు కలిమి మెరసె లోకంబెల్లా పొలసి వేగుటలు పొద్దు గుంకుటలు కలిగిన విదివో కాలంబెల్లా | ॥చూడ॥ |
| తగిలేటి పురుషులు తమకపు కాంతలు బగి వాయనిదీ బదుకెల్లా అగపడి శ్రీవేంకటాధిప నీ కృపఁ దెగని జీవనము దినదిన మెల్లా | ॥చూడ॥ |


