అధ్యాత్మ సంకీర్తన
రేకు: 206-2
సంపుటము: 3-32
రేకు: 206-2
సంపుటము: 3-32
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| దైవమ నీవే యిఁక దరి చేరుతువుఁ గాక జీవుల వసము గాదు చిక్కిరి లోలోననే | ॥పల్లవి॥ |
| పుట్టుట సహజ మిది పొదలే జీవుల కెల్ల గట్టిగా జగమునందు కలకాలము నట్టేటి వరదవలె నానాటి నీ మాయ కొట్టుక పారఁగఁజొచ్చె కూడిన విజ్ఞానము | ॥దైవ॥ |
| పాపమే సహజము బద్ధసంసారుల కెల్ల కాఁపురపు విధులలో కలకాలము తేపలేని సముద్రము తెరఁగున కర్మమెల్లా మాపురేపు ముంచఁజొచ్చె మతిలోని ధైర్యము | ॥దైవ॥ |
| లంపటమే సహజము లలి దేహధారులకు గంపమోపుకోరికెల కలకాలము యింపుల శ్రీవేంకటేశ ఇదె నీ దాసులని పంపుసేసి బ్రదికించె ప్రపన్నసుగతి | ॥దైవ॥ |


