అధ్యాత్మ సంకీర్తన
రేకు: 18-1
సంపుటము: 1-107
రేకు: 18-1
సంపుటము: 1-107
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం[1]
[2]పుట్టుమాలిన బరుబోఁకివి నన్నుఁ దిట్టే వదేమోసి దిమ్మరిమాయ | ॥పుట్టు॥ |
ఒరపులాడక పోవె వోసి మాయ నాతోఁ దొరలేవు నిను ముట్ట దోసము వెరపించే వేమోసి విష్ణుభక్తినంటా నెరఁగనటే నీయేతు లిన్నియును | ॥పుట్టు॥ |
వుదుటు చెల్లదు పోపో వోసి మాయ నా యెదుర మాఁటలు నీకు నిఁకనేలే, వదరేవు హరిభక్తి వనిత, తెలియరు నే నిదుర వుచ్చినవారు నీవు నా కెదురా | ॥పుట్టు॥ |
వొల్లవటే జీవ మోసి మాయ నీ కల్లలిన్నియును లోక మెఱఁగును, నల్లని విభుని మన్నన భక్తినంటాఁ జెల్లఁబో పాపపుచేఁదు మేయకువే | ॥పుట్టు॥ |
వూరకుండవుగా వోసి మాయ నిన్నుఁ బేరఁ బిలువము గుంపెనలాడేవు, నారాయణభక్తి నాతి నన్నును నిన్నుఁ గోరి యిందరు నెఱుఁగుదు రేల పోవె | ॥పుట్టు॥ |
వోవవు ననుఁ జూచి వోసి మాయ నా తోవ వచ్చినను నొత్తువు నీవు, శ్రీవేంకటగిరిదేవుని భక్తి నా హావళికే నిన్ను నలమి రిందరును | ॥పుట్టు॥ |
[1] నిడురేకు 82- సాళంగనాట.
[2] మాయకూ - హరిభక్తికీ సంవాద మీపాట.