అధ్యాత్మ సంకీర్తన
రేకు: 208-4
సంపుటము: 3-46
రేకు: 208-4
సంపుటము: 3-46
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| వేవేలు బంధములు విడువ ముడువఁబట్టె దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా | ॥పల్లవి॥ |
| పారీ ముందటి భవపాశములు తీరీఁ దొల్లిటితిత్తిలో పుణ్యము వూరీఁ గోరిక లొకటొకటే యేరీతి సుజ్ఞాన మెరిఁగేనయ్యా | ॥వేవే॥ |
| పట్టీ నాకొంగు పంచేంద్రియములు తొట్టీ బాపము తోడుతనే పెట్టీ భ్రమలఁ బెరిగి నీమాయలు అట్టే మోక్ష మెన్నఁ డందేమయ్యా | ॥వేవే॥ |
| విందై యిహము వెనకకుఁ దీసీ అందీ వై రాగ్య మరచేతికి కందువ శ్రీవేంకటపతి యీరెండు బొందించితి వేది భోగింతునయ్యా | ॥వేవే॥ |


