అధ్యాత్మ సంకీర్తన
రేకు: 208-5
సంపుటము: 3-47
రేకు: 208-5
సంపుటము: 3-47
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| ఎట్టు గెలుతుఁ బంచేంద్రియముల నేఁ బట్టరాని ఘనబలవంతములు | ॥పల్లవి॥ |
| కడు నిసుమంతలు కన్నుల చూపులు ముడుఁగక మిన్నులు ముట్టెడిని విడువక సూక్ష్మపువీనులు యివిగో బడిబడి నాదబ్రహ్మము మోచె | ॥ఎట్టు॥ |
| అదె తిలపుష్పంబంత నాసికము కదిసి గాలి ముడెగట్టెడని పొదిగె నల్లెఁడే పొంచుక నాలికె మెదలుచు సర్వము మింగెడిని | ॥ఎట్టు॥ |
| బచ్చెన దేహపు పైపొర సుఖమే యిచ్చఁ బ్రపంచం బీనెడిని చెచ్చెర మనసిది శ్రీవేంకటేశ్వరుఁ దచ్చి తలఁచఁగా దరి చేరెడిని | ॥ఎట్టు॥ |


