అధ్యాత్మ సంకీర్తన
రేకు: 209-4
సంపుటము: 3-52
రేకు: 209-4
సంపుటము: 3-52
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| అయ్యో వికల్పవాదులంతటా సిగ్గువడరు యియ్యెడ నెట్టుగలిగె నీ యసురమతము | ॥పల్లవి॥ |
| నీ ముద్రలూ నొల్లరు నీదాసోహము నొల్లరు కామించి నీ మీఁది భక్తి కడు నొల్లరు నామమంత్రము నొల్ల రనామయుండ వనెందురు తాము వైష్ణవుల మంటాఁ దర్కింతురు | ॥అయ్యో॥ |
| పైతృకవేళ నీపస్రాదమూ నొల్లరు ఘాతల నూర్ధ్వపుండ్రము గాదందురు జాతర దైవాల నిన్ను సరిగాఁ బూజింతురు ఆతల వైష్ణవులు దామనుకొందురు | ॥అయ్యో॥ |
| శ్రీవైష్ణవులఁ గంటేఁ జేతులెత్తి మొక్కరు భావింతురు పగవారిఁబలెఁ గన్నట్టు ఆవల వైకుంఠమూ ననిత్యమందురు కావించి వైష్ణవులము కామా నేమందురు | ॥అయ్యో॥ |
| వరుస రావణాదుల వలె నెజ్ఞాలు సేతురు సరుస నట్టే వేదమూఁ జదువుదురు నిరతి శ్రీవేంకటేశ నీ మహిమ లెరఁగక అరిది వైష్ణవులమే యని యాడుకొందురు | ॥అయ్యో॥ |


