అధ్యాత్మ సంకీర్తన
రేకు: 211-1
సంపుటము: 3-61
రేకు: 211-1
సంపుటము: 3-61
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| తన సొమ్మీడేరించక తా మానీనా పెనఁగుచు నే మూరకే బిగిసేముఁ గాక | ॥పల్లవి॥ |
| భూమితోఁ బ్రపంచ మెల్లఁ బుట్టించిన దేవుఁడు ఆ మీఁది పారుపత్యాన కందుకోపఁడా నామమాత్ర జీవులము నడుమంతరాల వచ్చి నేము గర్తల మనుచు నిక్కేముఁ గాక | ॥తన॥ |
| యెనలేక యెదిరికి ఇనుమడిచేవారికి తన తగర మడువఁ దడవయ్యీనా గునిసి సంసారపు కొండనే మోచేనంటా తినికేమిదియు వట్టి దీమసముఁ గాక | ॥తన॥ |
| చిత్తములో నున్నట్టి శ్రీవేంకటేశ్వరుఁడు మత్తిల్లి ననుఁ గావక మానఁబొయ్యీనా కొత్తగా నీతని నేఁడు కొలిచేమనుచు నేము తత్తరపు స్వతంత్రానఁ దగిలేముఁ గాక | ॥తన॥ |


