అధ్యాత్మ సంకీర్తన
రేకు: 211-3
సంపుటము: 3-63
రేకు: 211-3
సంపుటము: 3-63
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
| చింతలు రేఁచకు మమ్ము చిత్తమా నీవు పంతముతో మముఁ గూడి బతుకుమీ నీవు | ॥పల్లవి॥ |
| తల్లి శ్రీమహాలక్ష్మి తండ్రి వాసుదేవుఁడు ఇల్లు మాకు బ్రహ్మాండమింతా నిదె బల్లిదపు హరిభక్తి పాఁడీఁబంటా నాకు వొల్లము కర్మఫలము లొకటి నేము | ॥చింత॥ |
| జ్ఞానమే మాకు ధనము సర్వవేదములు సొమ్ము వూనిన వై రాగ్యమే వుంబళి మాకు ఆనిన గురుసేవలు ఆఁడుబిడ్డలు నాకు మేనితోనే తగులాయ మేలు మాకుఁ జేరెను | ॥చింత॥ |
| యేలికె శ్రీవేంకటేశుఁడింటి దేవపూజ మాకు పాలు గల బంధువులు ప్రపన్నులు కీలు మాకు నీతని సంకీర్తన మోక్షమునకు యేలా ఇంకా మాకు నేమిటితో గొడవ | ॥చింత॥ |


