అధ్యాత్మ సంకీర్తన
రేకు: 212-1
సంపుటము: 3-67
రేకు: 212-1
సంపుటము: 3-67
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| చెలఁగి నా కిందుకే చింతయ్యీని తెలిసినదాఁకా నిది ద్రిష్టమయ్యీనా | ॥పల్లవి॥ |
| హరి పుట్టించిన దేహి హరినే కొలువక నరులఁ గొలుచుట అన్యాయమయ్యా గరిమ నేరు గుడిచి కాలువఁ బొగడఁబోతే యెరవెరవే కాక యితవయ్యీనా | ॥చెలఁ॥ |
| దేవుఁ డిచ్చినట్టి బుద్ధి దేవుని పయిఁ బెట్టక భావ మింద్రియాల కియ్యఁ బాపమయ్యా జీవిత మొకరి సొమ్ము జీవించి యొకరి వెంట ఆవలఁ బరువులిడు టందమయ్యీనా | ॥చెలఁ॥ |
| అరిది శ్రీవేంకటేశుఁ డంతరాత్మయి వుండఁగాను శరణనకుండు టనాచారమయ్యా ధరఁ దన యింటఁ గోటిధన మట్టే వుండఁగాను మరలి తిరియఁబోతే మట్టుపడీనా | ॥చెలఁ॥ |


