అధ్యాత్మ సంకీర్తన
రేకు: 212-4
సంపుటము: 3-70
రేకు: 212-4
సంపుటము: 3-70
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| పెంచి తమ పెట్టుఁ జెట్టు పెరికివేయ రెవ్వరు మంచివాఁడఁ గాకున్న మన్నించకుండేవా | ॥పల్లవి॥ |
| తెరువు దప్పి యడవిఁ దిరిగేటివారిఁ దెచ్చి తెరువునఁ బెట్టుదురు తెలిసినవారలు నరుఁడనై నేరక నడిచేటి నన్ను నీవు మరిగించి కావక మానవచ్చునా | ॥పెంచి॥ |
| దిక్కుమాలినట్టివారిఁ దెచ్చి దయగలవారు దిక్కయి కాతురు వారి దిగఁదోయరు తక్కక మాయలోఁ బడి దరిదాపు లేని నన్ను వెక్కసాన రక్షించక విడిచేవా నీవు | ॥పెంచి॥ |
| ఆవల భయపడ్డవా రంగడిఁ బడితే దొర- లోపల విచారించి వూరడింతు రంతలోనే శ్రీవేంకటేశ నీవు సృష్టికల్లా నేలికవు వేవేలు మా మొర నీవు విచారించకుండేవా | ॥పెంచి॥ |


