అధ్యాత్మ సంకీర్తన
రేకు: 213-1
సంపుటము: 3-73
రేకు: 213-1
సంపుటము: 3-73
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| ఇతనికంటే నుపాయ మిఁక లేదు మతిలోన నున్నవాఁడు మర్మమిదే సుండీ | ॥పల్లవి॥ |
| ఇన్ని లోకసుఖములు ఇంద్రియప్రీతులే తన్నుఁ గనిన తల్లిదండ్రి తనుపోషకులే కన్ను లెదిటిధనాలు కారణార్థములే వున్నతి నిష్టార్థసిద్ధి కొక్కఁడే దేవుఁడు | ॥ఇత॥ |
| కల దేవత లిందరు కర్మఫలదాతలే లలి విద్యలెల్ల ఖ్యాతిలాభపూజల కొరకే పలుమంత్రము లెల్లను బ్రహ్మలోక మీసందివె వొలిసి ఇష్టార్థసిద్ధి కొక్కఁడే దేవుఁడు | ॥ఇత॥ |
| అనుదిన రాజ సేవ లల్పార్థ హేతులే కొనఁ గల్పవృక్షమైనఁ గోరిన విచ్చేటిదే ఘన శ్రీవేంకటేశుఁడు కల్పించె జీవునిఁ గావ- నొనర నిష్టార్థసిద్ధి కొక్కఁడే దేవుఁడు | ॥ఇత॥ |


