అధ్యాత్మ సంకీర్తన
రేకు: 213-4
సంపుటము: 3-76
రేకు: 213-4
సంపుటము: 3-76
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| నీమహి మది యెంత నీవు చేసే చేఁతలెంత దీమసపు నీ మాయలు తెలియరాదయ్యా | ॥పల్లవి॥ |
| నీ పాదతీర్థము నెత్తి మోచె నొకఁడు పూఁపకొడుకై యొకఁడు బొడ్డునఁ బుట్టె యేపున నింతటివారి కెక్కుడైన దైవమవు మోపుచు ధర్మరాజుకు మొక్కుటెట్టయ్యా | ॥నీమ॥ |
| నీ లీల జగమెల్లా నిండి యున్నదొకవంకఁ నోలి నీలో లోకాలున్నవొకవంక యే లీలఁ జూచినాను యింతటి దైవమవు బాలుఁడవై రేపల్లెలోఁ బారాడితివెట్టయ్యా | ॥నీమ॥ |
| శ్రీసతికి మగఁడవు భూసతికి మగఁడవు యీ సరుస శ్రీవేంకటేశుఁడవు రాసి కెక్కి నీవింతటి రాజసపు దైవమవు దాసులము మా కెట్ల దక్కితివయ్యా | ॥నీమ॥ |


