అధ్యాత్మ సంకీర్తన
రేకు: 18-5
సంపుటము: 1-111
రేకు: 18-5
సంపుటము: 1-111
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| దిక్కిందరికినైన దేవుఁడు కడుఁ దెక్కలికాఁడైన దేవుఁడు | ॥దిక్కిందరికి॥ |
| కొత్తపెండ్లికూఁతుఁ[1] గోరి చూడఁబోయి యెత్తి తేరిమీఁద నిడుకొని నెత్తికన్ను మానినవాని పెండ్లికి దెత్తి గొన్నయట్టి దేవుఁడు | ॥దిక్కిందరికి॥ |
| గొప్పయిన పెద్దకొండమీఁద నుండి దెప్పరమ్ముగా దిగఁబడి కప్పి రెండు దునుకలు గూడినవాని తిప్పుఁ దీరులాడే దేవుఁడు | ॥దిక్కిందరికి॥ |
| బెరసి మేనమామ బిడ్డకునై పోయి నిరతంపు బీరాలు నెరపుచు యిరవైన మాయపుటెద్దులఁ బొరిగొన్న తిరువేంకటగిరిదేవుఁడు | ॥దిక్కిందరికి॥ |
[1] ‘కూఁతు కోరి’ అని రేకు.


